
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 టోర్నమెంట్ రెండో సీజన్‌లో రాయలసీమ కింగ్స్ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్ జట్టును ఓడించింది.



























