ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ యువ ఆల్‌రౌండర్ గాయం బారిన పడ్డాడు. ఫలితంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
ఈ క్రమంలో తీశ్ రెడ్డి స్థానంలో శివం దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం ప్రకటించింది.
వైజాగ్ కుర్రాడు
కాగా విశాఖపట్నానికి చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున అదరగొట్టిన ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు.
జింబాబ్వే పర్యటన కోసం
ఈ సీజన్ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతడిని ఎంపిక చేశారు.
ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టుకు సెలక్ట్ అయిన తొలి ఆంధ్ర క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి చరిత్రకెక్కాడు. అయితే, ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
అతడితో భర్తీ
నితీశ్ రెడ్డి చికిత్స నిమిత్తం ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి స్థానాన్ని ముంబై పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేతో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.
కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లంతా విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో జింబాబ్వే టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇక జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ హరారే వేదిక.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు(రివైజ్డ్)
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే.
చదవండి: ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!
Nitish Kumar Reddy: అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది
Comments
Please login to add a commentAdd a comment