Godavari Titans
-
APL 2023: మ్యాచ్ రద్దు.. ఫైనల్ చేరుకున్న కోస్టల్ రైడర్స్.. ఇక..
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్–1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్ చేరింది. రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్ మధ్య నేడు జరిగే క్వాలిఫయర్–2లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్ జట్టుతో ఆడుతుంది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ ఏడు వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్‌పై నెగ్గింది. లయన్స్‌ను వేటాడిన టైటాన్స్ APL 2023 Godavari Titans Beat Uttarandhra Lions By 7 Wickets: ఏపీఎల్ సీజన్–2 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లయన్స్‌ను టైటాన్స్ వేటాడేసింది. లీగ్ పాయింట్ల పట్టికలో రన్రైట్లో వెనుకబడ్డా... హెడ్ఆన్స్లో విజయంతో ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించిన గోదావరి టైటాన్స్ విజయమే లక్ష్యం అన్నంతగా రెచ్చిపోయింది. ఉత్తరాంధ్ర లయన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫైయర్స్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. మిడిలార్డర్ తడబాటు టాస్ గెలిచిన గోదావరి టైటాన్స్.. ఉత్తరాంధ్ర లయన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ గుల్ఫమ్(49) విజయ్ బౌలింగ్‌లో సందీప్‌కు క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీని కోల్పోయాడు. మరో ఓపెనర్ కెప్టెన్ భరత్(37) విజయ్ బౌలింగ్‌లోనే మాధవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వీరి జోడి తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే శ్యామ్(2), రాహుల్ డకౌట్, తపస్వి(2) విజయ్(8)తో వెనువెంటనే ఔట్ అవ్వడంతో 11 ఓవర్లకు 108 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రీనివాస్(12), తేజస్వి(12), రఫీ(17) ఇన్నింగ్స్ కాస్త సరిదిద్దే ప్రయత్నం చేసినా మరో బంతి మిగిలి ఉండగానే 153 పరుగులకు ఆలౌటైంది. శశికాంత్, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా విజయ్ రెండు, కమిల్ ఓ వికెట్ పడగొట్టాడు. జ్ఞానేశ్వర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రతిగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ ఓపెనర్ మునీష్ డకౌట్ గానే అజయ్‌కుమార్ బౌలింగ్‌లో వాసుకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఓపెనర్ కెప్టెన్ జ్ఞానేశ్వర్‌కు హేమంత్ రెడ్డి తోడై స్కోర్‌ను పరుగులెత్తించారు. రెండో వికెట్‌కు వంద పరుగులను జోడించారు. 124 పరుగుల వద్ద హేమంత్ 71(ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులతో తపస్వి బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో వచ్చిన ధీరజ్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేసి 25 పరుగులకు సరిగ్గా 153 పరుగుల వద్ద ఔటయ్యాడు. తపస్వి ఓవర్లో చివరి బంతిని సందీప్ ఎదుర్కొని లాంగాన్ మీదుగా సిక్సర్‌గా తరలించాడు. దీంతో 18 ఓవర్లలో మూడు వికెట్లకు 159 పరుగులు చేసి టైటాన్స్ గెలిచింది. కెప్టెన్ జ్ఞానేశ్వర్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 సాధించి అజేయంగా నిలిచాడు. తపస్వి రెండు, అజయ్‌కుమార్ ఓ వికెట్ తీశారు. చదవండి: BCCI: ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.4.20 కోట్లు! -
APL 2023: ధరణీకుమార్ మెరుపులు.. గోదావరి టైటాన్స్‌కు తప్పని ఓటమి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ 35 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్ ప్రణీత్ 15 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్‌లో ఇస్మాయిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రైడర్స్ కెప్టెన్ రషీద్ 7 పరుగులే చేసినా ఓపెనర్ ధరణీకుమార్(32 బంతుల్లో 59, 8x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. హర్షవర్ధన్ (నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 22 బంతుల్లో 35)తో కలిసి లేఖజ్ రెడ్డి(12) ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రైడర్స్.. మరో 63 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది వికెట్లకు 173 పరుగులు చేసింది. సత్యనారాయణ రాజు, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా మాధవ్ రెండు, విజయ్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన గోదావరి టైటాన్స్ ఓపెనర్లు వంశీకృష్ణ(4) 10 పరుగుల వద్ద, కెప్టెన్ జానేశ్వర్ (14) 28 పరుగుల వద్ద వెనుదిరిగారు. హేమంత్‌రెడ్డి ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ధీరజ్‌కుమార్(10), పాండురంగరాజు(14) వికెట్లను 94 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. ఇస్మాయిల్ ఎనిమిది బంతుల్లో 19 పరుగులతో చివర్లో కాస్త మెరుపులు మెరిపించినా 18.1 ఓవర్లలోనే 138 పరుగులకు గోదావరి టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అబ్దుల్లా మూడు, సుదర్శన్, చిరంజీవి, స్టీఫెన్ రెండేసి వికెట్లు తీశారు. ఆశిష్ ఓ వికెట్ పడగొట్టాడు. చదవండి: అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్ -
CR vs GT Photos: కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్ మ్యాచ్ (ఫొటోలు)
-
APL: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో అదృష్టం మీదైతే!
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్‌కు వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఈ క్రికెట్ ఈవెంట్‌కు బుధవారం తెరలేవనుంది. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో రోజూ రెండు చొప్పున 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. టైటిల్ పోరు ఈ నెల 27న జరగనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. తొలిసీజన్ టైటిల్ పోరులో ఢీకొట్టిన బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ ఈసారి లీగ్ ప్రారంభ మ్యాచ్‌లోనే తలపడనుండడంతో ఏపీఎల్ – 2 ఆది నుంచే హోరాహోరీగా సాగనుంది. మ్యాచ్‌లు వీక్షించే అభిమానులకు లక్కీడిప్ ద్వారా విశాఖ వేదికగా త్వరలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టికెట్లు అందించనున్నారు. సినీనటి శ్రీలీల తొలిరోజు మ్యాచ్ వీక్షించేందుకు రానున్నారు. బెజవాడ టైగర్స్: వికెట్ల వెనుక నుంచే... టైటిల్ పోరులో ఢీకొట్టి కేవలం ఏడు పరుగుల తేడాతో వెనుకబడిపోయిన బెజవాడ టైగర్స్ ఈసారి వికెట్ల వెనుక నుంచే మ్యాచ్‌ను ముందుకు నడిపించే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామంటూ ఫ్రాంచైజీ అధినేత రమణమూర్తి అంటున్నారు. అందులో భాగంగానే ఈ సీజన్లో అత్యధిక ధరతో రికీబుయ్‌ను నిలబెట్టుకుంది. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న రికీ మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దడమే గాక జట్టును ముందుకు నడపనున్నాడు. మహీప్ వికెట్ల వెనుక సత్తా చాటనుండగా అవసరమైతే నేనున్నా అంటున్నాడు మహిమా. ఆల్‌రౌండర్లు షోయిబ్, సాయురాహుల్తోపాటు లలిత్, అవినాష్లుండగా సాయితేజ బంతితో చెలరేగనున్నాడు. రాయలసీమ కింగ్స్ : టాప్ ఆర్డర్ పటిష్టం సౌత్జోన్నే విజేతగా నిలిపిన హనుమ విహారి ఈసారి రాయలసీమ కింగ్స్‌ను టైటిల్ దిశగా నడిపించనున్నాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్లు గిరినాథ్, సాకేత్‌లను నిలబెట్టుకోగా మాధవ్, కలియప్పలను తీసుకుంది. అభిషేక్, వంశీకృష్ణ ఓపెనర్లుగా నిలదొక్కుకుంటే పొట్టి ఫార్మెట్లో పరుగుల వరదే. సుదర్శన్ కొత్త బంతితో ప్రత్యర్థికి చుక్కలు చూపించనున్నాడు. హరిశంకర్, పవన్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తరాంధ్ర లయన్స్ : ఫైనల్ పోరే లక్ష్యం తొలి సీజన్లో టాప్ 4లో నిలిచి ఎలిమినేటర్‌లోనే వెనుతిరిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఈ సారి ఫైనల్స్‌లో గర్జించేందుకు సిద్ధమైంది. స్థానికుడైన అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్ భరత్ మినహా మిగిలిన ఐదుగురిని తక్కువ ధరకే నిలబెట్టుకున్న ఫ్రాంచైజీ ఐదుగురు కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. వీళ్లందరినీ ఫ్రాంచైజీ అధినేత వెంకటరెడ్డి వేలం చివరి వరకు ఉండి మరీ సొంతం చేసుకున్నారు. వీరిలో పృథ్వీ భౌలింగ్ ప్రారంభించనుండగా టాప్ ఆర్డర్లో తపస్వి, రాహుల్ బ్యాట్ ఝళిపించనుండగా వాసు, శ్రీనివాస్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచనున్నారు. ఇక జట్టుకు ఓపెనర్‌గా గుల్ఫమ్, వికెట్ల వెనుక భరత్, టాప్‌లో శ్యామ్, బౌలర్‌గా అజయ్, బౌలింగ్ ఆల్‌రౌండర్ రఫీ, అండర్ 16లో రాణిస్తున్న రచిత్ ఉండనే ఉన్నారు. గోదావరి టైటాన్స్: మిడిలార్డర్‌తో బ్యాలెన్స్ గోదావరి టైటాన్స్ ఈ సారి ఓపెనర్లు, టాప్ ఆర్డర్‌ను పక్కా ప్రణాళికతో మ్యాచ్‌కు సిద్ధం చేసుకోగా మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దే ధీరజ్‌కుమార్‌కు జట్టును ముందుకు నడిపించే బాధ్యత అప్పగించింది. ఓపెనర్ హిమకర్, ఆల్‌రౌండర్లు శశికాంత్, సత్యనారాయణను జట్టు సొంతం చేసుకుంది. ఓపెనర్ వంశీతోపాటు టాప్ ఆర్డర్లో సాత్విక్, పాండురంగ, హేమంత్‌ను నిలబెట్టుకోగా మాధవ్ బౌలింగ్ చేయనున్నాడు. ►తలపడనున్న జట్లు : 6 ►మొత్తం మ్యాచ్‌లు : 19 ►టైటిల్ పోరు : 27న ►అన్ని మ్యాచ్‌లు ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
