25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
బ్రిస్బేన్ : ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ 25 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఇంగ్లండ్ ఓపెనర్ మహ్మద్ అలీ(8) పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్ స్టువర్ట్ బిన్నీ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన అలీ పెవిలియన్ కు చేరుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటింగ్ లో బొక్క బోర్లా పడి 154 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్ధికి నిర్దేశించింది. ఆ దిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.