apl
-
APL 2023: ఉత్తరాంధ్ర లయన్స్‌పై బెజవాడ టైగర్స్ జయభేరి
-
APL 2023: ఉత్కంఠగా సాగుతున్న ఏపీఎల్.. ఫోటోలు
-
APL 2023: బెజవాడ టైగర్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయం(ఫొటోలు)
-
APL 2022: ఏపీఎల్‌లో రాణిస్తున్న వైజాగ్ ఆటగాళ్లు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్.. క్రికెట్ ఆడే ప్రపంచ దేశాల్లోని ఆట గాళ్లకు ఎంతో మోజు. దేశంలో ఈ లీగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ప్రీమి యర్ లీగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ స్ఫూర్తితో ఆంధ్రాలో ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ప్రారంభమైంది. లీగ్ తొలి దశ శుక్రవారంతో ముగిసింది. లీగ్‌ల్లో నాలుగు ప్రాంచైజీ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. రాయలసీమ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా వైజాగ్ వారియర్స్ ఒక మ్యాచ్‌నే ఆడింది. దీంతో బెజవాడ టైగర్స్‌తో పాటు మిగిలిన మూడు జట్లు ఆరేసి పాయింట్లు సాధించినా.. నెట్ రన్‌రేట్‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర లయన్స్ రెండో స్థానంలో, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ మూడో స్థానంలో, గోదావరి టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. రాణిస్తున్న మన కుర్రాళ్లు ఉత్తరాంధ్ర నుంచి రెండు ప్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా సెంట్రల్ ఆంధ్ర, దక్షిణాంధ్ర నుంచి మరో రెండేసి ప్రాంచైజీలకు అర్హత కల్పించారు. ఉత్తరాంధ్ర నుంచి హోం టీమ్‌గా వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు ఆడుతున్నాయి. వైజాగ్ వారియర్స్‌కు విశాఖ ఆటగాళ్లు లేకున్నా.. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు కెప్టెన్‌గా భరత్‌ను, బౌలర్ అజయ్‌ను తీసుకుంది. అయితే అజయ్‌కు తొలి మ్యాచ్‌లో బాటింగ్ చేసే అవకాశం రాకుండానే జట్టు విజయం సాధించగా.. భరత్ అందుబాటులో లేడు. రెండో మ్యాచ్‌కు భరత్ అందుబాటులోకి వచ్చినా.. వర్షం అడ్డంకిగా మారి మ్యాచ్ రద్దయింది. సెంట్రల్ ఆంధ్ర నుంచి పోటీపడుతున్న రెండు జట్లకు విశాఖ కుర్రాళ్లే కెప్టెన్లుగా ముందుండి.. ఆడిన తొలి మ్యాచ్‌ల్లో జట్లను విజయతీరానికి చేర్చారు. బెజవాడ టైగర్స్‌కు అంతర్జాతీయ ఆటగాడు రికీబుయ్ ముందుండి నడపడమే కాక తొలి మ్యాచ్‌లో మూడో వికెట్ పడకుండానే విశాఖ కుర్రాడు అవినాష్‌తో కలిసి అజేయంగా ఉండి జట్టును గెలిపించాడు. బౌలర్ మనీష్ రెండు వికెట్లతో పాటు చివరి బ్యాటర్‌ను రనౌట్ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్‌కే నిలువరించడంలో సహకరించాడు. ఇక బి.సుమంత్(21 బంతుల్లోనే రెండు ఫోర్లతో 31 పరుగులు) ఓపెనర్‌గా వచ్చి తొలి వికెట్‌కు 66 పరుగుల(లక్ష్య ఛేదనలో సగం పరుగులు) భాగస్వామ్యాన్ని అందించాడు. టాప్ ఆర్డర్లో అవినాష్, రికీబుయ్ జోడీ వికెట్ చేజారుకుండానే జట్టును గెలిపించింది. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్‌ను విశాఖ కుర్రాడు శశికాంత్ కెప్టెన్సీలో విజయతీరానికి చేర్చి శుభారంభం చేశాడు. టోర్నీలోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయడమే కాక మ్యాచ్ బెస్ట్‌గానూ నిలిచాడు. విశాఖ కుర్రాళ్లు ఓపెనర్‌గా హేమంత్, టాప్ ఆర్డర్లో నితీష్(25) రాణించారు. ఇక దక్షిణాంధ్ర జట్లు కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్‌లో ఒక్క విశాఖ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు. అటు ఐపీఎల్‌లోనే కాకుండా ఏపీఎల్‌లో సైతం స్థానిక ఆటగాళ్లు ఇతర ప్రాంచైజీ జట్లకు ఆడుతూ విజయంలో కీలకపాత్ర పోషించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. వరుణుడి రాకతో మ్యాచ్‌లు రద్దు ఏపీఎల్‌లో భాగంగా వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెజవాడ టైగర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఏడు ఓవర్లలో మూడు వికెట్లకు 23 పరుగుల చేసిన స్థితిలో వరుణుడు ప్రవేశించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకు రెండేసి పాయింట్లు చేకూరాయి. రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సిన మ్యాచ్ సైతం వర్షం కారణంగా రద్దయింది. దీంతో గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ జట్లకు చెరో రెండేసి పాయింట్లు కేటాయించారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!) -
APL 2022: ఏపీఎల్ మొదటి సీజన్ షురూ
విశాఖ స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం ప్రపంచ క్రికెట్ ఆడే అన్ని ఫార్మాట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగానూ పేరుగాంచింది. ఇప్పుడు సరికొత్త సీజన్ ఇక్క డి నుంచి ప్రారంభమవుతోంది. అదే ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్). దేశవాళీ క్రికెట్లో అన్ని తరహా మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడంతో పాటు అంతర్జాతీయ టెస్ట్‌లు, వన్డేలు, టీ–20లు, ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లకు హోమ్ పిచ్‌గా వైఎస్సార్ స్టేడియం సేవలందించింది. ఇప్పటికే ఐపీఎల్–15 సీజన్లు పూర్తయినా.. ఆంధ్రా నుంచి ఆడిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆంధ్రా క్రికెటర్లను ఆ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఏపీఎల్ సిద్ధమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాంతో.. ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర ఆధ్వర్యంలో.. బీసీసీఐ గుర్తింపుతో ఏపీఎల్ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఆంధ్రా తరపున ఆడి ప్రతిభ కనబరిచిన మేటి ఆటగాళ్లను వేలం ద్వారా ఆరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. ఈ నెల 17వ తేదీన టైటిల్ పోరు జరగనుండగా.. విజేతకు ట్రోఫీ అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతుండటం విశేషం. ఆరంభం ఇలా.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) తొలి సీజన్ టీ–20 మ్యాచ్‌లు షురూ అయ్యాయి. వైఎస్సార్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నపు సెషన్ మ్యాచ్ ఒంటి గంటకు ప్రారంభమైంది. రెండో మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆరున్నరకు ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్‌తో గోదావరి టైటాన్స్ తలపడగా లీగ్ చివరి మ్యాచ్‌లో 13న రాయలసీమ కింగ్స్‌తో వైజాగ్ వారియర్స్ జట్టు తలపడ్డాయి. ఇక ప్లేఆఫ్‌ల్లో లీగ్ 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుండగా.. 1, 2వ స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇవీ ఫ్రాంచైజీలు ఉత్తరాంధ్ర నుంచి రెండు ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా.. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టును కాయల వెంకటరెడ్డి, వైజాగ్ వారియర్స్ జట్టును సీహెచ్ తిరుమలరావు దక్కించుకున్నారు. సెంట్రల్ ఆంధ్ర నుంచి బెజవాడ టైగర్స్‌ను పి.వి రమణమూర్తి, గోదావరి టైటాన్స్‌ను పి.హరీష్‌బాబు, దక్షిణాంధ్ర నుంచి కోస్టల్ రైడర్స్‌ను ఎం.వెంకటరెడ్డి, రాయలసీమ కింగ్స్‌ను పి.వెంకటేశ్వర్ సొంతం చేసుకున్నారు. వీరంతా గత రెండు సీజన్లలో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రా తరఫున ప్రతిభ కనబరిచిన 20 మంది చొప్పున వేలంలో ఎంపిక చేసుకున్నారు. రంజీల్లో ఆరేళ్లుగా సత్తా చాటుతున్న 12 మందిలో ఇద్దరినీ చొప్పున జట్లకు ఐకాన్లుగా తీసుకున్నారు. వారు ఆడిన స్థాయిలను బట్టి ఆయా ఫ్రాంచైజీలు రూ.30 లక్షల వరకు వెచ్చించి ఎంపిక చేసుకున్నాయి. దేశంలో లీగ్‌లు ఐపీఎల్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం పొందింది. అదే స్ఫూర్తితో దేశంలోనూ బీసీసీఐ గుర్తించిన కొన్ని లీగ్‌లు జరుగుతున్నాయి. 2009–10 సీజన్లోనే కర్నాటక ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇదే రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియర్ లీగ్. ప్రైజ్ పూల్‌గా రూ.20లక్షలు అందిస్తున్నారు. ఒకటిన్నర కోట్ల ప్రైజ్ పూల్తో ముంబయి లీగ్ 2018లో ప్రారంభించగా, అత్యధిక రూ.2.25కోట్ల ప్రైజ్‌పూల్‌తో తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2016 నుంచి కొనసాగుతోంది. ఒడిదొడుకుల్లో లీగ్‌లు ఒడిశా ప్రీమియర్ లీగ్ 2011లోనే ప్రారంభమైనా ఒడిదొడుకులతో నాలుగే సార్లు జరిగింది. రూ.6లక్షల ప్రైజ్ పూల్ ఇస్తోంది. సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2019లో నిర్వహించగా... కేరళ ప్రెసిడెంట్స్ కప్ 2020లో నిర్వహించారు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2009లో, తెలంగాణ ప్రీమియర్ లీగ్ 2018లో జరిగాయి. ఇక రాజపుటానా ప్రీమియర్ లీగ్, రాజ్వాడ క్రికెట్ లీగ్‌లు తొలి సెషన్స్‌లోనే మ్యాచ్ ఫిక్సింగ్ కారణాలతో సస్పెండ్ చేశారు. దీంతో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీఎల్‌ను విజయవంతం చేసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కృషి చేస్తోంది. గోదావరి టైటాన్స్ గోదావరి టైటాన్స్ రూ.6.1 లక్షలతో ఆల్‌రౌండర్ శశికాంత్‌తో పాటు బ్యాటర్ నితీష్ కుమార్‌ను రూ.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్‌లో దూకుడు చూపేందుకు సిద్ధమైంది. అనుభవజ్ఞుడు వటేకర్ కోచ్‌గా ఉండగా సందీప్, ధీరజ్, ఇస్మాయిల్, సాత్విక్, ఎం. వంశీకృష్ణ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆడారు. ఉత్తరాంధ్ర లయన్స్ ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఆల్‌రౌండర్ షోయిబ్‌ను రూ.2లక్షలతోనే ఐకాన్‌గా ఎంచుకుంది. జట్టు విజయసారథి శిక్షణలో అహితేష్, క్రాంతి, తరుణ్, సుబ్రహ్మణ్యం, ప్రమో, రఫీ, సాయికౌషిక్, అజయ్ తదితరులతో ముందుకు నడవనుంది. బెజవాడ టైగర్స్ బెజవాడ టైగర్స్ జట్టు రూ.8.1 లక్షలతో బ్యాటర్ రికీబుయ్‌ను తీసుకున్నా.. బౌలింగ్‌లో మెరుపులు మెరిపించేందుకు అయ్యప్పను కేవలం రూ.లక్షన్నరకే దక్కించుకుంది. వి.అప్పారావు కోచింగ్‌లో సాయిరాహుల్, మహీష్, లలిత్, అఖిల్, మనీష్, సుమంత్, సాయితేజ తదితరులు ఆడనున్నారు. వైజాగ్ వారియర్స్ వైజాగ్ వారియర్స్ జట్టు బ్యాటర్ అశ్విన్ హెబ్బర్‌ను అత్యధికంగా రూ.8.7 లక్షలతో కొనుగోలు చేసింది. మరో ఐకాన్ ఆల్‌రౌండర్ నరేంద్ర రెడ్డిని రూ.4లక్షలకు చేజిక్కించుకుంది. విన్సెంట్ కోచింగ్‌లో ధ్రువ్, కార్తీక్, వేణు, మనోహర్, కరణ్, గిరినాథ్, సుదర్శన్, మల్లికార్జున తదితరులు జట్టుకు ఆడనున్నారు. కోస్టల్ రైడర్స్ కోస్టల్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ స్టీఫెన్‌ను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేయగా మరో ఐకాన్ బౌలర్ హరిశంకర్పైనే దృష్టి పెట్టి 1.6 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్‌కుమార్ కోచ్‌గా లేఖజ్, తపస్వి, జ్ఞానేశ్వర్, అషిష్, హర్షవర్ధన్, మనీష్, రవికిరణ్, విజయ్ తదితరులు జట్టుకు ఆడనున్నారు. రాయలసీమ కింగ్స్ రాయలసీమ కింగ్స్ రూ.6.1 లక్షలతో ఆల్‌రౌండర్ గిరినాథ్‌ను, ఇటీవల జూనియర్స్‌లో సత్తాచాటిన రషీద్‌ను రూ.3.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్‌లో బలం సొంతం చేసుకుంది. శ్రీనివాస్ కోచ్‌గా దుర్గాకుమార్, ప్రశాంత్, వంశీకృష్ణ, సంతోష్, అభిషేక్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!) -
రూ. 100 కే నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏపీఎల్ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు ఎగువనున్న వారు) వంద రూపాయలకే నల్లా కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేశారు. ఇప్పటికే బీపీఎల్ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు దిగువనున్న వారు) ప్రభుత్వం రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తుండగా దాన్ని యథావిధిగా కొనసాగించనుంది. ఇతరులు పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ పొందేందుకు ఇప్పటివరకు రూ. 6,000 డిపాజిట్ తీసుకుంటుండగా ఇంటి లోపల నల్లా పెట్టుకోవడానికి ప్రస్తుతం రూ. 10,500 డిపాజిట్ తీసుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్ రుసుము ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ‘మిషన్ భగీరథతో అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోంది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే డిపాజిట్‌ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లా కనెక్షన్ డిపాజిట్‌ను తగ్గిస్తున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మిషన్ భగీరథతో అందే శుద్దిచేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1.20 లక్షల ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. డిపాజిట్ ఎక్కువగా ఉన్నందున మిగతా ఇంటి యజమానులు ముందుకు రావడంలేదు. దీంతో 6.7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లభించలేదు. వీటికితోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల మందికి నల్లా కనెక్షన్ అందాల్సి ఉంది. అంతా కలిపి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. డిపాజిట్ ఎక్కువ ఉన్నందున వీరు నల్లా కనెక్షన్ తీసుకునేందుకు ముందుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనివల్ల ప్రజలందరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు తాగించాలనే లక్ష్యం నెరవేరదు. అందుకే ఆర్థికంగా భారమైనప్పటికీ మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చెల్లించాల్సిన డిపాజిట్‌ను నామమాత్రం చేయాలని నిర్ణయించాం. ప్రజలందరూ శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’అని సీఎం కేసీఆర్ అన్నారు. -
రసవత్తరంగా ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం జిల్లా క్రికెట్ సంఘం, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అనంత ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. జిల్లాలోని అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో 2, కణేకల్లులో 2 మ్యాచ్‌ల చొప్పున జరగగా, తాడిపత్రి, కొనకొండ్ల, మడకశిర, బత్తలపల్లి క్రీడా మైదానాల్లో ఒక్కో మ్యాచ్ జరిగాయి. అనంతపురం, నార్పల క్రీడాకారులు సెంచరీలతో చెలరేగి తమ జట్లను విజయతీరాలకు చేర్చారు. అనంతపురం విజయకేతనం అనంతపురం, విశ్వనాథన్ ఆనంద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 213 పరుగులు చేసి, 8 వికెట్లు కోల్పోయింది. జట్టులో నవీ¯ŒS చక్కటి ప్రదర్శన కనబరచి 100 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విశ్వనాథన్ ఆనంద్ జట్టు 19 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంత జట్టులో ఆరిఫ్ 4, మీరజ్ 3 వికెట్లు తీసి జట్టుకు 148 పరుగుల తేడాతో విజయాన్ని సాధించారు. నార్పలకు భారీ విజయం విన్సెంట్ మైదానంలో బీకేఎస్, నార్పల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 50 ఓవర్లలో 272 పరుగులు చేసి, 8 వికెట్లు కోల్పోయింది. జట్టులో శ్రీకాంత్ 108 పరుగులు చేయగా, ప్రశాంత్ 43 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీకేఎస్ జట్టు 94 పరుగులకే కుప్పకూలింది. నార్పల బౌలర్ శ్రీకాంత్ 5 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. సోమనాథ్ మూడు వికెట్లు తీశాడు. దీంతో నార్పల జట్టు 178 పరుగుల తేడాతో విజయం సా«ధించింది. కణేకల్లుపై నెగ్గిన ఆత్మకూరు కణేకల్లు, ఆత్మకూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కణేకల్లు జట్టు 28.5 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆత్మకూరు జట్టు 29.1 ఓవర్లలో 132 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి, విజయం సా«ధించింది. ఆత్మకూరు జట్టులో దిలీప్‌కుమార్ 78 పరుగులు చేశాడు. తాడిపత్రి జయకేతనం తాడిపత్రి, గుత్తి జట్ల మధ్య తాడిపత్రిలో జరిగిన మ్యాచ్‌లో గుత్తి జట్టు టాస్‌ను గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగింది. 45.2 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. జట్టులో రాజు 34, కార్తీక్ 28 పరుగులు చేశారు. తాడిపత్రి బౌలర్లలో వెంకటనాథ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాడిపత్రి జట్టు 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాడిపత్రి జట్టులో లక్ష్మణ్ 30, రమేష్ 25 పరుగులు చేశారు. విన్సెంట్ ఫెర్రర్ జట్టు అలవోక విజయం మడకశిరలో జరిగిన మ్యాచ్‌లో మడకశిర, విన్సెంట్ ఫెర్రర్ మడకశిర జట్లు తలపడ్డాయి. మడకశిర జట్టు టాస్ గెలిచి బౌలింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు దిగిన మడకశిర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 162 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన విన్సెంట్ ఫెర్రర్ జట్టు 27 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి విజయం సాధించింది. రాయదుర్గం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కళ్యాణదుర్గం జట్టు విజయం సాధించింది. కొనకొండ్ల జట్టుపై గుంతకల్లు జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యల్లనూరు జట్టుపై బత్తలపల్లి జట్టు 66 పరుగులతో విజయం సా«ధించింది. బత్తలపల్లి బౌలర్ నరేష్ హ్యాట్రిక్ సాధించి జట్టు విజయానికి దోహదపడ్డాడు. వచ్చేవారం లీగ్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ప్రసన్న తెలిపారు.