సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికై రోడ్ మ్యాప్ తయారు చేశామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఏసీఏ 70 ఏళ్ల పండగను సోమవారం వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటగాళ్ల భవిష్యత్ గురించే తాము నిత్యం తపనపడుతుంటామని పేర్కొన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి సారిగా వుమెన్ టీ20 మ్యాచ్ నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి: టీమిండియా మాజీ క్రికెటర్
అనంతరం ఇండియా మాజీ క్రికెటర్, ఇండియన్ నేషనల్ క్రికెట్ మాజీ కోచ్ మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రలో ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు., భవిష్యత్తులో వారు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా ఎదగాలి’’ అని ఆకాంక్షించారు. ఇక్కడున్న యువ క్రికెటర్లను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏసీఏ పనితీరు అద్భుతం అని మదన్ లాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఏపీఎల్ సూపర్
ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను వెలికి తీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆంధ్రలో క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతోందని మదన్ లాల్ ప్రశంసించారు. ఇక ఈ సమావేశంలో.. పలువురు మాజీ రంజీ ప్లేయర్లు, మాజీ ఉమెన్ సీనియర్ ప్లేయర్స్, రంజీ ట్రోఫీ కెప్టెన్లు, క్రికెట్ కమిటీ సభ్యులకు, ఏసీఏ ఉద్యోగులకు, లీగల్ కమిటీలకు గోపినాథ్ రెడ్డి, ఏసీఏ ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, మదన్ లాల్ జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి ఎ. రాకేశ్, ట్రెజరర్ ఏ.వి. చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె.వి.పురుషోత్తం, జితేంద్ర నాథ్ శర్మ, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్. వెంకట రావు, చాముండేశ్వరి నాథ్ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హాజరైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన తుదిపోరులో డిపెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్‌ను రాయలసీమ కింగ్స్ ఓడించింది. తద్వారా ఏపీఎల్-2 విజేతగా అవతరించింది.
చదవండి: 13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్!
Comments
Please login to add a commentAdd a comment