ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20, టీ10 లీగ్‌లు పట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. తాజాగా జింబాబ్వే కూడా ఓ టీ10 లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్‌కు జింబాబ్వే క్రికెట్ 'జిమ్ ఆఫ్రో టీ10' అని నామకారణం చేసింది.
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి.
సంజయ్ దత్ న్యూ జర్నీ..
ఇక ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సర్ సోహన్ రాయ్‌తో కలిసి హరారే ఫ్రాంచైజీని సంజయ్ దత్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని సంజయ్ దత్ కూడా దృవీకరించాడు.
"భారత్‌లో క్రికెట్ ఒక మతం వంటింది. అదే విధంగా ప్రపంచక్రికెట్‌లో భారత్ ఒక ప్రత్యేక గుర్తుంపు ఉంది. ప్రపంచంలో ప్రతీ చోట క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలని నేను ఎప్పుడూ ఆశిస్తాను. జింబాబ్వే కూడా గొప్ప క్రీడా చరిత్రను కలిగిఉంది. అటువంటి జింబాబ్వే క్రికెట్‌లో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో టీ10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను" అని సంజయ్ దత్ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment