విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక కోస్టల్ రైడర్స్ జట్టు 16 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ 8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఉత్తరాంధ్ర లయన్స్‌కు రెండో స్థానం, రాయలసీమ కింగ్స్‌కు మూడో స్థానం, బెజవాడ టైగర్స్‌కు నాలుగో స్థానం లభించాయి. కోస్టల్ రైడర్స్‌తోపాటు ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌తో బెజవాడ టైగర్స్ ... క్వాలిఫయర్–1లో ఉత్తరాంధ్ర లయన్స్‌తో కోస్టల్ రైడర్స్ ఆడతాయి.
రాయలసీమ కింగ్స్‌తో చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు వీజేడీ పద్ధతిలో 8 వికెట్లతో గెలిచింది. ముందుగా రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. హనీష్ రెడ్డి (78; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. వర్షం తగ్గాక కోస్టల్ రైడర్స్ జట్టుకు 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. కోస్టల్ జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. ప్రణీత్ (64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), చిరంజీవి (32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడారు. మరో మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ ఏడు వికెట్లతో గోదావరి టైటాన్స్‌ను ఓడించింది.
చదవండి: ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్
Comments
Please login to add a commentAdd a comment