జింబాబ్వే పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్ జట్టు... వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన అఫ్గాన్... తాజాగా వన్డే సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 30.1 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (61 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కెపె్టన్ ఇరి్వన్ (5), ఆల్‌రౌండర్ సికందర్ రజా (13), బెనెట్ (9) ఒకరివెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు.
అఫ్గాన్ బౌలర్లలో ఘజన్‌ఫర్ 5 వికెట్లతో విజృంభించగా... రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 26.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సెదిఖుల్లా అతల్ (50 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఘజన్‌ఫర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సెదిఖుల్లా అతల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు జరగనుంది.
చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం
Comments
Please login to add a commentAdd a comment