Madan Lal
-
వైరాలో వార్.. కారు స్పీడ్‌కు కాంగ్రెస్ బ్రేక్ వేస్తుందా?
వైరా నియోజకవర్గంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏవరు గెలుస్తారన్నది పక్కన పెడితే.. రెండు పార్టీలలో గ్రూప్ వార్ చర్చానీయంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఈసారి టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ వరించింది. దీంతో పైకి మదన్ లాల్ గెలుపుకోసం పనిచేస్తానని రాములు నాయక్ చెబుతున్నా లోలోపల చేయాల్సిందంతా చేస్తున్నారట. అటు కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఏకంగా అర డజన్ మంది టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైరా ఎన్నికల సమరంలో కారు దూసుకు పోతుందా? కాంగ్రెస్ తన సత్తా చాటుతుందా.? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు. పాలనా సౌలభ్యం కోసం రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం వైరా. కొనిజర్ల, వైరా, ఏన్కూర్, జూలూరుపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 1,97,360 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గం హట్సీట్గా మారునుందనే చెప్పాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరడంతో టికెట్ వచ్చిన వారికి.. రాని వారు సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకాకుండా మాజీ ఎమ్మెల్యేకు టికెట్ రావడంతో ఎమ్మెల్యేవర్గం ఏమాత్రం మద్దతు ఇచ్చే పరిస్థితి కనబడటంలేదు. అటు కాంగ్రెస్‌లో సైతం అదే పరిస్థితి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైరా కాంగ్రెస్‌లో పెద్ద రచ్చనే చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు అరడజన్ పైనే ఉండటం ఇందుకు కారణం. వైరా నియోజకవర్గం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా లావుడియా రాముల నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రధానంగా ఎమ్మెల్యే తరుచూ అనేక సమావేశాల్లో నోరు జారీ చిక్కులు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఆయన నోరు జారీన స్పీచ్‌లు నేషనల్ మీడియా వరకు వెళ్లాయంటేనే స్పీచ్‌లు ఏస్థాయిలో డ్యామేజ్ చేశాయో అర్థమవుతుంది. అంతేకాదు ఇండిపెండెంట్‌గా జనం ఆదరించిన ఎమ్మెల్యేరాములు నాయక్ అభివృద్ధి చేసింది ఏమీ చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే, ఆయన కోడుకు జీవన్ లాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల లిస్ట్ చాంతడంతా ఉందన్నది లోకల్‌గా ప్రచారం నడుస్తూ వస్తుంది. రాములు నాయక్‌కు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే అన్న ప్రచారం ఉంది. మొత్తం ఈక్వేషన్స్ పరిగణంలోకి తీసుకొని బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేరాములు నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలు తనను గెలిపిస్తాయని బానోత్ మదన్ లాల్ ధీమాతో ఉన్నారు. ప్రధానంగా పోడు భూములకు పట్టాల పంపిణీ, దళితులకు దళిత బంధువు పది లక్షలు ,రైతులకు లక్ష రూపాయాల రుణ మాఫీ బీసీలకు లక్ష రుపాయల ఆర్థిక సహయం ఓట్లు కురిపిస్తాయని మదన్ లాల్ ఆశిస్తున్నారు. మదన్ లాల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లంబడా సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈసారి సానుభూతితో గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. మదన్ లాల్ మా బావ ఆయనకి టికెట్ కేసీఆర్ ఇచ్చాడు.. కేసిఆర్ నా దేవుడు ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టే ఆయన గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. దళిత బంధు విషయంలో మంత్రి పువ్వాడ అజయ్, మదన్ లాల్ కలిసి మదన్ లాల్ వర్గానికి చెందిన 600 మందికి అధికారులు దళితబంధు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యేగా తనకు తెలియకుండనే ఇదంతా జరిగిందని రాములు నాయక్ ఇటివలే చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారమే లేపాయి. అంతేకాదు మంత్రి అజయ్‌పై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. ఇవి కూడా పార్టీలో హట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత పార్టీ అధిష్టానం రాములు నాయక్‌ను బుజ్జగించడంతో ప్రస్తుతం కొంత సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ బాంబ్ పేలుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. పైకి రాముల నాయక్ మదన్ లాల్ మా బావ.. కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఓట్లేపిస్తానని పైకి రాములు నాయక్ చెబుతున్న.. రాములు నాయక్ వర్గం మాత్రం మదన్ లాల్‌కు సపోర్ట్ చేసేదే లేదని చెప్పుకొస్తుంది. సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాలోత్ రాందాస్ నాయక్ ,బాలాజీ నాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, విజయిబాయి.. బీజేపీ నుంచి మోహన్ నాయక్, డీబీ నాయక్, కృష్ణ రాథోడ్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. వైరా నియోజకర్గంలో లంబాడి ఓట్లు ఎక్కువ. లంబాడి ఓట్లు ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఉంటాయి. లంబాడి ఓట్ల తర్వాత బీసీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటమిలపై వీరి ప్రభావం ఏక్కువగా ఉంటుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైరా నియెజకర్గంలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి.. అద్భుతం: టీమిండియా మాజీ క్రికెటర్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికై రోడ్ మ్యాప్ తయారు చేశామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఏసీఏ 70 ఏళ్ల పండగను సోమవారం వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటగాళ్ల భవిష్యత్ గురించే తాము నిత్యం తపనపడుతుంటామని పేర్కొన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి సారిగా వుమెన్ టీ20 మ్యాచ్ నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి: టీమిండియా మాజీ క్రికెటర్ అనంతరం ఇండియా మాజీ క్రికెటర్, ఇండియన్ నేషనల్ క్రికెట్ మాజీ కోచ్ మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రలో ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు., భవిష్యత్తులో వారు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా ఎదగాలి’’ అని ఆకాంక్షించారు. ఇక్కడున్న యువ క్రికెటర్లను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏసీఏ పనితీరు అద్భుతం అని మదన్ లాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏపీఎల్ సూపర్ ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను వెలికి తీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆంధ్రలో క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతోందని మదన్ లాల్ ప్రశంసించారు. ఇక ఈ సమావేశంలో.. పలువురు మాజీ రంజీ ప్లేయర్లు, మాజీ ఉమెన్ సీనియర్ ప్లేయర్స్, రంజీ ట్రోఫీ కెప్టెన్లు, క్రికెట్ కమిటీ సభ్యులకు, ఏసీఏ ఉద్యోగులకు, లీగల్ కమిటీలకు గోపినాథ్ రెడ్డి, ఏసీఏ ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, మదన్ లాల్ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి ఎ. రాకేశ్, ట్రెజరర్ ఏ.వి. చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె.వి.పురుషోత్తం, జితేంద్ర నాథ్ శర్మ, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్. వెంకట రావు, చాముండేశ్వరి నాథ్ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హాజరైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన తుదిపోరులో డిపెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్‌ను రాయలసీమ కింగ్స్ ఓడించింది. తద్వారా ఏపీఎల్-2 విజేతగా అవతరించింది. చదవండి: 13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్! -
ఈసారి ఆసియా కప్ భారత్‌దే.. కానీ వరల్డ్‌కప్ మాత్రం: టీమిండియా మాజీ సెలక్టర్
Asia Cup 2023- World Cup 2023: ఆసియా కప్-2023 క్రికెట్ సమరానికి ఆరు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్.. గ్రూప్- బి నుంచి బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక హోరాహోరీ పోరులో తలపడనున్నాయి. పాకిస్తాన్‌తో కలిసి డిపెండింగ్ చాంపియన్ శ్రీలంక సంయుక్తంగా ఈ వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా తొలి మ్యాచ్ పాక్‌తో ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో రోహిత్ సేన విఫలమైన విషయం విదితమే. అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. ఫైనల్లో పాక్‌ను ఢీకొట్టిన శ్రీలంక టైటిల్ విజేతగా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం టీమిండియా గతం తాలూకు తప్పులు పునరావృతం కాకుండా 50 ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఆ తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా కప్ భారత్‌దే.. కానీ ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్ మదన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా కచ్చితంగా ఆసియా కప్ గెలుస్తుంది. కానీ.. ప్రపంచకప్ విజేత గురించి ఇప్పుడే అంచనా వేయలేం. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాలకు కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే ప్లస్.. అదే మైనస్.. స్వదేశంలో ఆడటం మనకు సానుకూలాంశమే అయినా.. అదే ప్రతికూలంగానూ మారే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఆడుతున్నపుడు భారీ అంచనాల కారణంగా ఒత్తిడి ఉండటం సహజం. అయితే, అదృష్టవశాత్తూ మన జట్టులో ఎక్కువ మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లే ఉన్నారు. ఒత్తిడిని ఎలా అధిగమించాలో వారికి బాగా తెలుసు’’ అని మదన్ లాల్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పునరాగమనం గురించి ప్రస్తావిస్తూ.. వారిద్దరు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తేనే టీమిండియా మిడిలార్డర్ పటిష్టమవుతుందని పేర్కొన్నాడు. రాహుల్, అయ్యర్‌లకు గత అనుభవం ఉన్నా.. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఎలా రాణిస్తారన్నదే కాస్త ఆందోళన కలిగించే అంశమని మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ చెప్పుకొచ్చాడు. చదవండి: విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! -
బీఆర్ఎస్ టికెట్ల లొల్లిలో రాసలీలల ట్విస్ట్!
సాక్షి, ఖమ్మం: అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు టికెట్ల కుంపటి భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్లో టికెట్ల వార్ కొనసాగుతుండగా.. వైరాలో అది మరో టర్న్ తీసుకుంది. వైరా టికెట్ తనకే మళ్లీ వస్తుందంటూ ఎమ్మెల్యే రాములు నాయక్ ధీమాగా ఉండగా.. తమకే వస్తుందంటూ అనుచరులతో హల్ చల్ చేయించుకుంటున్నారు మాజీలు మదన్‌లాల్, బానోతు చంద్రావతిలు. ఈ క్రమంలో మదన్‌లాల్‌కే టికెట్ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్న ఆయన వర్గీయులకు ఊహించని ఝలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలలు ఫోటోలు తెరపైకి వచ్చి వైరల్ ప్రకంపనలు సృష్టించాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా అకౌంట్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటూ ప్రత్యర్థి గ్రూపులు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. అయితే.. అవి మార్ఫింగ్ ఫొటోలు అని, మదన్‌లాల్‌కే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గమే ఈ పని చేయించిందని మదన్‌లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాములు నాయక్ వర్గం మాత్రం ఆ అవసరం తమకు లేదని చెబుతోంది. డీజీపీకి ఫిర్యాదు చేస్తా: మదన్‌లాల్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్పింగ్ చేసిన ఫొటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఈ ప్రచారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. -
WC: టీమిండియా లక్ వల్ల గెలిచింది! అంతేకానీ ఒక్కరూ: విండీస్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
World Cup, 1983 India vs West Indies, Final: ‘‘మేమప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాం. కానీ ఒక్క మ్యాచ్ వల్ల అంతా నాశనమైంది. నిజానికి 1983లో అదృష్టం ఇండియా వైపు ఉంది. ఆ సమయంలో మా జట్టు గొప్పగానే ఉన్నప్పటికీ ఎందుకో ఓటమి పాలయ్యాం. ఫైనల్ తర్వాత బహుశా ఐదారు నెలల వ్యవధిలో మేము టీమిండియాను 6-0 తేడాతో చిత్తు చేశాం. కాబట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఆ ఒక్క మ్యాచ్ టీమిండియా కేవలం అదృష్టం వల్లే గెలిచిందని చెప్పవచ్చు. ఆనాడు మేము 183 పరుగులకు అవుట్ చేసిన తర్వాత మా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. అందుకే మ్యాచ్ ఓడిపోయాం. ఇదేదో అతి విశ్వాసమో, అతి జాగ్రత్త వల్లో జరిగింది కాదు’’ అంటూ వెస్టిండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కేవలం లక్ వల్లే గెలిచింది లక్ వల్లే టీమిండియా గెలిచిందన్నట్లు వ్యాఖ్యలు చేసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. ఆ మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్, బౌలర్ కూడా తనను ఇంప్రెస్ చేయలేకపోయారన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌తో రాబర్డ్స్ మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం ఫిఫ్టీ సాధించలేకపోయారు. ఇక బౌలర్లు.. ఒక్కరు కూడా కనీసం 4 లేదంటే 5 వికెట్లు తీయలేకపోయారు. ఏ ఒక్కరూ ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయారు. బ్యాటర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలర్లు వికెట్లు కూలుస్తూనే ఉండాలి. కానీ టీమిండియా నుంచి ఏ ఒక్కరు అలా చేయలేకపోయారు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వివియన్ రిచర్డ్స్ అవుట్ కావడం(మదన్‌లాల్ బౌలింగ్‌లో) మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత తాము ఏ దశలోనూ కోలుకోలేకపోయాం. 1975, 1979 ఫైనల్స్.. 1983 ఫైనల్‌కి తేడా ఒక్కటే.. ఆ రెండు దఫాలు మేము తొలుత బ్యాటింగ్ చేశాం. 83లో ఛేజింగ్ చేశాం’’ అని రాబర్ట్స్ వ్యాఖ్యానించాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మొహిందర్ అమర్నాథ్ 26, సందీప్ పాటిల్ 27 పరుగులు చేశారు. మిగతా వాళ్లెవరూ 20 పరుగుల స్కోరును అందుకోలేకపోయారు. రాబర్ట్స్కు అత్యధికంగా ఈ క్రమంలో 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి కపిల్‌దేవ్ సేన ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 140 పరుగులకే చాపచుట్టేయడంతో 43 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. కాగా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజంగా పేరొందిన ఆండీ రాబర్ట్స్ 1975, 1979లో ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు. ఇప్పుడు ఇదంతా దేనికి? ఇదిలా ఉంటే.. ఆండీ రాబర్ట్స్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘అవును మరి.. ఒక్క మ్యాచ్‌తోనే ఫలితాలు తారుమారవుతాయి.ఘే జట్టు విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ బృందం విజేతగా నిలిచి టీమిండియా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి చెత్త మాటలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. విండీస్ కనీసం వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: టీమిండియా పేసర్ షమీకి భారీ షాక్! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ -
బుమ్రాను మర్చిపోండి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడే సరైనోడు!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా గత కొన్ని నెలలగా జట్టుకు దూరంగా ఉన్న విషయం విధితమే. అయితే బుమ్రా తన సర్జరీ కోసం త్వరలోనే న్యూజిలాండ్‌కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాంతో అతడు ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌తో పాటు ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు కూడా జస్ప్రీత్ దూరం కానున్నాడు. కాగా భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు బుమ్రాను తిరిగి తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే బుమ్రా న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. బుమ్రాపై భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి బుమ్రా గురించి మరచిపోవాలని, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తే ఉమేష్ యాదవ్‌ను ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లాలని మదన్‌లాల్ సూచించాడు. బుమ్రాను మరచిపోండి.. "ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అందుబాటులో లేని జస్ప్రీత్ బుమ్రా గురించి ఆలోచించకూడదు. అతడిని ఇప్పటికైతే మరచిపోండి. బుమ్రా ఎప్పుడు వస్తాడో అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఏది అందుబాటులో ఉందో దానినే ఉపయోగించుకోవాలి. అతడు ఏడాదిన్నర తర్వాత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి గాయం చాలా తీవ్రమైనది. కాబట్టి అతడి స్థానంలో ఉమేష్ యాదవ్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో స్థానం కల్పించాలి. ఇంగ్లండ్ పరిస్ధితులు పేసర్లకు అనూలిస్తాయని మనకు తెలుసు. కాబట్టి ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగాలి. విదేశీ గడ్డపై రాణించే సత్తా ఉమేష్‌కు ఉంది" అని స్పోర్ట్స్ టాక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్‌లాల్ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: ప్రాక్టీసు మొదలెట్టిన ధోని.. షాట్లతో అలరిస్తూ! వీడియో వైరల్ -
మొక్కుబడిగా ఆడుతున్నారు.. గెలవాలన్న తపనే లేదు!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి నాసిరకం ప్రదర్శనతో ఓటములను కొనితెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మదన్‌లాల్ టీమిండియా ఆటతీరుపై స్పందించాడు. ''కచ్చితంగా టీమిండియా మాత్రం సరైన దిశలో వెళ్లడం లేదు. జట్టులో ఆ దూకుడే కనిపించడం లేదు. గత రెండేళ్లుగా కనిపించిన జోష్ ఇప్పుడు లేదు. దేశానికి ఆడుతున్నామనే విషయం మరిచినట్లున్నారు. ఏ ఒక్కరిలోనూ గెలవాలన్న కసి కనిపించడం లేదు. వాళ్ల శరీరాలు పూర్తిగా అలసిపోయి ఉండాలి లేదంటే ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నాం అన్నట్లుగా అయినా ఉండాలి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇక సగం ఫిట్‌గా ఉన్న ప్లేయర్స్ ఇండియాకు ఆడుతున్నారని రోహిత్ శర్మ పేర్కొనడం బాధాకరం. దీనికి ఎవరు బాధ్యులు? ట్రైనర్లు దీనికి బాధ్యులు కాదా? ఫిట్‌గా లేని ప్లేయర్స్ ఎందుకు వెళ్తున్నారు? ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు. ఫలితం మీ ముందు ఉంది. వాళ్లకు విశ్రాంతి కావాలంటే ఐపీఎల్ సమయంలో తీసుకోవాలి. దేశమే ముందు. ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోతే.. దేశంలోని క్రికెట్ పతనమైతున్నట్లే'' అని పేర్కొన్నాడు. ఇక టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. "రికార్డులు చూస్తే.. వాళ్లు గత మూడేళ్లలో ఎన్ని సెంచరీలు చేశారు. గతేడాది ఎన్ని చేశారు? వయసు మీద పడుతున్న కొద్దీ హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ దెబ్బ తింటుంది. కానీ వాళ్లు అనుభవజ్ఞులు. బాగా ఆడాల్సింది. టాపార్డర్ ఆడకపోతే గెలవలేరు. బౌలింగ్ కూడా హఠాత్తుగా బలహీనంగా మారిపోయింది. వికెట్లు తీయలేకపోతున్నారు. బంగ్లాదేశ్ 6 వికెట్లకు 69 నుంచి 271 రన్స్ ఎలా చేసింది? అసలు ఏం జరుగుతోంది" అని మదన్‌లాల్ ప్రశ్నించాడు. చదవండి: బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్‌ను విడుదల చేసిన రష్యా -
కోహ్లి ప్రతి మ్యాచ్ గెలిపించలేడు! మీ ఇద్దరూ కూడా ఆడాలి: భారత మాజీ క్రికెటర్
T20 World Cup 2022- India Vs Netherlands: ‘‘విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ అత్యద్భుతం. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్ నేనెప్పుడూ చూడలేదు. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడు కదా. ఇలాంటి కీలక టోర్నీల్లో ఒక్క ఆటగాడిపై ఆధారపడితే అనుకున్న లక్ష్యాలు సాధించలేము’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్ అన్నాడు. ఆ ఇద్దరు విఫలం! టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో గెలుపొందినప్పటికీ ఓపెనింగ్ జోడీ వైఫల్యం కలవరపెట్టే అంశంగా పరిణమించింది. మెల్బోర్న్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 8 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్‌కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 7 బంతుల్లో 4 రన్స్ తీసి పెవిలియన్ చేరాడు. దీంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో కోహ్లి(53 బంతుల్లో 82 నాటౌట్), హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో 40 పరుగులు) గనుక బ్యాట్ ఝులిపించి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. ఈ నేపథ్యంలో మదన్ లాల్ స్పందిస్తూ... రోహిత్, రాహుల్‌లపై విమర్శలు ఎక్కుపెట్టాడు. మీరు కూడా బ్యాట్ ఝులిపించండి! ఈ మేరకు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఆట తీరుకు ఆస్ట్రేలియన్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. పెద్ద గ్రౌండ్లలో తను సింగిల్స్, రెండు, మూడు పరుగులు తీయగలడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతాడు. మానసికంగా తను బలవంతుడు. ఎప్పుడు ఎలా ఆడాలో తనకో అవగాహన ఉంటుంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాట్ ఝులిపించాలి. ప్రతి ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు హీరో అవుతాడు. కేవలం ఒక్కడిపై ఆధారపడితే కష్టమే’’ అని మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచకప్-2022లో రోహిత్ సేన తమ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది. చదవండి: టీ20లకు కోహ్లి గుడ్ బై చెప్పాలి.. ఎందుకంటే! నీ చచ్చు సలహాలు ఆపు! కింగ్ ఉంటే మీ ‘ఆట’లు సాగవనా? టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’.. ఏదైతేనేమి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ind Vs SA: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని!
India Vs South Africa T20 Series- Rishabh Pant: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించాల్సి కాదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ అన్నాడు. తనకే గనుక అధికారం ఉండి ఉంటే కచ్చితంగా 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేసేవాడిని కాదన్నాడు. ఆటగాడిగా పంత్ మరింత మెరుగుపడాల్సి ఉందని, పూర్తి స్థాయిలో పరిణతి చెందిన తర్వాతే కెప్టెన్‌గా భారాన్ని మోయగలుగుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా ప్రొటిస్ జట్టుతో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో పంత్ భారత జట్టు పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 2-2తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. ఆఖరి మ్యాచ్ వర్షార్పణమైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో పంత్ బ్యాటర్‌గా విఫలమయ్యాడు. మొత్తంగా కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు ఈ వికెట్ కీపర్. ఇప్పుడే తొందర ఎందుకు? ఈ నేపథ్యంలో మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘‘నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా అడ్డుకునేవాడిని. తాను సారథ్య బాధ్యతలు చేపట్టకుండా చేసేవాడిని. ఎందుకంటే.. బ్యాటర్‌గా తన సేవలు అవసరమైన వేళ పెద్ద పెద్ద బాధ్యతలు అప్పజెప్పడం సరికాదు. టీమిండియా కెప్టెన్ అంటే మామూలు విషయం కాదు. అతడు వయసులో ఇంకా చిన్న వాడే. చాలా భవిష్యత్తు ఉంది. తను ఎక్కడికీ వెళ్లడం లేదు. ఆటగాడిగా మరింత పరిణతి సాధించాల్సి ఉంది. అప్పుడే ఇలాంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలడు’’ అని ఆజ్‌తక్‌తో పేర్కొన్నాడు. ధోని కూల్ కెప్టెన్.. ఇక కోహ్లి అయితే.. ఇక రానున్న రెండేళ్ల కాలంలో పంత్ గనుక బ్యాటర్‌గా మరింత విజృంభిస్తే గొప్ప కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మదన్ లాల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఎంఎస్ ధోని కూల్ కెప్టెన్ అని, సారథిగా జట్టుకు తను వందశాతం న్యాయం చేశాడన్న మదన్ లాల్.. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా కంటే కూడా అద్భుతమైన బ్యాటర్‌గానే నీరాజనాలు అందుకున్నాడని గుర్తుచేశాడు. కాగా టీమిండియా ప్రస్తుతం రీషెడ్యూల్డ్ టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్‌కు పయనమైన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే ఇది! అతడు లేడు కాబట్టి... రోహిత్‌పై మరింత భారం! India Tour Of England 2022 Schedule: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై.. పూర్తి షెడ్యూల్, ‘జట్టు’ వివరాలు! 🚨 Update 🚨 Play has heen officially called off. The fifth & final @Paytm #INDvSA T20I has been abandoned due to rain. #TeamIndia pic.twitter.com/tQWmfaK3SV — BCCI (@BCCI) June 19, 2022 -
'పంత్‌ని కొద్ది రోజులు పక్కన పెట్టండి.. అప్పుడే తెలిసి వస్తుంది'
జొహాన్స్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ కోల్పోయిన రిషబ్ పంత్‌పై మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా చేరాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అనడంలో సందేహం లేదని, కానీ రెండవ ఇన్నింగ్స్‌లో ఆ విధంగా అతడు బ్యాటింగ్ చేయలేదని మదన్ లాల్ తెలిపాడు. "పంత్‌ని పక్కన పెట్టవలసిన సమయం వచ్చింది. అతడి స్ధానంలో వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలి. అతడు పంత్ కంటే తెలివైన ఆటగాడు. అదే విధంగా అతడు అత్యుత్తమ వికెట్ కీపర్. . అయితే టెస్టు క్రికెట్లో పంత్ ఎలా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకోవాలి. కాబట్టి అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలి. పంత్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ అతడు తన ఆటకు తగ్గట్లు రాణించడం లేదు. ఏ ఆటగాడైన జట్టు కష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు అదుకోవాలి" అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య అఖరి టెస్ట్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో మూడో టెస్ట్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: NZ vs BAN: ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్! -
Virat Kholi: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా!
Madan Lal not happy with Virat Kohli’s axing as ODI captain: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగించి రోహిత్ శర్మని నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు మదన్‌లాల్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై కోహ్లి తప్పనిసరిగా విముఖత చూపి ఉంటాడని మదన్‌లాల్ తెలిపాడు. మదన్‌లాల్ “సెలెక్టర్లు దీని గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఒక వేళ కోహ్లి భారత్‌కు మంచి విజయాలు అందిస్తుంటే అతడిని ఎందుకు తొలిగించాలి..? టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ ఎందుకు తప్పుకున్నాడో నేను అర్ధం చేసుకోగలను. వన్డే, టెస్ట్ ఫార్మాట్లపై దృష్టి సారించాడానికి మాత్రమే అతడు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడని నేను అనుకున్నాను. ఒక బలమైన జట్టును తయారు చేయడం చాలా కష్టం. కానీ ఆ జట్టును నాశనం చేయడం చాలా సులభం" అని అతడు పేర్కొన్నాడు. ఇక వన్డే, టీ20 ఫార్మట్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు కలిగి ఉండడం గందరగోళం సృష్టిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే గంగూలీ వాదనను మదన్‌లాల్ వ్యతిరేకించాడు. కోహ్లి టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా ధోని దాదాపు రెండేళ్లు పాటు కొనసాగాడని మదన్‌లాల్ గుర్తు చేశాడు. "ఎందుకు గందరగోళం ఏర్పడుతుందో నాకు అర్థం కాలేదు. ప్రతి కెప్టెన్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కాబట్టి గందరగోళం దేనికి. టెస్ట్ క్రికెట్‌కి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు చాలా తేడా ఉంది. విరాట్, రోహిత్ జట్లను నడిపించడంలో తమదైన శైలిని కలిగి ఉన్నారు. ఎంఎస్ ధోనీ కూడా తనదైన శైలిలో జట్టును నడపించాడు. అన్నిటి కంటే అంతర్జాతీయ స్ధాయిలో ఆడూతూ రాణించడం గొప్ప విశేషం" అని మదన్‌లాల్ మగించాడు. చదవండి: Katrina Kaif- Vicky Kaushal: విరుష్క పొరుగింట్లోకి కత్రినా- విక్కీ.. హమ్మయ్య మీకు పెళ్లైంది.. ఇప్పటికైనా! -
‘అది గంగూలీకి గుర్తుందో లేదో’
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడు. అతని సారథ్యంలోని భారత జట్టు ‘దూకుడు’కు మారుపేరుగా నిలిచింది. ప్రధానంగా 2000 దశకంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై పై సాధించిన విజయాలే అందుకు ఉదాహరణ. ప్రత్యేకంగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టు విజయాలు, 2002లో నాట్‌వెస్ట్ ఫైనల్ విజయం, 2003 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు వరకూ చేరడం వంటివి గంగూలీ కెప్టెన్సీలో వచ్చినవే. అంతేకాకుండా వరల్డ్‌లో అత్యుత్తమ ఓపెనర్లలో గంగూలీ ఒకడిగా నిలవడం గురించే ప్రధానంగా చెప్పుకోవాలి. సచిన్ టెండూల్కర్‌తో కలిసి అనేక ఓపెనింగ్ భాగస్వామ్యాలతో అరుదైన ఘనతలు సాధించిన గంగూలీ.. తన కెరీర్ తొలి నాళ్లలో ఐదో స్థానంలో వచ్చేవాడు. ఆ తర్వాత ఓపెనర్‌గా మారి సక్సెస్ అయ్యాడు గంగూలీ. అయితే గంగూలీ ఓపెనర్‌గా రావడం వెనుక తన సలహా ఉందంటున్నాడు మాజీ క్రికెటర్, మాజీ కోచ్ మదన్‌లాల్. (సచిన్ కెప్టెన్సీ వైఫల్యంపై మదన్‌లాల్ కామెంట్స్) తన సలహాతోనే గంగూలీ ఓపెనర్‌గా మారి సక్సెస్ అయినట్లు వెల్లడించాడు. ‘ మేము గంగూలీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనుకున్నాం. దాంతో అతన్ని ఓపెనర్‌గా చేయమని కోరా. ఆ విషయం దాదాకు గుర్తుందో లేదో తెలియదు. నేను గంగూలీని నేరుగా ఓపెనింగ్ దిగమని చెప్పా. ఐదో స్థానంతో ఉపయోగం లేదని వివరించా. దాంతో 1996లో దక్షిణాఫ్రికాతో జైపూర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో గంగూలీ తొలిసారి ఓపెనర్‌గా దిగాడు. సఫారీ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రతీ ప్లేయర్‌కి వారి సొంత శైలి అనేది ఉంటుంది. ప్రతీ బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో సెటిల్ కావడానికి సమయం తీసుకుంటారు. ఇందులో కోహ్లి, రహానేలు కూడా మినహాయింపు కాదు. గంగూలీకి మాత్రం అన్ని వైపులా షాట్లు ఆడే సామర్థ్యం ఉండేది. దాంతోనే ఓపెనింగ్ సలహా ఇచ్చా. దానికి ఓకే చెప్పిన గంగూలీ ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత సచిన్‌తో కలిసి ఎన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడో చూశాం. ఆ ఇద్దరూ భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు’ అని మదన్‌లాల్ స్పోర్ట్స్‌కీడా ఫేస్బుక్ లైవ్ సెషన్లో చెప్పుకొచ్చాడు. (రోహిత్ నా రోల్ మోడల్: పాక్ క్రికెటర్) -
‘అందుకే సచిన్ గొప్ప సారథి కాలేదు’
హైదరాబాద్: అత్యధిక పరుగులు, వంద సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్ అనుభవం, యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగల సమర్థుడు, క్లిష్ట సమయాల్లో జట్టు సమైక్యతను కాపాడిన ఘనుడు ఇలా అనేక ప్రశంసలు, ఘనతలు అందుకున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గొప్ప సారథినని మాత్రం నిరూపించుకోలేకపోయాడు. అతడి కెరీర్లో ఏదైనా చిన్న అసంతృప్తి ఉందంటే అది కెప్టెన్సీనే. ఆటగాడిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్న సచిన్ నాయకుడిగా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడంటూ కొందరు బహిరంగంగానే విమర్శించారు. అయితే సారథిగా సచిన్ ఎక్కడ విఫలమయ్యాడో మాజీ క్రికెటర్, ప్రపంచకప్-1983 గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్‌లాల్ తాజాగా వివరించాడు. (‘2007లోనే రిటైర్మెంట్కు సచిన్ ప్లాన్’) ‘సచిన్ గొప్ప సారథి కాదనే వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం ఏకీభవించను. బాధ్యత గల సారథిగా అతడు తన వ్యక్తిగత ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కానీ మిగతా పది మంది ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. మంచి ప్రదర్శన చేయాలని వారిపై ఒత్తిడి తేలేదు. అయితే ఆ సమయంలో వారు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే సచిన్ కూడా గొప్ప సారథి అయ్యుండే వాడు. క్రికెట్లో కెప్టెన్ ఒక్కడే రాణిస్తే విజయాలు సాధించలేము. ఆ ఒక్కడితో పాటు మిగతా పది మంది బాధ్యతాయుతంగా ఆడితేనే విజయం సాధిస్తాం. దీన్ని సమన్వయం చేయడం కష్టమే. కొని సార్లు సహచర ఆటగాళ్లతో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో సచిన్ కాస్త వెనకపడ్డాడు. గొప్ప సారథి కాలేకపోయాడు’ అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు. (ఆ వార్తలను నమ్మకండి : ఆఫ్రిది) 1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్ గల బోర్డర్-గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును ముందుండి నడిపించాడు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయాడు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం. -
‘అలా చేసింది కేవలం కోహ్లి మాత్రమే’
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మరొకసారి వెనకేసుకొచ్చాడు మాజీ క్రికెటర్ మదన్‌లాల్. జట్టు సామర్థ్యం ఎలా ఉంటే మ్యాచ్‌లు గెలుస్తామో కోహ్లికి తెలిసినంతగా మరే భారత కెప్టెన్‌కు తెలియదన్నాడు. కేవలం విరాట్ కోహ్లి కారణంగా భారత పేస్ బౌలింగ్ విభాగం బలపడిందన్నాడు. అసలు భారత క్రికెట్లో ఇప్పటివరకూ పేస్ బౌలర్లను కోహ్లి ప్రోత్సహించినట్లు ఏ కెప్టెన్ చేయలేదన్నాడు. తాను చూసిన భారత జట్లలో కోహ్లి నేతృత్వంలోనే జట్టే అత్యంత పటిష్టంగా కనబడుతుందన్నాడు. ఇందుకు కారణం భారత పేస్ బౌలింగ్ ఎటాక్ పెరగడానికి కోహ్లి కృషి చేయడమేనన్నాడు. ఎవరికీ నమ్మశక్యం కాని రీతిలో కోహ్లి హయాంలోనే పేసర్లకు ఎక్కువ అవకాశాలు వచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. పేస్ బౌలింగ్ విలువ గురించి కోహ్లికి తెలుసు కాబట్టే పేసర్లకు లెక్కకు మించి అవకాశాలు వస్తున్నాయన్నాడు. (కరోనా సంక్షోభం తర్వాత తొలి క్రికెట్ లీగ్) ‘పేస్ బౌలింగ్‌ను పటిష్ట పరచడానికి కోహ్లి ఏదైతే మార్గం ఎంచుకున్నాడు అది ఆమోదయోగ్యమైనది. పేసర్లను ప్రోత్సహిస్తున్నది కోహ్లి ఒక్కడే. అంతకుముందు ఏ భారత కెప్టెన్ కూడా పేసర్లకు కోహ్లి తరహాలో అవకాశం ఇవ్వలేదు. 15-20 ఏళ్ల వెనక్కి వెళ్లి చూస్తే భారత్ ఎక్కువ మ్యాచ్‌లను గెలవలేకపోయేది. ఇప్పుడున్నది విన్నింగ్ టీమ్. ఇందుకు కారణం పేస్ ఎటాక్. పేస్ బౌలింగ్ విలువ కోహ్లి బాగా తెలుసు కాబట్టే దానిపై దృష్టి పెట్టాడు. పేస్ బౌలర్లను ప్రోత్సహించే కల్చర్ సునీల్ గావస్కర్ హయాం నుంచి వచ్చింది. దానిని కోహ్లి అమోఘంగా అవలంభిస్తున్నాడు. భవిష్యత్తులో నాలుగు నుంచి ఐదుగురు పేసర్లున్నా విజయాలు సాధిస్తూనే ఉంటాం’ అని మదన్‌లాల్ పేర్కొన్నాడు. ఇక ఫీల్డ్‌లో కోహ్లి దూకుడు గురించి మాట్లాడుతూ అది తనకెంతో ఇష్టమన్నాడు. చాలామంది కోహ్లి ప్రవర్తనను విమర్శించవచ్చు కానీ అందులో తన వరకూ అయితే ఎటువంటి లోపాలు కనిపించలేదన్నాడు. కోహ్లి తరహా దూకుడు జట్టుకు ఎంతో అవసరమన్నాడు. గతంలో భారత క్రికెటర్లే అంటే నెమ్మదస్తులు అనే పేరుండేదని, ప్రస్తుతం మన కెప్టెన్ కోహ్లి కారణంగా భారత జట్టు దూకుడు ప్రపంచానికి తెలిసిందన్నాడు. (ధోనిని కొట్టమని.. మమ్మల్ని అవతలికి కొట్టావా!) -
ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ అవసరమా?
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తూ ఉంటే మరొకవైపు క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ నిర్వహణపై కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుదంని కొంతమంది క్రికెటర్ల నోట వినిపిస్తోంది. ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందని తొలుత బీసీసీఐ చేసిన ఆలోచనకు తాజాగా పలువురు తమ గళం కలుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆసక్తిగా లేకపోయినా ఒకవైపు నుంచి ఒత్తిడి వస్తున్నట్లే కనబడుతోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి 29వ తేదీన ఐపీఎల్ ఆరంభం కావాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆ లీగ్‌ను ఏప్రిల్15వ తేదీ వరకూ వాయిదా వేశారు. అప్పటికి పరిస్థితుల్లో ఏమైనా మెరుగుదల కనిపిస్తే ఆ తర్వాత షెడ్యూల్‌ను ప్రకటించడానికి సమాయత్తమయ్యారు. (‘టెక్నికల్‌గా ఆ భారత్ లెజెండ్ చాలా స్ట్రాంగ్’) కాగా, ఏప్రిల్ 15వ తేదీ నాటికి పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దాదాపు అసాధ్యమే. దాంతో ఐపీఎల్ మాట ఇప్పట్లో లేనట్లే. ఐపీఎల్ నిర్వహణపై ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఇప్పటికే పలువురు మాజీ స్పష్టం చేయగా, ఆ జాబితాలో మరో భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ కూడా చేరిపోయారు. అసలు ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహించాలనే మాటే సరికాదన్నారు. అది కేవలం క్రికెటర్లకు ఫ్యాన్స్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదన్నారు. ఇందులో మిగతా ప్రజల్ని కూడా చేర్చాల్సి వస్తుందన్నారు. క్రికెటర్లు ప్రయాణాలు చేసేటప్పుడు, మ్యాచ్‌లు నిర్వహించేటప్పుడు, బ్రాడ్ కాస్టింగ్ చేసేటప్పుడు మిగతా వారు లేకుండా ఎలా సాధ్యమవుతుందని మదన్‌లాల్ ప్రశ్నించారు. ఇక్కడ వేరు సెక్షన్లకు చెందిన ప్రజలు కరోనా ప్రభావానికి గురైతే అప్పుడు నష్టం ఇంకా పెద్దదిగా ఉంటుందున్నారు. రిస్క్ చేసి ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం లేదని, పరిస్థితులు చక్కబడి, కరోనా ప్రభావం చల్లబడినప్పుడు దానిపై దృష్టి సారించవచ్చన్నాడు. (‘ఐపీఎల్ ఆడటానికి సిద్ధంగా ఉన్నా’) -
కోహ్లికి ఆ సూచనలు అవసరమా!
ముంబై: మైదానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడుకు ఎంతమంది అభిమానుల ఉన్నారో అదే స్థాయిలో విమర్శకులు ఉన్నారన్నది వాస్తవం. అయితే, ఆట సమయంలో అతని ప్రవర్తన, దూకుడు తనకెంతో ఇష్టమని భారత మాజీ క్రికెటర్, క్రికెట్ సలహాదారు కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ అన్నాడు. కోహ్లి సహజ లక్షణం అయిన దూకుడును తగ్గించుకోవాలని అందరూ సూచించడంలో అర్థం లేదని పేర్కొన్నాడు. భారత్‌కు కోహ్లినే సరైన కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. (చదవండి: కోహ్లి, సానియాకు చాలెంజ్ విసిరిన సింధు) ‘కోహ్లి దూకుడు తగ్గించుకోవాలని అందరూ ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో భారత్‌కు దూకుడైన కెప్టెన్ అవసరం ఉందన్నారు. ఇప్పుడేమో కోహ్లిని ఆవేశం తగ్గించుకోమని సూచిస్తున్నారు. టీమిండియాకు దూకుడుగా ఉండటం రాదనేవారు. ప్రస్తుతం ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మనకు కోహ్లిలాంటి కెప్టెనే సరైనవాడు. మైదానంలో అతని ఆట, ప్రవర్తించే తీరు నాకు నచ్చుతుంది. అతని దూకుడును నేను ఆస్వాదిస్తా’అని మదన్‌లాల్ వివరించాడు. ఇటీవలి న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండో టెస్టులో విలియమ్సన్ అవుటయ్యాక కోహ్లి కాస్త అతిగా స్పందించడంతో అతని దూకుడు చర్చకు దారితీసింది. ఈ పర్యటనలో కోహ్లి అరుదైన రీతిలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి కేవలం 38 పరుగులు.. టీ20, వన్డేలు, టెస్టుల్లో ఒకే ఒక అర్థసెంచరీ నమోదు చేశాడు. దీనిపై స్పందిస్తూ ‘న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైనంత మాత్రానా కోహ్లి కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఇప్పటికీ అతనే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు. ప్రతీ ఆటగాడికి ఏదో ఒక దశలో ఇలాగే జరుగుతుంది. ఈ సమయంలో అతను ఫామ్ కోల్పోయాడంతే’అని లాల్ అన్నాడు. (చదవండి: దృఢంగా ఉండండి వ్యాప్తి చెందకుండా చూడండి) -
రాజస్తాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నుమూత
జైపూర్ : రాజస్తాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సైని (75) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. మదన్ లాల్ సైని రాజ్యసభ సభ్యుడే కాక గత సంవత్సరంలో రాజస్తాన్ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మదన్ లాల్ సైని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. మదన్ లాల్ మరణం పట్ల రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాజ్యసభ నాయకుడు మదన్ లాల్ మరణించారన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. మదన్ లాల్ సైని సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. -
అక్బర్ మహిళల్ని వేధించేవాడు
జైపూర్: రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్‌లాల్ సైనీ సరికొత్త వివాదానికి తెరలేపారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ మారువేషంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆయన ఆరోపించారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా గురువారం జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘అక్బర్ మహిళలు మాత్రమే పనిచేసే మీనా బజార్లను ఏర్పాటు చేశాడని ప్రపంచమంతటికీ తెలుసు. అందులోకి పురుషులకు ప్రవేశం నిషిద్ధం. కానీ అక్బర్ మాత్రం మారువేషంలో మీనాబజార్లలోకి ప్రవేశించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే బికనీర్ రాణి కిరణ్‌దేవిని కూడా వేధించడంతో ఆమె అక్బర్ గుండెలపైకి కత్తి దూసింది. వెంటనే అక్బర్ తన ప్రాణాల కోసం వేడుకున్నాడు. అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన తన మతం, సంస్కృతి, గౌరవం కోసం పోరాడాడు. ఇతరుల భూములను లాక్కోలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, సైనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అర్చనా శర్మ తీవ్రంగా మండిపడ్డారు. సైనీ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాలను దేశమంతా గౌరవిస్తోందనీ, కానీ చరిత్రకు ఇలాంటి తప్పుడు వక్రీకరణల కారణంగా సమాజంలో విద్వేషాలు వేళ్లూనుకుంటాయనీ, అంతిమంగా దేశసమగ్రతకు నష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. -
మళ్లీ ఏ మొహం పెట్టుకొని వచ్చావ్?
ఏన్కూరు: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌కు ఒకచోట పరాభవం ఎదురైంది. ఆయన ప్రచార రథాన్ని ఓ పల్లె వాసులు అడ్డుకున్నారు. ‘‘మా రోడ్డు అధ్వానంగా ఉంది. రోడ్డు లేని మా ఊరి అబ్బాయికి అమ్మాయిని కూడా ఇవ్వడం లేదు. మా ఊరి అమ్మాయిని ఎవరూ చేసుకోవడం లేదు. ఆటో రావలంటే ఏన్కూరు నుంచి ఐదొందలు అడుగుతున్నారు. పండగలకు, శుభకార్యాలకు బయటి నుంచి మా బంధువులు కూడా రావడం లేదు. వీటన్నింటికీ కారణం.. రోడ్డు లేకపోవడమే. గత ఎన్నికల్లో ఇప్పటిలాగా మా ఊరికొచ్చి.. రోడ్డు వేయిస్తానన్నారు. మళ్లీ ఇప్పుడొచ్చారు. రోడ్డు వేయిస్తామని చెప్పి వేయించకుండా.. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగటానికి మా ఊరొచ్చారు..?’’ అంటూ, టీఆర్ఎస్ వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌పై మండలంలోని పైనంపల్లి తండా వాసులు విరుచుకుపడ్డారు. ఆయన ప్రచార రథాన్ని అడ్టుకున్నారు. దీంతో, మదన్‌లాల్ అనుచరులకు.. తండా వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఇది, బుధవారం రాత్రి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జన్నారం, ఏన్కూరు, గార్లఒడ్డు, తూతకలింగన్నపేట, పికెబంజర, పైనంపల్లి తండాలో మదన్‌లాల్ ప్రచారం నిర్వహించారు. పైనంపల్లితండాలో ప్రచారం ముగిసిన తరువాత తిరిగి వెళుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. వారిని మదన్‌లాల్ అనుచరులు పక్కకు లాగేశారు. ఈ దశలో తోపులాట జరిగింది. కొద్దిసేపటి తరువాత మదన్‌లాల్ వెళ్లిపోయారు. శంకుస్థాపన చేద్దామనుకునేసరికే ప్రభుత్వం రద్దయింది... ‘‘తిమ్మారావుపేట రోడ్డు నుంచి పికెబంజర, పైనంపల్లితండా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. శంకుస్థాపన చేద్దామని అనుకుంటుండగగానే.. ఏడు నెలల ముందే ప్రభుత్వం రద్దయింది. ఎలక్షన్ కోడ్ కారణంగా శంకుస్థాపన చేయలేకపోయాను’’ అని, మదన్‌లాల్ చెప్పారు. పికెబంజరలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. -
సాహసి
‘ఇంగ్లండ్‌ను పాలించే హక్కు జర్మన్లకు లేనప్పుడు, భారత్‌ను పరిపాలించడానికి ఇంగ్లండ్‌కు మాత్రం ఉన్న హక్కు ఏమిటి?’ లండన్‌లోని 65, క్రోమ్‌వెల్ అవెన్యూలోని ఇండియా హౌస్. ఆ రోజు ఆదివారం.ప్రతి ఆదివారం జరిగినట్టే ఆ రోజు కూడా భారతీయ విద్యార్థులతో, స్వాతంత్య్రోద్యమానికి అండగా ఉండే మేధావులతో సమావేశం జరుగుతోంది. ఇండియా హౌస్ మేనేజర్ వినాయక్ దామోదర్ సావర్కర్ భవిష్యత్ భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. సమావేశం జరుగుతున్న గదిని ఆనుకుని ఉన్న గదిలో కొందరు యువకులు పెద్దగా మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు చతురోక్తులు విసురుకుంటూ బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. దీనితో సావర్కర్‌కు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఉపన్యాసం ఆపేసి ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్నవారిలో ఒక యువకుడే మదన్‌లాల్ థింగ్రా. లండన్ యూనివర్సిటీ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థి. ‘ఏం మదన్! ఎప్పుడూ ధైర్యసాహసాల గురించి మాట్లాడతావ్? ఏదో చేయాలని నిరంతరం చెబుతూ ఉంటావ్! ఇదేనా నీ ధైర్యం? ఇక్కడ జరిగే సమావేశాలకు కూడా రావడం మానేశావ్! ఇదా ధైర్యమంటే? ఏదో చేయడమంటే ఇదేనా?’ అని అరిచారు సావర్కర్. నిజానికి థింగ్రాకు (సెప్టెంబర్ 18, 1883– ఆగస్ట్ 17, 1909) తొలి రోజులలో స్వాతంత్య్రోద్యమం మీద గొప్ప ఆసక్తి లేదు. కానీ ఏదో చెప్పి ఉండాలి సావర్కర్‌కి. అందంగా ఉండేవాడు. ఎప్పుడూ చతురోక్తులతో మాట్లాడుతూ, ప్రేమ గీతాలు ఆలపిస్తూ మిత్రులతో గంటలు గంటలు గడిపేవాడు. అలాంటివాడు కూడా ఆ ఆదివారం సావర్కర్ అన్న మాటలతో మారిపోయాడు. విన్నపాలు, విజ్ఞాపన పత్రాలు బ్రిటిష్ జాతిని కదిలించవన్న సంగతిని భారత జాతీయ కాంగ్రెస్ చేత అంగీకరింప చేసే ప్రయత్నం 1905 నుంచి ఆరంభమైంది. బెంగాల్ విభజన కోసం బ్రిటిష్ జాతి ఆడిన నాటకం భారతీయుల అభిప్రాయాలను పూర్తిగా మార్చివేసింది. మితవాదంతో కాకుండా, సంఘర్షణతో, సాయుధ సమరంతో బ్రిటిష్ జాతిని ఎదుర్కొనాలన్న ఆవేశం ఒక వర్గంలో పెల్లుబుకింది. వీరు జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులను కూడా ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపించదు. నిజంగానే భారత స్వాతంత్య్ర సమరంలో అదొక దశ. కానీ ఇది చరిత్ర పుస్తకాలలో కానరాదు. ఈ దశకు చెందినవారే మదన్‌లాల్ థింగ్రా. ఆరంభంలో చెప్పుకున్న ఆ రెండు మాటలు ఆయన పలికినవే. అది కూడా కర్జన్ వైలీని హత్య చేసినందుకు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో లండన్‌లోని పెంటన్‌విల్లె జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో థింగ్రా ఇచ్చిన వాగ్మూలంలో ఈ మాటలు అన్నాడు. మదన్‌లాల్ థింగ్రా అనుకోకుండా ఇంగ్లండ్‌లో భారతీయ విప్లవకారుల ప్రభావంలో పడ్డారు. థింగ్రా అమృత్‌సర్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ వైద్యుడు. ఇంగ్లిష్ జాతి అంటే అభిమానించేవాడు కూడా.ఏడుగురు మగపిల్లలు ఆయనకు. థింగ్రా ఆరోవాడు. ఆయన ఇద్దరు అన్నలు కూడా వైద్యశాస్త్రమే చదివారు.థింగ్రా లాహోర్ తదితర ప్రాంతాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత జనవరి 1, 1906న ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇంజనీరింగ్ చదవడానికి లండన్‌లోని యూనివర్సిటీ కళాశాలలో చేరారు. భారతీయ విద్యార్థుల కోసం అక్కడే ‘ఇండియా హౌస్’ ఉండేది. థింగ్రా కూడా అందులోనే ఉన్నారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇండియా హౌస్ గురించి కొంచెం తెలుసుకోవాలి. దీనిని 1905లోనే శ్యామ్‌జీకృష్ణవర్మ నెలకొల్పారు. ఇందులో ఎవరైనా చేరవచ్చు. ఏ రాజకీయ సిద్ధాంతం వారికైనా కూడా హౌస్ తలుపులు తెరిచే ఉంచుతుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావర్కర్ చెప్పడం విశేషం. కానీ భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ హౌస్ నుంచి మద్దతు ఉండేది. అసలు ఉద్దేశమే అది. దీనికే 1906 జూన్‌లో వినాయక్ దామోదర్ సావర్కర్ మేనేజర్ అయ్యారు. ఆయన కూడా విద్యార్థిగానే అక్కడకు వచ్చారు. ఆయన న్యాయశాస్త్రం అభ్యసించేవారు. ఆయన వెళ్లిన తరువాత వారం వారం సమావేశాలు జరిగేవి. భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ఇవ్వడం గురించి, భావి భారతం రూపురేఖల గురించి చర్చించడమే వాటి ఉద్దేశం. సావర్కర్ ఇంకా రష్యా, చైనా, ఐర్లండ్, టర్కీ, ఈజిప్టులలో ఉన్న విప్లవకారులతో సంప్రతింపులు జరుపుతూ ఉండేవారు. అభినవ్ భారత్ సంస్థను స్థాపించి భారతీయ విద్యార్థులను ఉద్యమం వైపు దృష్టి సారించేటట్టు చేసేవారు. 