
హరారే: ప్రపంచకప్‌లో ఆడాలన్న జింబాబ్వే ఆశలు ఆవిరయ్యాయి. క్వాలిఫయర్స్‌లో భాగంగా యూఏఈతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఓటమిపాలైంది. చివరి బంతికి సిక్సర్ కొడితే జింబాబ్వే గెలిచేదే, కానీ క్రీజులో ఉన్న ఇర్విన్ రెండు పరుగులే చేయడంతో యూఏఈ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 47.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రమీజ్ (59) టాప్ స్కోరర్. వర్షం కారణంగా జింబాబ్వే లక్ష్యాన్ని 40 ఓవర్లలో 230కి కుదించగా.. సీన్ విలియమ్స్ (80) పోరాడినా, జింబాబ్వే 226/7కే పరిమితమై ఓటమిపాలైంది.
1979 తర్వాత జింబాబ్వే ప్రపంచ కప్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. వరల్డ్ కప్‌కు జింబాబ్వే అర్హత సాధించలేకపోవడంతో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు రేసులోకి వచ్చాయి. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే రన్‌రేట్ ప్రకారం ఐర్లాండ్ ముందుకు వెళుతుంది.
Comments
Please login to add a commentAdd a comment