విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్‌లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ 35 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్ ప్రణీత్ 15 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్‌లో ఇస్మాయిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రైడర్స్ కెప్టెన్ రషీద్ 7 పరుగులే చేసినా ఓపెనర్ ధరణీకుమార్(32 బంతుల్లో 59, 8x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. హర్షవర్ధన్ (నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 22 బంతుల్లో 35)తో కలిసి లేఖజ్ రెడ్డి(12) ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రైడర్స్.. మరో 63 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది వికెట్లకు 173 పరుగులు చేసింది. సత్యనారాయణ రాజు, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా మాధవ్ రెండు, విజయ్ ఒక వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనకు దిగిన గోదావరి టైటాన్స్ ఓపెనర్లు వంశీకృష్ణ(4) 10 పరుగుల వద్ద, కెప్టెన్ జానేశ్వర్ (14) 28 పరుగుల వద్ద వెనుదిరిగారు. హేమంత్‌రెడ్డి ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ధీరజ్‌కుమార్(10), పాండురంగరాజు(14) వికెట్లను 94 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది.
ఇస్మాయిల్ ఎనిమిది బంతుల్లో 19 పరుగులతో చివర్లో కాస్త మెరుపులు మెరిపించినా 18.1 ఓవర్లలోనే 138 పరుగులకు గోదావరి టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అబ్దుల్లా మూడు, సుదర్శన్, చిరంజీవి, స్టీఫెన్ రెండేసి వికెట్లు తీశారు. ఆశిష్ ఓ వికెట్ పడగొట్టాడు.
చదవండి: అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్
Comments
Please login to add a commentAdd a comment