విశాఖలో బీచ్‌లలో పెరిగిన సందర్శకులు
ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో భారీగా పెరిగిన పర్యాటకులు
సీఎం జగన్ బ్రాండ్ ఇమేజ్‌తో అంతర్జాతీయ స్థాయి హోటళ్ల రాక
జీఐఎస్‌లో రూ.18 వేల కోట్లకుపైగా ఒప్పందాలు.. పలు ప్రాంతాల్లో 7, 5, 3 నక్షత్రాల హోటళ్లు, విల్లాలు, రిసార్టుల నిర్మాణం
సాక్షి అమరావతి : అందమైన తీర ప్రాంతం.. అపార పర్యాటక వనరులు.. తూర్పు కనుమల్లోని వైవిధ్యం.. విదేశాలను తలపించే హిల్ స్టేషన్లు.. కృష్ణా, గోదావరి అందాలు.. రాష్ట్ర పర్యాటకానికి మణిహారంగా నిలుస్తున్నాయి. దేశంలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ప్రధానంగా విశాఖలో బీచ్‌లకు, అరకు వ్యాలీకి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పర్యాటక రంగంలో 117 ఒప్పందాల ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు రూ.3049.90 కోట్ల సివిల్ వర్క్స్ ప్రారంభం అయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కలి్పంచేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద (ఓఅండ్‌ఎం) 87 ప్రాజెక్టులు పట్టాలెక్కాయి.
రాష్ట్ర పర్యాటక సిగలో ఎన్నెన్నో..
⇒ రూ.544 కోట్లతో రాజమహేంద్రవరంలోని గోదావరిపై ఉన్న పురాతన హేవ్‌లాక్ (రైల్వే) బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం. తునికి సమీపంలోని చిన్న శంకర్లపూడిలో 18 గోల్ఫ్ కోర్సులు, టూరిజం కాంప్లెక్సులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, వెల్‌నెస్ సెంటర్, బయోడైవర్సిటీ థీమ్ ప్రాజెక్టు.
⇒ విశాఖపటా్నన్ని టూరిజం డెస్టినీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భోగాపురంలో రూ.750 కోట్లతో 300 ఎకరాల్లో రేసింగ్ ట్రాక్, గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో రూ.243 కోట్లతో 10 ఎకరాల్లో ఐ ఆఫ్ వైజాగ్ (మెగా వీల్), రూ.100 కోట్లతో 5 ఎకరాల్లో స్కై టవర్, రూ.25 కోట్లతో స్నో వరల్డ్‌కు డీపీఆర్ సిద్ధమైంది. కోస్టల్ జోన్ టూరిజంలో భాగంగా 288 బీచ్‌లను గుర్తించి అత్యాధునిక వసతులు కలి్పస్తున్నారు.
⇒ ఆంధ్రా ఊటీగా పేరొందినæ అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా రూ.150 కోట్లతో తీర్చిదిద్దనున్నారు.
⇒ రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచి్చంది.
⇒పెనుకొండలో ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో స్పిరుచ్యువల్ కేంద్రం, అరకు, పేరూరు, కాకినాడలో 5 స్టార్ హోటల్, కాకినాడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి.. పలు ప్రాంతాల్లో శిల్పారామాలు, విశాఖ లో టన్నెల్ ఆక్వేరియం హోటల్, పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌లు ఏర్పాటు కానున్నాయి. అన్న వరం ప్రాంతంలో మేఫెయిర్ సంస్థ (భువనేశ్వర్) లగ్జరీ రిసార్ట్‌ను అభివృద్ధి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment