
రోహిత్ శర్మ సెంచరీ
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. స్టార్క్ బౌలింగ్ (36 వ ఓవర్)లో బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేశాడు. 109 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ వంద మార్కును దాటాడు. రోహిత్కు తోడుగా కెప్టెన్ ధోని క్రీజులో ఉన్నాడు. జట్టు స్కోరు 36 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
రోహిత్ మరో రికార్డు
దీంతో రోహిత్ మరిన్న రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. మెల్ బోర్న్ గ్రౌండ్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు (101), సిక్సర్లు(3) చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డులోకెక్కాడు. ఇంతకుముందు ఈ గ్రౌండ్ లో భారత్ తరఫున శ్రీకాంత్ , అగార్కర్ లు 2 సిక్సర్లు బాదారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2000లో ఆస్ట్రేలియా పై 100 పరుగులు చేశాడు.