ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | ysrcp complaint to the Speaker on MLA Madan lal | Sakshi

ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published Fri, Oct 10 2014 1:59 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తమ పార్టీ టికెట్‌పై గెలుపొంది మరో పార్టీలోకి మారిన మదన్‌లాల్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగ నిబంధనలను, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు పార్టీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు పేరుతో రాసిన లేఖను ఆయనకు అందించారు.

సెప్టెంబర్ 1న టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో మదన్‌లాల్ ఆ పార్టీలో చేరారని స్పీకర్‌కు తెలిపారు. ఇందుకు సంబంధించిన పేపర్, వీడియో క్లిప్పింగ్‌లను లేఖతో జతపరిచినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని స్వచ్ఛం దంగా వదులుకుని టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మదన్‌లాల్ ప్రకటించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పార్టీ 2011 మార్చిలోనే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినట్లు గుర్తుచేశారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లాసూర్యప్రకాష్ ఉన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement