
ధావన్ వికెట్ తీసిన ఆనందంలో స్టార్క్
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో తన సత్తా ఏంటో చూపించి వారెవ్వా అనిపించాడు.
మెల్ బోర్న: ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో జరిగే రెండో వన్డేలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో తన సత్తా ఏంటో చూపించి వారెవ్వా అనిపించాడు. భారత్ స్కోరుకు అడ్డుకట్ట వేయటంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్ నుంచే ఇండియా మీద పైచేయి సాధిస్తూ బ్యాట్స్మెన్లందరినీ పెవిలియన్కు చేర్చాడు.
ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు రెండుసార్లు తీశాడు. జట్టు స్కోరు 237 ధోని, అక్షర్ పటేల్లను, 262 పరుగుల వద్ద రోహిత్, భువనేశ్వర్లను పెవిలియన్కు పంపాడు. రహానే, కోహ్లి మినహా మిగతా వికెట్లన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ బౌలర్. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు.