రసవత్తరంగా ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు | Myths' s largesse included matches | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు

Published Mon, Dec 12 2016 12:31 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

రసవత్తరంగా ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు - Sakshi

రసవత్తరంగా ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అనంతపురం జిల్లా క్రికెట్‌ సంఘం, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అనంత ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) క్రికెట్‌ పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. జిల్లాలోని అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో 2, కణేకల్లులో 2 మ్యాచ్‌ల చొప్పున జరగగా, తాడిపత్రి, కొనకొండ్ల, మడకశిర, బత్తలపల్లి క్రీడా మైదానాల్లో ఒక్కో మ్యాచ్‌ జరిగాయి. అనంతపురం, నార్పల క్రీడాకారులు సెంచరీలతో చెలరేగి తమ జట్లను విజయతీరాలకు చేర్చారు.  
అనంతపురం విజయకేతనం 
అనంతపురం, విశ్వనాథన్ ఆనంద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన అనంత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 213 పరుగులు చేసి, 8 వికెట్లు కోల్పోయింది. జట్టులో నవీ¯ŒS చక్కటి ప్రదర్శన కనబరచి 100 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విశ్వనాథన్  ఆనంద్‌ జట్టు 19 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. అనంత జట్టులో ఆరిఫ్‌ 4, మీరజ్‌ 3 వికెట్లు తీసి జట్టుకు 148 పరుగుల తేడాతో విజయాన్ని సాధించారు.  
నార్పలకు భారీ విజయం  
విన్సెంట్‌ మైదానంలో బీకేఎస్, నార్పల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 50 ఓవర్లలో 272 పరుగులు చేసి, 8 వికెట్లు కోల్పోయింది. జట్టులో శ్రీకాంత్‌ 108 పరుగులు చేయగా, ప్రశాంత్‌ 43 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీకేఎస్‌ జట్టు 94 పరుగులకే కుప్పకూలింది. నార్పల బౌలర్‌ శ్రీకాంత్‌ 5 వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచాడు. సోమనాథ్‌ మూడు వికెట్లు తీశాడు. దీంతో నార్పల జట్టు 178 పరుగుల తేడాతో విజయం సా«ధించింది.  
కణేకల్లుపై నెగ్గిన ఆత్మకూరు 
కణేకల్లు, ఆత్మకూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కణేకల్లు జట్టు 28.5 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆత్మకూరు జట్టు 29.1 ఓవర్లలో 132 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి, విజయం సా«ధించింది. ఆత్మకూరు జట్టులో దిలీప్‌కుమార్‌ 78 పరుగులు చేశాడు.  
తాడిపత్రి జయకేతనం 
తాడిపత్రి, గుత్తి జట్ల మధ్య తాడిపత్రిలో జరిగిన మ్యాచ్‌లో గుత్తి జట్టు టాస్‌ను గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగింది. 45.2 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. జట్టులో రాజు 34, కార్తీక్‌ 28 పరుగులు చేశారు. తాడిపత్రి బౌలర్లలో వెంకటనాథ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాడిపత్రి జట్టు 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాడిపత్రి జట్టులో లక్ష్మణ్‌ 30, రమేష్‌ 25 పరుగులు చేశారు.  
విన్సెంట్‌ ఫెర్రర్‌ జట్టు అలవోక విజయం 
మడకశిరలో జరిగిన మ్యాచ్‌లో మడకశిర, విన్సెంట్‌ ఫెర్రర్‌ మడకశిర జట్లు తలపడ్డాయి. మడకశిర జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు దిగిన మడకశిర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 162 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన విన్సెంట్‌ ఫెర్రర్‌ జట్టు 27 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి విజయం సాధించింది. 
రాయదుర్గం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కళ్యాణదుర్గం జట్టు విజయం సాధించింది.  కొనకొండ్ల జట్టుపై గుంతకల్లు జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యల్లనూరు జట్టుపై బత్తలపల్లి జట్టు 66 పరుగులతో విజయం సా«ధించింది. బత్తలపల్లి బౌలర్‌ నరేష్‌ హ్యాట్రిక్‌ సాధించి జట్టు విజయానికి దోహదపడ్డాడు.  వచ్చేవారం లీగ్‌ పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి ప్రసన్న తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement