విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ ప్లేఆఫ్‌కు రాయలసీమ కింగ్స్ చేరుకోగా.. వైజాగ్ వారియర్స్ ఇంటి ముఖం పట్టింది. ఏపీఎల్ ప్లేఆఫ్‌కు చేరుకోవడమే లక్ష్యంగా వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ జట్లు బుధవారం తలపడ్డాయి. వైఎస్‌ఆర్ స్టేడియంలో లీగ్ చివరి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్ వారియర్స్ ఓపెనర్ సాయికృష్ణ(3) గిరినాథ్ బౌలింగ్‌లో సాకేత్‌కు క్యాచ్ ఇవ్వగా.. కెప్టెన్ అశ్విన్(15 ఒక ఫోర్, ఒక సిక్స్‌తో) సాకేత్ బౌలింగ్‌లో ప్రశాంత్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్లు 29 పరుగుల వద్దే పెవిలియన్ బాట పట్టారు. కరణ్ రెండు ఫోర్లతో 21 పరుగుల వద్ద వినయ్‌కు బౌల్డ్ అయ్యాడు.
దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేప్పటికి నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేశారు. నరేన్, దృవ్‌లు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నరేన్ 34 పరుగులతో బౌల్డయ్యాడు. తర్వాత బంతికే మనోహార్(0)బౌల్డ్ కాగా.. సిద్ధార్థ కూడా తర్వాత బంతికే క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో సంతోష్ హాట్రిక్ నమోదు చేశాడు. ఏపీఎల్‌లో సంతోష్ తొలి హాట్రిక్ చేసిన బౌలర్‌గా నిలిచాడు.
వెంటనే గిరినాథ్ బౌలింగ్‌లో దృవ్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. దృవ్(53), రామన్(3) అజేయంగా నిలవడంతో వైజాగ్ వారియర్స్ ఏడు వికెట్లకు 140 పరుగులు చేసింది. సంతోష్ మూడు, వినయ్ రెండు వికెట్లు తీయగా, గిరినాథ్, సాకేత్ చెరో వికెట్ తీశారు.
141 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ తరఫున ఏపీఎల్‌లోనే ప్రశాంత్ తొలి సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ అభిషేక్ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే కార్తీక్ వేసిన రెండో బంతికి వికెట్ల వెనుక దృవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ ప్రశాంత్‌తో రషీద్(14) స్కోర్‌ను 45 పరుగులకు చేర్చి రన్ అవుటయ్యాడు.
వంశీకృష్ణ కూడా ఏడు పరుగులు చేసి వేణు బౌలింగ్‌లో ఆశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వినయ్ ఒక ఫోర్, సిక్స్‌తో 15 పరుగులతో నిలవగా.. ప్రశాంత్ 17.2 ఓవర్‌లో ఆంజనేయులు వేసిన బంతిని బౌండరీకి తరలించి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. మూడే వికెట్లు కోల్పోయి 146 పరుగులతో విజయం సాధించి రాయలసీమ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరింది. కార్తీక్, వేణు చెరో వికెట్ తీశారు. ప్రశాంత్ మ్యాచ్ బెస్ట్‌తో పాటు బ్యాటర్‌గా నిలవగా హ్యాట్రిక్ వీరుడు సంతోష్ బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
ప్లేఆఫ్‌లు ఖరారు
ఏపీఎల్ ప్లేఆఫ్‌కు రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ పన్నేండేసి పాయింట్లతో.. పది పాయింట్లుతో ఉత్తరాంధ్ర లయన్స్ చేరుకున్నాయి. వైజాగ్ వారియర్స్ ఎనిమిది పాయింట్లు, గోదావరి టైటాన్స్ ఆరు పాయింట్లే సాధించి లీగ్ దశలోనే ఇంటి దారి పట్టాయి.
తొలి క్వాలిఫైయింగ్‌లో టైగర్స్‌తో రైడర్స్
ఏపీఎల్ ప్లేఆఫ్‌లో క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో బెజవాడ టైగర్స్‌తో కోస్టల్ రైడర్స్ తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌తో ఉత్తరాంధ్ర లయన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో పరాజయం చెందిన జట్టుతో ఆడనుంది. క్వాలిఫైయింగ్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు అర్హత సాధించనుంది.
చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
Andhra Premier League 2022: ప్లేఆఫ్‌నకు కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ .. ఇప్పటికే
Comments
Please login to add a commentAdd a comment