
ఢాకా: సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ అజేయంగా దూసుకెళుతోంది. జింబాబ్వేతో లీగ్ మ్యాచ్‌లో బంగ్లా 91 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 216 పరుగులు చేసింది. తమీమ్ (76; 6 ఫోర్లు), షకీబుల్ హసన్ (51; 6 ఫోర్లు) రాణించారు.
తర్వాత జింబాబ్వే 36.3 ఓవర్లలో 125 పరుగుల వద్ద ఆలౌటైంది. షకీబుల్ 3 వికెట్లు పడగొట్టగా, మొర్తజ, సుంజాముల్ ఇస్లామ్, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు.