విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ తొలి సీజన్‌లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. బెజవాడ టైగర్స్ రన్నరప్‌గా నిలిచింది. వైఎస్సార్ స్టేడియంలో సోమవారంతో ముగిసిన టైటిల్ పోరులో టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రతిగా బ్యాటింగ్ చేసిన బెజవాడ టైగర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 7 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం సాధించింది.
ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో నిర్వాహక కమిటీ ప్రతినిధులు విజేతలకు ట్రోఫీలందించారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ఆదివారమే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడి సోమవారం జరిగింది. విజేతలకు ట్రోఫీలందించేందకు క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ విశాఖ విచ్చేసినా సోమవారం తిరిగి పయనమయ్యారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్ర సైతం తిరుగుముఖం పట్టడంతో నిర్వాహక కమిటీ ప్రతినిధులు విజేతలకు ట్రోఫీలతోపాటు నగదు ప్రోత్సాహాకాలు అందించారు.
రాణించిన కోస్టల్ రైడర్స్ బ్యాటర్లు
ఫైనల్స్ టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రణీత్ (44), జ్ఞానేశ్వర్ (23) రాణించారు. తపస్వి (6) హర్ష (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో 94 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కీపర్ బ్యాటర్ లేఖజ్ (15), మనీష్(13) సైతం తక్కువ పరుగులే చేయగలిగలిగారు. ఈ క్రమంలో బరిలోకి దిగిన శ్రీనివాస్ 20 బంతుల్లో 40 పరుగులు చేశాడు. లలిత్, మనీష్ చెరో మూడు వికెట్లు తీశారు.
బెజవాడ టైగర్స్ తడ‘బ్యాటు’
ప్రతిగా 177 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ ఏడు వికెట్లకు 169 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ మహీప్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోగష్ 30 పరుగులతో రాణించాడు. అవినాష్(23), కెప్టెన్ రికీబుయ్ (15) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో టాప్ ఆర్డర్ 77 పరుగులకే కుప్పకూలిపోయింది. సాయిరాహుల్ ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 16 పరుగులు చేసి 105 పరుగుల వద్ద వెనుతిరిగాడు. జగదీష్ (25), ప్రణీత్ (48) పోరాడిన గెలిపించలేకపోయారు. తపస్వి, మునీష్, అశిష్ రెండేసి వికెట్లు తీయగా హరిశంకర్ ఒక వికెట్ తీశాడు.
లలిత్‌మోహన్‌కు పర్పుల్ క్యాప్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శ్రీనివాస్, బెస్ట్ బౌలర్‌గా విశాఖ కుర్రాడు మనీష్ నిలవగా, బెస్ట్ బ్యాటర్‌గా ప్రణీత్ నిలిచాడు. పర్పుల్ క్యాప్‌ను లలిత్‌మోహన్, ఆరెంజ్ క్యాకాప్‌ను పి.అవినాష్ అందుకున్నారు. ప్రామిసింగ్ ప్లేయర్‌గా రషీద్, వేల్యూబుల్ ప్లేయర్‌గా గురునాథ్ నిలిచారు.
స్కోరు వివరాలు
కోస్టల్ రైడర్స్ ఇన్నింగ్స్ : సీఆర్ జ్ఞానేశ్వర్(సి) అఖిల్(బి)మనీష్ 23; ప్రణీత్(సి) మనీష్(బి)లలిత్ 44, హర్ష(సి) ఆశిష్ (బి) లలిత్ 13; తపస్వి (సి)అయ్యప్ప (బి) మనీష్ 6; లేఖజ్(సి)జోగేష్ (బి)లలిత్ 15; మునీష్(సి)రాహుల్(బి)మనీష్ 13; శ్రీనివాస్(రనౌట్ ప్రణీత్/అఖిల్)40; విజయ్(సి)జోగేష్(బి)అఖిల్ 1; హరిశంకర్(నాటౌట్)12;
ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 8వికెట్లకు) 176.
వికెట్ల పతనం:
1–73, 2–75,3–92,4–96,5–119,6–126, 7–138, 8–176.
బౌలింగ్: అయ్యప్ప 4–0–34–0, అఖిల్ 4–0–48–1, లలిత్ 4–0–31–3, సాయిరాహుల్ 2–0–19–0, రికీబుయ్ 2–0–25–0, జి.మనీష్ 4–0–18–3.
బెజవాడ టైగర్స్ ఇన్నింగ్స్
మహీప్‌కుమార్ (బౌల్డ్) హరిశంకర్ 1; జోగేష్(సి) రవికిరణ్(బి)మునీష్ 30; అవినాష్(సి)హర్షవర్దన్ (బి) మునీష్ 23; రికీబుయ్(సి)(బి) ఆశిష్ 15; ప్రణీత్(సి)హర్ష(బి)తపస్వి 48; సాయిరాహుల్(సి)మునీష్ (బి)ఆశిష్ 16; జగదీష్(సి)శ్రీనివాస్(బి)తపస్వి 25; మనీష్ (నాటౌట్)5;
ఎక్స్‌ట్రాలు 6, మొత్తం(20 ఓవర్లలో 7 వికెట్లకు)169.
వికెట్ల పతనం: 1–2, 2–35,3–60,4–77,5–105,6–163, 7–169.
బౌలింగ్: స్టీఫెన్ 4–0–30–0, హారిశంకర్ 4–0–45–1,ఆశిష్ 4–0–18–2, మునీష్ 4–0–41–2, విజయ్ 3–0–20–0, తపస్వి 1–0–13–2.
చదవండి: IND vs WI: టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..!
Comments
Please login to add a commentAdd a comment