
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో రాయలసీమ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కింగ్స్ 3 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై విజయం సాధించింది. ముందుగా రాయలసీమ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోగటం రెడ్డి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, గిరినాథ్ రెడ్డి (20 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), వంశీ కృష్ణ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. అనంతరం గోదావరి టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులు చేసి పోరాడి ఓడింది.
భూపతి రాజు వర్మ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించే ప్రయత్నం చేయగా, ఇతర ఆటగాళ్లనుంచి సహకారం లభించలేదు. నేడు జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్‌తో రాయలసీమ కింగ్స్ తలపడుతుంది. ముగింపు కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మాజీ కెపె్టన్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
చదవండి: మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం
Comments
Please login to add a commentAdd a comment