Ind Vs SA: Madan Lal Shocking Comments On Rishabh Pant Goes Viral - Sakshi
Sakshi News home page

SA vs IND: 'పంత్‌ని కొద్ది రోజులు పక్కన పెట్టండి.. అప్పుడే తెలిసి వస్తుంది'

Published Sun, Jan 9 2022 11:42 AM | Last Updated on Sun, Jan 9 2022 12:44 PM

It is better Time to give Rishabh Pant a break Says Madan Lal - Sakshi

జొహాన్స్‌ బర్గ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ కోల్పోయిన రిషబ్‌ పంత్‌పై మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ  కోవలో భారత మాజీ క్రికెటర్‌ మదన్‌ లాల్‌ కూడా చేరాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అనడంలో సందేహం లేదని, కానీ రెండవ ఇన్నింగ్స్‌లో ఆ విధంగా అతడు బ్యాటింగ్‌ చేయలేదని మదన్‌ లాల్‌ తెలిపాడు.

"పంత్‌ని పక్కన పెట్టవలసిన సమయం వచ్చింది. అతడి స్ధానంలో వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలి. అతడు పంత్‌ కంటే తెలివైన ఆటగాడు. అదే విధంగా అతడు అత్యుత్తమ వికెట్ కీపర్‌. . అయితే టెస్టు క్రికెట్‌లో పంత్  ఎలా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడో అతడే నిర్ణయించుకోవాలి. కాబట్టి అతడికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలి. పంత్‌ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు.  కానీ అతడు తన ఆటకు తగ్గట్లు రాణించడం లేదు. ఏ ఆటగాడైన జట్టు కష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు అదుకోవాలి" అని మదన్‌ లాల్‌ పేర్కొన్నాడు. ఇక భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య అఖరి టెస్ట్‌ కేప్‌ టౌన్‌ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది.  ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో మూడో టెస్ట్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

చదవండిNZ vs BAN: ఇదేం ఫీల్డింగ్‌ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement