సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 1 అభిమానులను ఆకట్టుకుంది. స్థానిక ఆటగాళ్లలోని ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక అయింది. ఈ క్రమంలో ఏపీఎల్ రెండో ఎడిషన్ పై అంచనాలు పెరిగాయి.
అందుకు తగ్గట్టుగానే ఆరు జట్లు పోటాపోటీగా తలపడి కావాల్సినంత వినోదం అందించాయి. ఇక ఇప్పుడు ఏపీఎల్-2 తుది అంకానికి చేరుకుంది. కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్ ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో చాలా మంది సీజన్ 1 చాలా బాగా నిర్వహించారని ప్రశంసించినట్లు చెప్పారు. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా మాజీ ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ హాజరయ్యాడు.
ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టమైన రాష్ట్రం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి మరి కొంత మంది క్రికెటర్లు రావాలని కోరుకుంటున్న. ఇప్పటికే ఏపీ మంచి క్రికెటర్లను అందించింది. యువ క్రికెటర్లకు మంచి అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కల్పిస్తుంది అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment