ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన ఇంగ్లండ్ మంచి ఊపుమీద ఉంది. ఓపెనర్లు మహ్మద్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు.
అలీ(46) పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. అయితే గత మ్యాచ్ లో ఆకట్టుకున్న ఇయాన్ బెల్(73)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అతనికి జతగా టేలర్(3)పరుగులతో ఆడుతున్నాడు.