పెద్దమునగాల (కొణిజర్ల), న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి విడుదలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్‌లాల్ అన్నారు. కాం గ్రెస్‌తో జగన్‌మోహన్‌రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, అందుకే ఆయన విడుదలయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని విమర్శించారు. ఆయన బుధవారం పెద్దమునగాలలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ- కాం గ్రెస్‌ల కుట్రల కారణంగానే జగన్‌మోహన్‌రెడ్డి జైలుపాలయ్యారని అన్నారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టయితే ఇంతకాలం జైలులో ఎందుకుంటారని ప్రశ్నిం చారు. జగన్‌మోహన్‌రెడ్డి రాకతో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలలో నూతనోత్సాహం నెల కొందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన పలు ప్రజాసంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి చేరవేసేందుకే పార్టీ పెట్టినట్టుగా తమ నేత చెప్పారని అన్నారు.
రాష్ట్రం ఎన్ని ముక్కలైనప్పటికీ.. అన్నిచోట్ల వైఎస్‌ఆర్‌సీపీ ఉంటుందని, ఎన్నికల్లో విజయం సాధించి.. మహానేత పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళుతుందని, ప్రాంతాలకతీతంగా అభివృద్ధి సాధిం చేందుకు కృషి చేస్తుందని చెప్పారు. ఈ నమ్మకంతోనే జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలు ప్రాంతాలకతీతంగా ఆదరిస్తున్నారని చెప్పా రు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాముల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ రాయ ల పుల్లయ్య, విద్యార్థి విభాగం జిల్లా కన్వీన ర్ అయిలూరి మహేష్ రెడ్డి, నాయకులు గుమ్మా రోశయ్య, దొడ్డిపినేని రామారావు, తాళ్లూరి చిన్నపుల్లయ్య, గుర్రం వెంకటేశ్వర్లు, వడ్లమూడి కృష్ణార్జునరావు, అనసూర్య, బైరం బాలరాజు, బంటు వెంకటేశ్వర్లు, మదార్ సాహెబ్, ఉప సర్పంచ్ డేగలవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జగన్ విడుదలతో నూతనోత్సాహం
Published Thu, Oct 3 2013 5:29 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
Advertisement
Advertisement