ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా పదిహేను ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది.
సిడ్నీ:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ లో టీమిండియా పదిహేను ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. ఓపెనర్ అజ్యింకా రహానే(27), విరాట్ కోహ్లీ(1) క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కు రెండు సార్లు వర్షం ఆటంకం కల్గించడంతో 44 ఓవర్లకు కుదించారు.
అంబటి రాయుడు 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్ తో 23 పరుగులు చేసి మార్ష్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరగగా, ఓపెనర్ శిఖర్ ధావన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే.