ఆధిపత్యం కొనసాగించిన కోస్టల్ రైడర్స్
Andhra Premier League 2023: లీగ్ చివరి మ్యాచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన గోదావరి టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. 16 పాయింట్లతో కోస్టల్ రైడర్స్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ జట్లు 12 పాయింట్లు సాధించగా.. మెరుగైన రన్ రేట్‌తో లయన్స్ రెండో స్థానంలో నిలిచింది.
బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ ఎనిమిదేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో టైగర్స్ ప్లేఆఫ్‌నకు అర్హత సాధించింది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్స్‌తో టైగర్స్ తలపడనుండగా క్వాలిఫైయిర్ వన్‌లో రైడర్స్‌తో లయన్స్ తలపడనుంది. వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో రెండో సీజన్ ముగించింది.
విశాఖ స్పోర్ట్స్: కోస్టల్ రైడర్స్ మరోసారి ప్లేఆఫ్‌నకు చేరుకుంది. ఏపీఎల్ సీజన్–2 లీగ్ చివరి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌పై విజయం సాధించి 16 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 131 పరుగులు చేసింది.
వరుణుడి అంతరాయం
వరుణుడు 13 ఓవర్ వద్ద అంతరాయం కలిగించగా.. అప్పటికి కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 98 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ వీరారెడ్డి 45 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. చివర్లో కమరుద్దీన్( 21 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి స్కోర్‌ను ముందుకు నడిపాడు. తిరిగి ఆటను కొనసాగించగా కింగ్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేయగా.. మరోసారి వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. అబ్దుల్లా 4 వికెట్లు తీయగా స్టీఫెన్, మనోహార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
చిరంజీవి అజేయ ఇన్నింగ్స్
దీంతో కోస్టల్ రైడర్స్‌కు డీఎల్‌ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. 14 ఓవర్లలోనే రెండు వికెట్లకు 127 పరుగులతో రైడర్స్ విజయం సాధించారు. ఓపెనర్ ధరణీకుమార్(18), కెప్టెన్ రషీద్(4) వికెట్లను 65 పరుగులకే రైడర్స్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రణీత్ 64, చిరంజీవి 32 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. కమరుద్దీన్, హనుమ విహారి చెరో వికెట్ తీశారు.
ప్లే ఆఫ్స్‌లో బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్
అసలు పోరులో చేతులెత్తేసిన టైటాన్స్
తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ చేతులెత్తేసింది. రెండో మ్యాచ్‌లో టైటాన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ జ్ఞానేశ్వర్(2), హేమంత్(1) ఎనిమిది పరుగులకే పెవిలియన్‌కు చేరారు. శ్యామ్ 11, సమన్విత్ 14, సత్యనారాయణ 16 పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
మరో బంతి ఉండగానే టైటాన్స్ 77 పరుగులకే ఆలౌటైంది. పృధ్వీ, తేజస్వి మూడేసి వికెట్లు తీయగా అయ్యప్ప రెండు, అజయ్, వాసు ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్ కెప్టెన్ భరత్(4), అతని స్థానంలో వచ్చిన రోహిత్ డకౌట్‌గా అయ్యారు.
ఓపెనర్ గుల్ఫమ్(29)కు రాహుల్ తోడై మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రాహుల్(33), తపస్వి(10) అజేయంగా నిలిచి 13.4 ఓవర్లలోనే 79 పరుగుల చేసి జట్టుకు విజయాన్నందించారు. మల్లికార్జున రెండు వికెట్లు, కమిల్ ఓ వికెట్ తీశాడు.
రాయలసీమ కింగ్స్
చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!
విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ!
Comments
Please login to add a commentAdd a comment