
పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. తాజా రికార్డుతో మరోసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టిన బాబర్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. ఇటీవల ఐసీసీ అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీని వెనక్కు నెట్టిన బాబర్.. ఈసారి టీ20ల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల చేసి కోహ్లిని అధిగమించాడు.
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 లో బాబార్ ఈ ఘనతను సాధించాడు. టీ20ల్లో 2వేల పరుగులు చేయడానికి కోహ్లి 56 ఇన్నింగ్స్‌లు తీసుకోగా బాబర్ ఈ ఘనతను కేవలం 52 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం విశేషం. ఇక ఈ వరుసలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (62 ఇన్నింగ్స్), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (66 ఇన్నింగ్స్) మూడవ, నాలుగో స్థానాల్లో ఉన్నారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకారం బాబర్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు.
( చదవండి: ఆ బౌన్సర్‌కు హెల్మెట్ సెపరేట్ అయ్యింది..! )
Comments
Please login to add a commentAdd a comment