1907 నాటికి గ్రేట్ బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 700. ఇందులో 380 మంది లండన్‌లోనే ఉండేవారు. చిత్రం ఏమిటంటే, స్వాతంత్య్రోద్యమానికి దేశ విదేశాలలోని అభిమానులను, విద్యార్థులను ఏకం చేయడానికి భారతదేశంలో లేని వెసులుబాటు ఇంగ్లండ్‌లో దొరికేది. దీనినే ఇండియా హౌస్ వినియోగించుకునేది. శ్యామ్‌జీ కృష్ణవర్మ, సావర్కర్, మేడం కామా, బారిస్టర్ సర్దార్ సింగ్ రాణా, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ (సరోజినీదేవి సోదరుడు), సర్దార్ అజిత్‌సింగ్, లాలా హరదయాళ్, రాస్బిహారీ బోస్, మహేంద్ర ప్రతాప్, చంపక్రామన్ పిళ్లై వంటివారు విదేశాల నుంచే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఇక ఇండియా హౌస్‌కు వచ్చిన ప్రముఖుల జాబితా కూడా విశిష్టమైనదే. లాల్, పాల్, బాల్, గాంధీజీ వంటివారంతా కూడా హౌస్‌ను సందర్శించారు. సావర్కర్, గాంధీల తొలి సమావేశం ఇక్కడే జరిగింది. సావర్కర్ మందలించిన తరువాత థింగ్రా ఇండియా హౌస్‌ను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. తరువాత ఎప్పుడో ఒకసారి వచ్చి కలిశాడు. సావర్కర్ అప్పటికీ తన మీద కోపంతోనే ఉన్నారని థింగ్రా అనుకున్నాడు. కానీ సావర్కర్ అసలేమీ జరగనట్టే ఆప్యాయంగా మాట్లాడారు. అప్పుడే అడిగాడు థింగ్రా, ‘అమరత్వానికి సమయం వచ్చిందా?’ అని. ‘అమరుడు కావాలని అనుకునేవారు సంసిద్ధులయ్యామని నమ్మితే అమరత్వానికి సమయం వచ్చినట్టే’ అన్నారు సావర్కర్. కానీ అప్పటికే థింగ్రా నేషనల్ ఇండియన్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. ఈ సంస్థ ఉద్దేశం భారతీయ యువకులు స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులు కాకుండా చూడటమే. మిస్ ఎమ్మా జోసఫీన్ బెక్ కార్యదర్శిగా ఉండేవారు. బ్రిటిష్ ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పిస్తూ, భారతీయ విద్యార్థులను విందులకు, వినోదాలకు ఆహ్వానిస్తూ ఆమె కార్యక్రమాలు నిర్వహించేవారు. జూలై 1, 1909.లండన్‌లోనే ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఒక సమావేÔ¶ ం (ఎట్ హోం) ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథి చాలా ప్రముఖుడు. ఇండియన్ ఆఫీస్‌లో ఉన్నతోద్యోగి కర్జన్ వైలీ. పాస్ చూపించి థింగ్రా కూడా లోపలికి వెళ్లాడు. వైలీ ఉపన్యాసం పూర్తయింది. అతడు లేచి వెళ్లిపోతున్నాడు. అప్పుడే థింగ్రా కూడా వెళ్లాడు. అతడు గ్లాస్ డోర్ తెరవబోతున్నాడు. ‘ముఖ్యమైన విషయం మాట్లాడాలి’ అన్నాడు థింగ్రా. ఏమిటన్నట్టు చెవి ఒగ్గాడు వైలీ. వెంట తెచ్చిన రివాల్వర్ బయటకు తీసి ఆరేడు సార్లు కాల్చాడు. థింగ్రా పారిపోలేదు. వెంటనే అరెస్టయ్యాడు. నిజానికి ఇండియా హౌస్‌ను వీడిన తరువాత థింగ్రా చేసిన పని– టోటెన్హ్యామ్ కోర్ట్ రోడ్డులో ఒకచోట తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. మొదట అతడి లక్ష్యం వైలీ కాదు. లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన పేరుతో దేశంలో కర్జన్ చేసిన కల్లోలం తక్కువేమీ కాదు. అంతేకాదు, భారతీయులంటే ఇతడికి ఉన్న చిన్నచూపు కూడా తక్కువేమీ కాదు. అలాగే బెంగాల్ మాజీ గవర్నర్ భ్రామ్ఫీల్డ్ ఫుల్లర్ని కూడా చంపాలని అనుకున్నాడు. ఆఖరికి కర్జన్ వైలీ దొరికాడు. వైలీతో పాటు అతడికి రక్షణగా వెళ్లిన పార్సీ వైద్యుడు డాక్టర్ లాల్కాకా కూడా ఆ కాల్పులలో చనిపోయాడు. థింగ్రా వెంట అతని మిత్రుడు కొరెగాంకార్ కూడా ఉన్నాడు. వైలీ వెళ్లిపోతున్న సంగతి థింగ్రాకు ఆయనే చెప్పాడు. నాలుగురోజుల తరువాత వైలీ సంతాప సభ జరిగింది. ఇందులో భజన్‌లాల్ అనే గ్రేస్ ఇన్ కళాశాల న్యాయశాస్త్ర విద్యార్థి మదన్‌లాల్ థింగ్రా చర్యను ఖండిస్తున్నట్టు ప్రకటించాడు. అతడు స్వయంగా థింగ్రా సోదరుడే. తరువాత బ్రిక్స్టన్ జైలులో ఉండగా కలుసుకోవడానికి వెళ్లాడు. కానీ థింగ్రా అతడిని కలుసుకోవడానికి నిరాకరించాడు. మరొక సంతాప సభను భారతీయులు నిర్వహించారు. దీనికి ఆగాఖాన్ అధ్యక్షుడు. ఈ సభ కూడా వైలీ హత్యను ఖండించింది. తీర్మానం ఏకగ్రీవమని ఆగాఖాన్ ప్రకటిస్తే, ఒక గొంతు తన అసమ్మతిని ప్రకటించింది. ఆ గొంతు సావర్కర్‌ది. ఆయనను వెంటనే అధ్యక్షుడి ఆదేశం మేరకు సభ నుంచి బహిష్కరించారు. థింగ్రా మత్తుమందులకు బానిస అంటూ ఇంగ్లండ్ పత్రికలు ప్రచారం చేశాయి. భారతదేశంలో దొరికే భంగు అనే మందును అతడు తీసుకుంటాడని అవి రాశాయి. కానీ కోర్టులో ఇది రుజువు కాలేదు. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ కార్యదర్శి ఎమ్మా, థింగ్రా నివాసం ఇంటి యజమానురాలు కూడా ఈ ఆరోపణను తిరస్కరించారు. కాగా థింగ్రా సాహసాన్ని మెచ్చుకుంటూ రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పత్రిక వ్యాసం ప్రచురించింది. ఇది ఐర్లండ్ విప్లవోద్యమాన్ని సమర్థించేది. దీనితో ఆ పత్రిక సంపాదకుడిని జైలుకు పంపారు. తన ప్రజల గళాలను అణచివేసే వారిని తుదముట్టించడం కోసం ఈ హత్య తనే చేశానని థింగ్రా ముందే అంగీకరించాడు. ఈ సందర్భంగా స్వేచ్ఛాస్వాతంత్య్రాల మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసాధారణంగా ఉన్నాయి. విచారణ అయిందనిపించి థింగ్రాను పెంటన్‌విల్లె జైలులో (లండన్) ఉరి తీశారు. విచారణ ఆరంభంలోనే థింగ్రా తన వైఖరి ఏమిటో చెప్పేశాడు. ‘‘నేను మీ దయాదాక్షిణ్యాల కోసం అర్థించను. అసలు మీ న్యాయ వ్యవస్థనే నేను విశ్వసించడం లేదు.’’ ∙డా. గోపరాజు నారాయణరావు -
టీఆర్ఎస్లో అసమ్మతి రాగాలు
సాక్షి, ఖమ్మం : అసెంబ్లీని రద్దు చేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరలేపడంతో.. ఆ పార్టీలో అసమ్మతి రాగాలు జోరందుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల కోసం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ 105 నియోజకరవర్గాల అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. అయితే, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానిక నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఖమ్మ జిల్లా వైరా నియోజకవర్గం పార్టీ టికెట్‌ను తాజా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు కేటాయించడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు మరోసారి అవకాశం ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు వైరా నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం సమావేశమయ్యారు. మదన్‌లాల్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కార్యకర్తలు.. పార్టీ నాయకులు, శ్రేణులందరినీ కలుపుకొనిపోయే నాయకుడికి టికెట్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మదన్‌లాల్ ఓడిపోతే తమకు సంబంధం లేదని వారు తెగేసి చెప్పారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బయ్యారం మండల కేంద్రం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టిఆర్ఎస్లో చేరారు. -
చేతులు లేకపోతేనేం....
చండీగఢ్: చేతులు లేనివారు కాళ్లతోని ఇంటి పనులు, వంట పనులు చేసుకోవడం, కాళ్లతోనే పరీక్షలు రాయడం, కాళ్లతోని బొమ్మలు గీయడం లాంటివి మనం అప్పుడప్పుడు పత్రికల్లో చూస్తుంటాం. కానీ హర్యానాలోని మదన్‌లాల్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాళ్లతోని టైలరింగ్ చేయడం ఎక్కడా చూసి ఉండం. బట్టల కొలతలు తీసుకోవడం, వాటిని పొందికగా కావాల్సిన తీరులో కత్తిరించడం, కుట్టు చెదరకుండా వాటిని కుట్టడం చేతులున్న వారికే కష్టమైన పని. ఈ మూడు పనులను అతి నైపుణ్యంతో చేస్తూ గ్రామ ప్రజల మనసులను, మన్ననలను దోచుకుంటున్నారు మదన్‌లాల్. ఆయన రెండు చేతుల్లేకుండానే పుట్టారు. ఏ బడికెళ్లిన దివ్యాంగుడివి, చదువు నేర్చుకోవడం రాదంటూ తిప్పి పంపించారట. దివ్యాంగులను కూడా చేర్చుకునే పట్నం బడులకు వెళ్లేంత స్థోమత ఆయన కుటుంబానికి లేకపోవడం వల్ల ఇక చదువుకోవలనే ఆశను చంపుకున్నారు. నానమ్మ, తాతయ్యలకు చేదోడు, వాదోడుగా ఇంట్లో పనులు చేస్తూ వచ్చారు. 23 ఏళ్ల ప్రాయంలో ఏదైనా వృత్తిలో స్థిరపడి సంపాదించాలనుకున్నారు. అందుకు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నారు. ఊరు, వాడా తిరిగారు. టైలరింగ్ నేర్పేందుకు ఎవరూ ఒప్పుకోలేదు. పైగా గేలిచేసి పంపించారు. చివరకు పొరుగునున్న ఫతేహబాద్కు వెళ్లారు. ఎంతో నచ్చచెప్పగా అక్కడ ఓ టైలర్ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయన వద్ద టైలరింగ్ నేర్చుకొని కొంతకాలం అక్కడే గడిపిన మదన్‌లాల్ చివరకు తన ఊరుకు వచ్చి ఓ టైలరింగ్ షాపు పెట్టుకున్నారు. వచ్చేవారికి, పోయే వారికి తన నైపుణ్యం గురించి చెబుతూ వచ్చారు. మొదట ఎవరూ నమ్మలేదు. ఆయన వద్ద బట్టలు కుట్టించుకునేందుకు ధైర్యం చేయలేదు. తాను ఎలా కుడతానో ప్రాక్టికల్‌గా కుట్టి చూపించగా అప్పటి నుంచి గిరాకీ రావడం మొదలైంది. ఇప్పుడు ఆయన టైలరింగ్ షాపు సంతప్తికరంగా నడుస్తోంది. మదన్‌లాల్ తన వంట తానే చేసుకోవడంతోపాటు తీరక వేళల్లో కాళ్లతోనే చీట్ల పేక ఆడతారు. ఆత్మవిశ్వాసం, అందుకుతగ్గ కషి ఉండాలిగానీ అనుకున్నది దేన్నైనా సాధించవచ్చని మదన్‌లాల్ తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. -
క్వార్టర్స్‌లో మనోజ్, మదన్‌లాల్
ఆసియా సీనియర్ బాక్సింగ్ బ్యాంకాక్: కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మనోజ్‌తోపాటు భారత్‌కే చెందిన మదన్ లాల్ (52 కేజీలు), కుల్దీప్ సింగ్ (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 3-0తో దీపక్ శ్రేష్ట (నేపాల్)పై, మదన్ లాల్ 3-0తో ముర్తదా అల్ సుదాని (ఇరాక్)పై గెలుపొందగా... చైనా బాక్సర్ ఒలిన్ జాంగ్‌పై కుల్దీప్ విజయం సాధించాడు. ఇప్పటికే దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ (75 కేజీలు), మన్‌ప్రీత్ (ప్లస్ 91 కేజీలు), సతీశ్ (91 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. తదుపరి బౌట్లలో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంటే వీరందరికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. -
ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
హైదరాబాద్: టీఆర్ఎస్లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. తమ పార్టీ టికెట్‌పై గెలుపొంది మరో పార్టీలోకి మారిన మదన్‌లాల్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగ నిబంధనలను, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు గురువారం అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు పార్టీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు పేరుతో రాసిన లేఖను ఆయనకు అందించారు. సెప్టెంబర్ 1న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో మదన్‌లాల్ ఆ పార్టీలో చేరారని స్పీకర్‌కు తెలిపారు. ఇందుకు సంబంధించిన పేపర్, వీడియో క్లిప్పింగ్‌లను లేఖతో జతపరిచినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యత్వాన్ని స్వచ్ఛం దంగా వదులుకుని టీఆర్ఎస్లో చేరుతున్నట్లు మదన్‌లాల్ ప్రకటించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పార్టీ 2011 మార్చిలోనే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినట్లు గుర్తుచేశారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లాసూర్యప్రకాష్ ఉన్నారు. -
జగన్ విడుదలతో నూతనోత్సాహం
పెద్దమునగాల (కొణిజర్ల), న్యూస్‌లైన్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి విడుదలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్‌లాల్ అన్నారు. కాం గ్రెస్‌తో జగన్మోహన్రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, అందుకే ఆయన విడుదలయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని విమర్శించారు. ఆయన బుధవారం పెద్దమునగాలలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ- కాం గ్రెస్‌ల కుట్రల కారణంగానే జగన్మోహన్రెడ్డి జైలుపాలయ్యారని అన్నారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టయితే ఇంతకాలం జైలులో ఎందుకుంటారని ప్రశ్నిం చారు. జగన్మోహన్రెడ్డి రాకతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలలో నూతనోత్సాహం నెల కొందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పలు ప్రజాసంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి చేరవేసేందుకే పార్టీ పెట్టినట్టుగా తమ నేత చెప్పారని అన్నారు. రాష్ట్రం ఎన్ని ముక్కలైనప్పటికీ.. అన్నిచోట్ల వైఎస్ఆర్సీపీ ఉంటుందని, ఎన్నికల్లో విజయం సాధించి.. మహానేత పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళుతుందని, ప్రాంతాలకతీతంగా అభివృద్ధి సాధిం చేందుకు కృషి చేస్తుందని చెప్పారు. ఈ నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ప్రాంతాలకతీతంగా ఆదరిస్తున్నారని చెప్పా రు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాముల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ రాయ ల పుల్లయ్య, విద్యార్థి విభాగం జిల్లా కన్వీన ర్ అయిలూరి మహేష్ రెడ్డి, నాయకులు గుమ్మా రోశయ్య, దొడ్డిపినేని రామారావు, తాళ్లూరి చిన్నపుల్లయ్య, గుర్రం వెంకటేశ్వర్లు, వడ్లమూడి కృష్ణార్జునరావు, అనసూర్య, బైరం బాలరాజు, బంటు వెంకటేశ్వర్లు, మదార్ సాహెబ్, ఉప సర్పంచ్ డేగలవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.