హరారే : భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటన ఖరారయింది. మూడు వన్డేలు, రెండు టి20లు ఆడేందుకు భారత జట్టు జులై 7న హరారే చేరుతుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలను ఈ వారంలో ప్రకటిస్తారు. చివరిసారిగా భారత జట్టు 2013లో జింబాబ్వేలో పర్యటించి ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.