Bezawada Tigers
-
APL 2023: తుది అంకానికి ఏపీఎల్ సమరం.. ప్లే ఆఫ్స్ చేరిన జట్లు ఇవే
Andhra Premier League 2023: లీగ్ చివరి మ్యాచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన గోదావరి టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. 16 పాయింట్లతో కోస్టల్ రైడర్స్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ జట్లు 12 పాయింట్లు సాధించగా.. మెరుగైన రన్ రేట్‌తో లయన్స్ రెండో స్థానంలో నిలిచింది. బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ ఎనిమిదేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో టైగర్స్ ప్లేఆఫ్‌నకు అర్హత సాధించింది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్స్‌తో టైగర్స్ తలపడనుండగా క్వాలిఫైయిర్ వన్‌లో రైడర్స్‌తో లయన్స్ తలపడనుంది. వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో రెండో సీజన్ ముగించింది. విశాఖ స్పోర్ట్స్: కోస్టల్ రైడర్స్ మరోసారి ప్లేఆఫ్‌నకు చేరుకుంది. ఏపీఎల్ సీజన్–2 లీగ్ చివరి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌పై విజయం సాధించి 16 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 131 పరుగులు చేసింది. వరుణుడి అంతరాయం వరుణుడు 13 ఓవర్ వద్ద అంతరాయం కలిగించగా.. అప్పటికి కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 98 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ వీరారెడ్డి 45 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. చివర్లో కమరుద్దీన్( 21 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి స్కోర్‌ను ముందుకు నడిపాడు. తిరిగి ఆటను కొనసాగించగా కింగ్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేయగా.. మరోసారి వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. అబ్దుల్లా 4 వికెట్లు తీయగా స్టీఫెన్, మనోహార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చిరంజీవి అజేయ ఇన్నింగ్స్ దీంతో కోస్టల్ రైడర్స్‌కు డీఎల్ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. 14 ఓవర్లలోనే రెండు వికెట్లకు 127 పరుగులతో రైడర్స్ విజయం సాధించారు. ఓపెనర్ ధరణీకుమార్(18), కెప్టెన్ రషీద్(4) వికెట్లను 65 పరుగులకే రైడర్స్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రణీత్ 64, చిరంజీవి 32 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. కమరుద్దీన్, హనుమ విహారి చెరో వికెట్ తీశారు. ప్లే ఆఫ్స్‌లో బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ అసలు పోరులో చేతులెత్తేసిన టైటాన్స్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ చేతులెత్తేసింది. రెండో మ్యాచ్‌లో టైటాన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ జ్ఞానేశ్వర్(2), హేమంత్(1) ఎనిమిది పరుగులకే పెవిలియన్‌కు చేరారు. శ్యామ్ 11, సమన్విత్ 14, సత్యనారాయణ 16 పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మరో బంతి ఉండగానే టైటాన్స్ 77 పరుగులకే ఆలౌటైంది. పృధ్వీ, తేజస్వి మూడేసి వికెట్లు తీయగా అయ్యప్ప రెండు, అజయ్, వాసు ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్ కెప్టెన్ భరత్(4), అతని స్థానంలో వచ్చిన రోహిత్ డకౌట్‌గా అయ్యారు. ఓపెనర్ గుల్ఫమ్(29)కు రాహుల్ తోడై మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రాహుల్(33), తపస్వి(10) అజేయంగా నిలిచి 13.4 ఓవర్లలోనే 79 పరుగుల చేసి జట్టుకు విజయాన్నందించారు. మల్లికార్జున రెండు వికెట్లు, కమిల్ ఓ వికెట్ తీశాడు. రాయలసీమ కింగ్స్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! -
APL: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో అదృష్టం మీదైతే!
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్‌కు వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఈ క్రికెట్ ఈవెంట్‌కు బుధవారం తెరలేవనుంది. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో రోజూ రెండు చొప్పున 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. టైటిల్ పోరు ఈ నెల 27న జరగనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. తొలిసీజన్ టైటిల్ పోరులో ఢీకొట్టిన బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ ఈసారి లీగ్ ప్రారంభ మ్యాచ్‌లోనే తలపడనుండడంతో ఏపీఎల్ – 2 ఆది నుంచే హోరాహోరీగా సాగనుంది. మ్యాచ్‌లు వీక్షించే అభిమానులకు లక్కీడిప్ ద్వారా విశాఖ వేదికగా త్వరలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టికెట్లు అందించనున్నారు. సినీనటి శ్రీలీల తొలిరోజు మ్యాచ్ వీక్షించేందుకు రానున్నారు. బెజవాడ టైగర్స్: వికెట్ల వెనుక నుంచే... టైటిల్ పోరులో ఢీకొట్టి కేవలం ఏడు పరుగుల తేడాతో వెనుకబడిపోయిన బెజవాడ టైగర్స్ ఈసారి వికెట్ల వెనుక నుంచే మ్యాచ్‌ను ముందుకు నడిపించే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామంటూ ఫ్రాంచైజీ అధినేత రమణమూర్తి అంటున్నారు. అందులో భాగంగానే ఈ సీజన్లో అత్యధిక ధరతో రికీబుయ్‌ను నిలబెట్టుకుంది. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న రికీ మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దడమే గాక జట్టును ముందుకు నడపనున్నాడు. మహీప్ వికెట్ల వెనుక సత్తా చాటనుండగా అవసరమైతే నేనున్నా అంటున్నాడు మహిమా. ఆల్‌రౌండర్లు షోయిబ్, సాయురాహుల్తోపాటు లలిత్, అవినాష్లుండగా సాయితేజ బంతితో చెలరేగనున్నాడు. రాయలసీమ కింగ్స్ : టాప్ ఆర్డర్ పటిష్టం సౌత్జోన్నే విజేతగా నిలిపిన హనుమ విహారి ఈసారి రాయలసీమ కింగ్స్‌ను టైటిల్ దిశగా నడిపించనున్నాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్లు గిరినాథ్, సాకేత్‌లను నిలబెట్టుకోగా మాధవ్, కలియప్పలను తీసుకుంది. అభిషేక్, వంశీకృష్ణ ఓపెనర్లుగా నిలదొక్కుకుంటే పొట్టి ఫార్మెట్లో పరుగుల వరదే. సుదర్శన్ కొత్త బంతితో ప్రత్యర్థికి చుక్కలు చూపించనున్నాడు. హరిశంకర్, పవన్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తరాంధ్ర లయన్స్ : ఫైనల్ పోరే లక్ష్యం తొలి సీజన్లో టాప్ 4లో నిలిచి ఎలిమినేటర్‌లోనే వెనుతిరిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఈ సారి ఫైనల్స్‌లో గర్జించేందుకు సిద్ధమైంది. స్థానికుడైన అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్ భరత్ మినహా మిగిలిన ఐదుగురిని తక్కువ ధరకే నిలబెట్టుకున్న ఫ్రాంచైజీ ఐదుగురు కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. వీళ్లందరినీ ఫ్రాంచైజీ అధినేత వెంకటరెడ్డి వేలం చివరి వరకు ఉండి మరీ సొంతం చేసుకున్నారు. వీరిలో పృథ్వీ భౌలింగ్ ప్రారంభించనుండగా టాప్ ఆర్డర్లో తపస్వి, రాహుల్ బ్యాట్ ఝళిపించనుండగా వాసు, శ్రీనివాస్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచనున్నారు. ఇక జట్టుకు ఓపెనర్‌గా గుల్ఫమ్, వికెట్ల వెనుక భరత్, టాప్‌లో శ్యామ్, బౌలర్‌గా అజయ్, బౌలింగ్ ఆల్‌రౌండర్ రఫీ, అండర్ 16లో రాణిస్తున్న రచిత్ ఉండనే ఉన్నారు. గోదావరి టైటాన్స్: మిడిలార్డర్‌తో బ్యాలెన్స్ గోదావరి టైటాన్స్ ఈ సారి ఓపెనర్లు, టాప్ ఆర్డర్‌ను పక్కా ప్రణాళికతో మ్యాచ్‌కు సిద్ధం చేసుకోగా మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దే ధీరజ్‌కుమార్‌కు జట్టును ముందుకు నడిపించే బాధ్యత అప్పగించింది. ఓపెనర్ హిమకర్, ఆల్‌రౌండర్లు శశికాంత్, సత్యనారాయణను జట్టు సొంతం చేసుకుంది. ఓపెనర్ వంశీతోపాటు టాప్ ఆర్డర్లో సాత్విక్, పాండురంగ, హేమంత్‌ను నిలబెట్టుకోగా మాధవ్ బౌలింగ్ చేయనున్నాడు. ►తలపడనున్న జట్లు : 6 ►మొత్తం మ్యాచ్‌లు : 19 ►టైటిల్ పోరు : 27న ►అన్ని మ్యాచ్‌లు ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
ఏపీఎల్ విజేతగా కోస్టల్ రైడర్స్..
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. బెజవాడ టైగర్స్ రన్నరప్‌గా నిలిచింది. వైఎస్సార్ స్టేడియంలో సోమవారంతో ముగిసిన టైటిల్ పోరులో టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రతిగా బ్యాటింగ్ చేసిన బెజవాడ టైగర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 7 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం సాధించింది. ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో నిర్వాహక కమిటీ ప్రతినిధులు విజేతలకు ట్రోఫీలందించారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ఆదివారమే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడి సోమవారం జరిగింది. విజేతలకు ట్రోఫీలందించేందకు క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ విశాఖ విచ్చేసినా సోమవారం తిరిగి పయనమయ్యారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర సైతం తిరుగుముఖం పట్టడంతో నిర్వాహక కమిటీ ప్రతినిధులు విజేతలకు ట్రోఫీలతోపాటు నగదు ప్రోత్సాహాకాలు అందించారు. రాణించిన కోస్టల్ రైడర్స్ బ్యాటర్లు ఫైనల్స్ టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రణీత్ (44), జ్ఞానేశ్వర్ (23) రాణించారు. తపస్వి (6) హర్ష (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో 94 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కీపర్ బ్యాటర్ లేఖజ్ (15), మనీష్(13) సైతం తక్కువ పరుగులే చేయగలిగలిగారు. ఈ క్రమంలో బరిలోకి దిగిన శ్రీనివాస్ 20 బంతుల్లో 40 పరుగులు చేశాడు. లలిత్, మనీష్ చెరో మూడు వికెట్లు తీశారు. బెజవాడ టైగర్స్ తడ‘బ్యాటు’ ప్రతిగా 177 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ ఏడు వికెట్లకు 169 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ మహీప్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోగష్ 30 పరుగులతో రాణించాడు. అవినాష్(23), కెప్టెన్ రికీబుయ్ (15) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో టాప్ ఆర్డర్ 77 పరుగులకే కుప్పకూలిపోయింది. సాయిరాహుల్ ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 16 పరుగులు చేసి 105 పరుగుల వద్ద వెనుతిరిగాడు. జగదీష్ (25), ప్రణీత్ (48) పోరాడిన గెలిపించలేకపోయారు. తపస్వి, మునీష్, అశిష్ రెండేసి వికెట్లు తీయగా హరిశంకర్ ఒక వికెట్ తీశాడు. లలిత్మోహన్కు పర్పుల్ క్యాప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శ్రీనివాస్, బెస్ట్ బౌలర్‌గా విశాఖ కుర్రాడు మనీష్ నిలవగా, బెస్ట్ బ్యాటర్‌గా ప్రణీత్ నిలిచాడు. పర్పుల్ క్యాప్‌ను లలిత్‌మోహన్, ఆరెంజ్ క్యాకాప్ను పి.అవినాష్ అందుకున్నారు. ప్రామిసింగ్ ప్లేయర్‌గా రషీద్, వేల్యూబుల్ ప్లేయర్‌గా గురునాథ్ నిలిచారు. స్కోరు వివరాలు కోస్టల్ రైడర్స్ ఇన్నింగ్స్ : సీఆర్ జ్ఞానేశ్వర్(సి) అఖిల్(బి)మనీష్ 23; ప్రణీత్(సి) మనీష్(బి)లలిత్ 44, హర్ష(సి) ఆశిష్ (బి) లలిత్ 13; తపస్వి (సి)అయ్యప్ప (బి) మనీష్ 6; లేఖజ్(సి)జోగేష్ (బి)లలిత్ 15; మునీష్(సి)రాహుల్(బి)మనీష్ 13; శ్రీనివాస్(రనౌట్ ప్రణీత్/అఖిల్)40; విజయ్(సి)జోగేష్(బి)అఖిల్ 1; హరిశంకర్(నాటౌట్)12; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 8వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–73, 2–75,3–92,4–96,5–119,6–126, 7–138, 8–176. బౌలింగ్: అయ్యప్ప 4–0–34–0, అఖిల్ 4–0–48–1, లలిత్ 4–0–31–3, సాయిరాహుల్ 2–0–19–0, రికీబుయ్ 2–0–25–0, జి.మనీష్ 4–0–18–3. బెజవాడ టైగర్స్ ఇన్నింగ్స్ మహీప్‌కుమార్ (బౌల్డ్) హరిశంకర్ 1; జోగేష్(సి) రవికిరణ్(బి)మునీష్ 30; అవినాష్(సి)హర్షవర్దన్ (బి) మునీష్ 23; రికీబుయ్(సి)(బి) ఆశిష్ 15; ప్రణీత్(సి)హర్ష(బి)తపస్వి 48; సాయిరాహుల్(సి)మునీష్ (బి)ఆశిష్ 16; జగదీష్(సి)శ్రీనివాస్(బి)తపస్వి 25; మనీష్ (నాటౌట్)5; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం(20 ఓవర్లలో 7 వికెట్లకు)169. వికెట్ల పతనం: 1–2, 2–35,3–60,4–77,5–105,6–163, 7–169. బౌలింగ్: స్టీఫెన్ 4–0–30–0, హారిశంకర్ 4–0–45–1,ఆశిష్ 4–0–18–2, మునీష్ 4–0–41–2, విజయ్ 3–0–20–0, తపస్వి 1–0–13–2. చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! -
ఏపీఎల్ తుది పోరు.. కోస్టల్ రైడర్స్‌తో బెజవాడ టైగర్స్ ఢీ
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ తొలి సీజన్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే పోరులో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఎవరు ఎగరేసుకు పోనున్నారో తేలిపోనుంది. టైటిల్ పోరులో రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.15 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకోనుంది. కాగా.. తొలి సీజన్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో మూడు మ్యాచ్‌లను కుదించి నిర్వహించారు. నాలుగు మ్యాచ్‌లను రద్దు చేశారు. టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ ఏపీఎల్ క్వాలిఫైయర్ రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెజవాడ టైగర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. వైఎస్సార్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లలిత్‌కు లెగ్‌బిఫోర్‌గా ప్రశాంత్(29) దొరికిపోగా.. మరో ఓపెనర్ అభిషేక్(41) మనీష్ బౌలింగ్‌లో షార్ట్ ఫైన్‌లెగ్‌లో సాయితేజకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్(16) లలిత్ బౌలింగ్‌లోనే డీప్ స్క్వేర్‌లెగ్‌లో అఖిల్‌కు క్యాచ్ ఇ చ్చాడు. కెప్టెన్ గిరినాథ్ 53 పరుగులు, రషీద్ 40 పరుగులతో నిలిచారు. 187 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ ఓపెనర్ మహీప్ ఒక్క పరుగే చేసి సంతోష్ బౌలింగ్‌లో డీప్ పాయింట్లో కార్తికేయకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అతని స్థానంలో వచ్చిన అవినాష్ ఒక పరుగుతో, మరో ఓపెనర్ ప్రణీత్ 24 పరుగులతో ఆడుతుండగా వర్షం వచ్చింది. నాలుగు ఓవర్లలో ఒక వికెట్‌కు 29 పరుగుల వద్ద మ్యాచ్ నిలిచిపోయింది. ఫలి తం తేలేందుకు కనీసం మరో ఓవర్ జరగాల్సి ఉండగా స్టేడియంలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. లీగ్ దశలో పాయింట్ల ఆధారంగా బెజవాడ టైగర్స్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఏపీఎల్ తొలి సీజన్ టైటిల్ పోరుకు బెజవాడ టైగర్స్ చేరుకుంది. ఆదివారం జరిగే తుది పోరులో కోస్టల్ రైడర్స్‌తో బెజవాడ టైగర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి ఆరున్నరకు ప్రారంభం కానుండగా విజేతకు ట్రోఫీ అందించేందుకు క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ రానున్నారు. ఈ నాకవుట్ మ్యాచ్‌ను ఉచితంగానే ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. చదవండి: Tamim Iqbal: టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్.. -
APL: ప్లేఆఫ్స్‌నకు రాయలసీమ కింగ్స్.. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ వివరాలు!
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ ప్లేఆఫ్‌కు రాయలసీమ కింగ్స్ చేరుకోగా.. వైజాగ్ వారియర్స్ ఇంటి ముఖం పట్టింది. ఏపీఎల్ ప్లేఆఫ్‌కు చేరుకోవడమే లక్ష్యంగా వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ జట్లు బుధవారం తలపడ్డాయి. వైఎస్ఆర్ స్టేడియంలో లీగ్ చివరి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్ వారియర్స్ ఓపెనర్ సాయికృష్ణ(3) గిరినాథ్ బౌలింగ్‌లో సాకేత్‌కు క్యాచ్ ఇవ్వగా.. కెప్టెన్ అశ్విన్(15 ఒక ఫోర్, ఒక సిక్స్‌తో) సాకేత్ బౌలింగ్‌లో ప్రశాంత్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్లు 29 పరుగుల వద్దే పెవిలియన్ బాట పట్టారు. కరణ్ రెండు ఫోర్లతో 21 పరుగుల వద్ద వినయ్‌కు బౌల్డ్ అయ్యాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేప్పటికి నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేశారు. నరేన్, దృవ్లు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నరేన్ 34 పరుగులతో బౌల్డయ్యాడు. తర్వాత బంతికే మనోహార్(0)బౌల్డ్ కాగా.. సిద్ధార్థ కూడా తర్వాత బంతికే క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో సంతోష్ హాట్రిక్ నమోదు చేశాడు. ఏపీఎల్‌లో సంతోష్ తొలి హాట్రిక్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. వెంటనే గిరినాథ్ బౌలింగ్‌లో దృవ్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. దృవ్(53), రామన్(3) అజేయంగా నిలవడంతో వైజాగ్ వారియర్స్ ఏడు వికెట్లకు 140 పరుగులు చేసింది. సంతోష్ మూడు, వినయ్ రెండు వికెట్లు తీయగా, గిరినాథ్, సాకేత్ చెరో వికెట్ తీశారు. 141 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ తరఫున ఏపీఎల్లోనే ప్రశాంత్ తొలి సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ అభిషేక్ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే కార్తీక్ వేసిన రెండో బంతికి వికెట్ల వెనుక దృవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ ప్రశాంత్‌తో రషీద్(14) స్కోర్‌ను 45 పరుగులకు చేర్చి రన్ అవుటయ్యాడు. వంశీకృష్ణ కూడా ఏడు పరుగులు చేసి వేణు బౌలింగ్‌లో ఆశ్విన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్ ఒక ఫోర్, సిక్స్‌తో 15 పరుగులతో నిలవగా.. ప్రశాంత్ 17.2 ఓవర్లో ఆంజనేయులు వేసిన బంతిని బౌండరీకి తరలించి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. మూడే వికెట్లు కోల్పోయి 146 పరుగులతో విజయం సాధించి రాయలసీమ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరింది. కార్తీక్, వేణు చెరో వికెట్ తీశారు. ప్రశాంత్ మ్యాచ్ బెస్ట్‌తో పాటు బ్యాటర్‌గా నిలవగా హ్యాట్రిక్ వీరుడు సంతోష్ బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ప్లేఆఫ్‌లు ఖరారు ఏపీఎల్ ప్లేఆఫ్‌కు రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ పన్నేండేసి పాయింట్లతో.. పది పాయింట్లుతో ఉత్తరాంధ్ర లయన్స్ చేరుకున్నాయి. వైజాగ్ వారియర్స్ ఎనిమిది పాయింట్లు, గోదావరి టైటాన్స్ ఆరు పాయింట్లే సాధించి లీగ్ దశలోనే ఇంటి దారి పట్టాయి. తొలి క్వాలిఫైయింగ్‌లో టైగర్స్‌తో రైడర్స్ ఏపీఎల్ ప్లేఆఫ్‌లో క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో బెజవాడ టైగర్స్‌తో కోస్టల్ రైడర్స్ తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌తో ఉత్తరాంధ్ర లయన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో పరాజయం చెందిన జట్టుతో ఆడనుంది. క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు అర్హత సాధించనుంది. చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Andhra Premier League 2022: ప్లేఆఫ్‌నకు కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ .. ఇప్పటికే -
APL 2022: ప్లేఆఫ్‌నకు కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్
విశాఖ స్పోర్ట్స్ : కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ ఏపీఎల్ తొలి సీజన్ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. లీగ్ చివరి మ్యాచ్‌లో ఆధిక్యానికి పోటీపడ్డ బెజవాడ టైగర్స్‌ను నిలువరించి కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరింది. ఇప్పటికే టైగర్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్లు 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్‌లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. మ్యాచ్ సాగిందిలా! వైఎస్సార్ స్టేడియంలో తొలుత టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ్ఞానేశ్వర్‌తో కలిసి తొలి వికెట్‌కు ఓపెనర్ మునీష్ 15 పరుగులు చేసి 23 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం బరిలో దిగిన హర్షవర్ధన్ కెప్టెన్ జ్ఙానేశ్వర్తో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. భారీస్కోర్ దిశగా సాగుతుండగా జ్ఙానేశ్వర్ (52).. రికీబుయ్ బౌలింగ్‌లో డీప్‌మిడ్ వికెట్లో అవినాష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కీపర్ బ్యాటర్ లేఖజ్తో కలిసి స్కోరును 168 పురుగులకు చేర్చారు. హర్షవర్ధన్ (63) పరుగులు చేసి సాయితేజ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో రెండు బంతుల అనంతరం లేఖజ్ (33)అయ్యప్పకు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు. శ్రీనివాస్ (10), తపస్వి(3) అజేయంగా నిలిచి స్కోర్‌ను నాలుగు వికెట్లకు 181 పరుగులకు చేర్చారు. అయ్యప్ప, సాయితేజ, లలిత్, రికీబుయ్ ఒకో వికెట్ తీశారు. తడబడిన టైగర్స్.. దీటుగానే ఆట ప్రారంభించిన బెజవాడ టైగర్స్ తొలి రెండు వికెట్లను కోల్పోయినా తొలి పదిఓవర్లు టాప్ ఆర్డర్ కొనసాగింది. 50 పరుగుల వద్ద ఓపెనర్ సుమంత్ (24), మరో ఓపెనర్ మహీప్ (28) త్వరగా ఔటయ్యారు. 11వ ఓవర్లో ఆశిష్ బౌలింగ్‌లో రెండు వరుస బంతుల్లో కెప్టెన్ రికీబుయ్ (6), మనీష్(0) పెవిలియన్‌కు చేరుకోవడంతో ఒక్కసారిగా ఆటపై కోస్టల్ రైడర్స్ పట్టు సాధించింది. అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న ప్రణీత్ సైతం (30)తపస్వి బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో వంద పరుగుల మార్కు చేరుకోకుండానే టైగర్స్ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో అవినాష్, జగదీష్ జోడి ఇన్నింగ్స్ సరిదిద్ది 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. జగదీష్ (27) విజయ్ బౌలింగ్‌లో జ్ఞానేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగ్గా...తొమ్మిది పరుగులు జోడించి రాహుల్ (9),అయ్యప్ప(0)పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో రెండు బంతుల్లో ఆట ముగిసే సమయానికి నిలకడగా ఆడుతున్న అవినాష్ (35) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరికి టైగర్స్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రైడర్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్షవర్ధన్ మ్యాచ్ బెస్ట్ బాటర్గానూ, ఆశీష్ బెస్ట్ బౌలర్‌గా నిలిచారు. రసవత్తర పోరులో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టైటాన్స్ ఓపెనర్ వంశీకృష్ణ ఒక్క పరుగు చేసి భరత్‌కు దొరికిపోయాడు. ఓపెనర్ హేమంత్‌తో కలిసి నితీష్ రెండో వికెట్‌కు 51పరుగులు జోడించారు. నితీష్ (35) షోయబ్‌కు క్లీన్‌బౌల్డ్ కాగా హేమంత్‌ను (39) 99 పరుగుల వద్ద కౌషిక్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. సందీప్ రెండు ఫోర్లతో 22 పరుగులు చేసి వర్మ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో క్రాంతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 34పరుగులు చేయడంతో టైటాన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. ప్రమోద్ మూడు, వర్మ రెండు వికెట్లు తీయగా అజయ్, షోయిబ్, కౌషిక్ ఒకో వికెట్ తీశారు. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్లు తొలి ఓవర్‌కే 15 పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ (10)ని నితీష్ తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండోఓవర్)నాలుగో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో శశికాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ స్థానంలో వచ్చిన గుల్ఫమ్ నాలుగు పరుగులే చేసి రనౌటై వెనుతిరిగాడు. ఈ దశలో ఓపెనర్, కెప్టెన్ భరత్‌కు ధీరజ్ లక్ష్మణ్ తోడై స్కోర్‌ను 50 పరుగులకు చేర్చారు. భరత్ (36).. ఇస్మాయిల్ వేసిన బంతికి ఎక్స్ట్రా కవర్లో నితీష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్, క్రాంతి జోడి నిలకడగా ఆడుతూ స్కోర్‌ను పరుగులెత్తించారు. థీరజ్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బరిలో దిగిన క్రాంతి (17) సైతం సందీప్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు 25పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దోబూచులాడింది. లోయర్ మిడిలార్డర్లో వర్మ 11 పరుగులు చేశాడు. షోయబ్ (6), రఫీ(11) అజేయంగా నిలిచి మరో ఐదు బంతులుండగానే ఏడు వికెట్లకు 150 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించారు. ఇస్మాయిల్ మూడు, సందీప్ రెండు, నితీష్ ఒక వికెట్ తీశారు. దీంతో మూడు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం సాధించింది. మ్యాచ్ బెస్ట్‌గా నితీష్‌కుమార్ నిలవగా బెస్ట్ బ్యాటర్‌గా ధీరజ్, బెస్ట్ బౌలర్‌గా ఇస్మాయిల్ నిలిచారు. చదవండి: Ind Vs Eng 1st ODI: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్ సొంతగడ్డపై చెత్త రికార్డు! Latest Womens ODI Rankings: టాప్ 10లో టీమిండియా వైస్ కెప్టెన్.. మెరుగైన కెప్టెన్ ర్యాంక్ -
APL 2022: ప్లే ఆఫ్స్‌నకు చేరిన తొలి జట్టుగా బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ టోర్నీ తొలి సీజన్ ప్లేఆఫ్‌కు బెజవాడ టైగర్స్ జట్టు చేరుకుంది. టోర్నీలో తలపడుతున్న ఆరుజట్లు నాలుగేసి మ్యాచ్‌లు పూర్తిచేయగా.. బెజవాడ టైగర్స్ జట్టు 12 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాయలసీమ కింగ్స్,కోస్టల్‌రైడర్స్, వైజాగ్ వారియర్స్ ఎనిమిదేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర లయిన్స్, గోదావరి టైటాన్స్ ఆరేసి పాయింట్లతో టోర్నిలో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా బెజవాడ టైగర్స్ ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించగా.. మిగిలిన మూడు జట్లు చివరి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి ప్లేఆఫ్‌కు అర్హత సాధించనున్నాయి. కాగా ఏపీఎల్‌లో మరోసారి వరుణుడి రాకతో సోమవారం జరగాల్సిన మధ్నాహ్నం మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగాల్సిన మ్యాచ్ తొమ్మిది ఓవర్లకు కుదించారు. వైఎస్ఆర్ స్టేడియంలో మధ్యాహ్నం రాయలసీమ కింగ్స్‌తో బెజవాడ టైగర్స్‌తో తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు రెండేసి పాయింట్లు కేటాయించారు. కాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు 4 పాయింట్లు లభిస్తాయి. ఫలితం తేలనట్లయితే రెండు పాయింట్లు వస్తాయి. ఐదు వికెట్ల తేడాతో రైడర్స్ విజయం ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్‌పై కోస్టల్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్ వారియర్స్ ఓపెనర్ గిరినాథ్ ఒక పరుగే చేసి వెనుదిరగ్గా మరో ఓపెనర్ అశ్విన్ 28 పరుగులు చేశాడు. ఓపెనర్లతో పాటు అర్జున్ సైతం ఆశిష్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. సాయికృష్ణ(13), సిద్ధార్థ(18) మినహా మిగిలిన వారంతా వేగంగా పరుగులు చేయడానికే ప్రయత్నించి సింగిల్ డిజిట్ స్కోర్ల్తోనే పెవిలియన్‌కు చేరారు. 34 పరుగుల వద్ద రెండో వికెట్ కూలగా.. చివరికి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 80 పరుగులతో వారియర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 81 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్లు తపస్వి, కెప్టెన్ జ్ఞానేశ్వర్ చెరో నాలుగేసి పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. మునీష్ 9 పరుగులు చేయగా లేఖజ్ తొలిబంతికే లేని పరుగుకు రనౌటయ్యాడు. 24పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో శ్రీనివాస్ (38 పరుగులు)కు హర్ష తోడై స్కోర్‌ను పరిగెత్తించారు. హర్ష రెండు ఫోర్లతో 16 పరుగులతోనూ, అబ్బాస్ ఒక ఫోర్‌తో ఆరు పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. మరో రెండు బంతులుండగానే రైడర్స్ విజయలక్ష్యాన్ని ఛేదించారు. చదవండి: Ind Vs Eng 1st ODI Details: ముఖాముఖి రికార్డులు, తుది జట్ల అంచనా.. పూర్తి వివరాలు! ఇక టాస్ గెలిచిన జట్టు తొలుత.. Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! -
APL 2022: తడబడిన టైటాన్స్.. గర్జించిన బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెంట్రల్ ఆంధ్ర ఫ్రాంచైజీ జట్లు బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. టైటాన్స్ కెప్టెన్ శశికాంత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ వంశీకృష్ణ(10)ను 25 పరుగుల వద్ద అయ్యప్ప క్లీన్‌బౌల్డ్ చేశాడు. 5.5ఓవర్లలో 50పరుగుల మార్కు దాటిన అనంతరం మరో ఓపెనర్ హేమంత్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో అయ్యప్పకు క్యాచ్ఇచ్చి వెనుతిరిగాడు. చివరికి 18.5 ఓవర్లలోనే 119 పరుగులు స్కోర్‌కే టైటాన్స్ ఆలౌటైంది. కెప్టెన్ శశికాంత్ ఒకఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేయగా నితీష్ 15, సందీప్ 22, ధీరజ్ 10 పరుగులు చేయగలిగారు. అయ్యప్ప ,లలిత్‌మోహన్ మూడేసి వికెట్లు తీయగా సాయిరాహుల్ రెండు, మనీష్, రికీబుయ్ చెరో వికెట్ తీశారు. 120 పరుగుల లక్ష్యంతో... 120 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన బెజవాడ టైగర్స్ జట్టు ఓపెనర్ మహీప్ మూడు ఫోర్లతో 20 పరుగులు చేసి 4.4 ఓవర్ల వద్ద వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సుమంత్‌కు వన్‌డౌన్‌లో విశాఖకు చెందిన అవినాష్ తోడై స్కోర్‌ను రెండో వికెట్‌కు 84 పరుగులకు చేర్చారు. అవినాష్ రెండు ఫోర్లు,నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి వాసు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ రికీబుయ్ (ఒక ఫోర్, మూడు సిక్సర్స్‌తో)13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. 17.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి బెజవాడ టైగర్స్ విజయాన్ని అందుకుంది. నితీష్ వేసిన బంతిని స్ట్రయిట్‌గా లాంగ్ఆన్ మీదుగా గాల్లో బౌండరీకి తరలిం సుమంత్ (మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు) జట్టుకు విజయాన్ని అందించాడు. లలిత్ ప్లేయర్ ఆఫ్ ది వ్యచ్గా నిలవగా... బెస్ట్ బ్యాటర్‌గా అవినాష్, బెస్ట్ బౌలర్‌గా వాసు నిలిచారు. ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్ ఏపీఎల్‌లో ఐదో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్ మూడు మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్ వారియర్స్ మూడు మ్యాచ్‌లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్‌లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్ రైడర్స్ 4 పాయింట్లు సాధించింది. చదవండి: APL 2022: వైజాగ్ వారియర్స్ పరుగుల వరద.. రెండో విజయం! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్...