234 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ | Australia v England: Tri-Series: England all out | Sakshi
Sakshi News home page

234 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

Published Fri, Jan 16 2015 12:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

234  పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

234 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

ముక్కోణపు వన్డే సిరీస్లో ఇంగ్లండ్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించి ఇంగ్లండ్ జట్టు ప్రారంభంలో

సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ప్రారంభంలో తడబడినా ఆ తర్వాత కోలుకుని గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. మోర్గాన్ బాధ్యతాయుతమైన సెంచరీ...జట్టుకు కలిసి వచ్చింది.

 

ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. ఆరంభంలో ఆసీస్ మెరుపు దాడికి బిత్తరపోయిన టాప్ ఆర్డర్  ఆటగాళ్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్ 4, ఫాల్కనర్ 3, మాక్స్వెల్, డోహర్టీ, కమ్మిన్స్ ..ఒకో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement