ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు మ్యాచ్ అడ్డంకిగా మారింది.
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియాల మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. సోమవారం జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం మరోసారి ఆటంకం కల్గించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు.
టాస్ గెలిచిన ఆసీస్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వర్షం వచ్చే సమయానికి భారత్ 2.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (1), రహానే (2) క్రీజులో ఉన్నారు. ఆదిలోనే మూడు పరుగులు వైడ్ ల రూపంలో రావడం గమనార్హం.