APL 2022: ప్లేఆఫ్‌నకు కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్
విశాఖ స్పోర్ట్స్ : కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ ఏపీఎల్ తొలి సీజన్ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. లీగ్ చివరి మ్యాచ్‌లో ఆధిక్యానికి పోటీపడ్డ బెజవాడ టైగర్స్‌ను నిలువరించి కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరింది. ఇప్పటికే టైగర్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్లు 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్‌లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. మ్యాచ్ సాగిందిలా! వైఎస్సార్ స్టేడియంలో తొలుత టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ్ఞానేశ్వర్‌తో కలిసి తొలి వికెట్‌కు ఓపెనర్ మునీష్ 15 పరుగులు చేసి 23 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం బరిలో దిగిన హర్షవర్ధన్ కెప్టెన్ జ్ఙానేశ్వర్తో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. భారీస్కోర్ దిశగా సాగుతుండగా జ్ఙానేశ్వర్ (52).. రికీబుయ్ బౌలింగ్‌లో డీప్‌మిడ్ వికెట్లో అవినాష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కీపర్ బ్యాటర్ లేఖజ్తో కలిసి స్కోరును 168 పురుగులకు చేర్చారు. హర్షవర్ధన్ (63) పరుగులు చేసి సాయితేజ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో రెండు బంతుల అనంతరం లేఖజ్ (33)అయ్యప్పకు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు. శ్రీనివాస్ (10), తపస్వి(3) అజేయంగా నిలిచి స్కోర్‌ను నాలుగు వికెట్లకు 181 పరుగులకు చేర్చారు. అయ్యప్ప, సాయితేజ, లలిత్, రికీబుయ్ ఒకో వికెట్ తీశారు. తడబడిన టైగర్స్.. దీటుగానే ఆట ప్రారంభించిన బెజవాడ టైగర్స్ తొలి రెండు వికెట్లను కోల్పోయినా తొలి పదిఓవర్లు టాప్ ఆర్డర్ కొనసాగింది. 50 పరుగుల వద్ద ఓపెనర్ సుమంత్ (24), మరో ఓపెనర్ మహీప్ (28) త్వరగా ఔటయ్యారు. 11వ ఓవర్లో ఆశిష్ బౌలింగ్‌లో రెండు వరుస బంతుల్లో కెప్టెన్ రికీబుయ్ (6), మనీష్(0) పెవిలియన్‌కు చేరుకోవడంతో ఒక్కసారిగా ఆటపై కోస్టల్ రైడర్స్ పట్టు సాధించింది. అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న ప్రణీత్ సైతం (30)తపస్వి బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో వంద పరుగుల మార్కు చేరుకోకుండానే టైగర్స్ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో అవినాష్, జగదీష్ జోడి ఇన్నింగ్స్ సరిదిద్ది 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. జగదీష్ (27) విజయ్ బౌలింగ్‌లో జ్ఞానేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగ్గా...తొమ్మిది పరుగులు జోడించి రాహుల్ (9),అయ్యప్ప(0)పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో రెండు బంతుల్లో ఆట ముగిసే సమయానికి నిలకడగా ఆడుతున్న అవినాష్ (35) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరికి టైగర్స్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రైడర్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్షవర్ధన్ మ్యాచ్ బెస్ట్ బాటర్గానూ, ఆశీష్ బెస్ట్ బౌలర్‌గా నిలిచారు. రసవత్తర పోరులో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టైటాన్స్ ఓపెనర్ వంశీకృష్ణ ఒక్క పరుగు చేసి భరత్‌కు దొరికిపోయాడు. ఓపెనర్ హేమంత్‌తో కలిసి నితీష్ రెండో వికెట్‌కు 51పరుగులు జోడించారు. నితీష్ (35) షోయబ్‌కు క్లీన్‌బౌల్డ్ కాగా హేమంత్‌ను (39) 99 పరుగుల వద్ద కౌషిక్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. సందీప్ రెండు ఫోర్లతో 22 పరుగులు చేసి వర్మ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో క్రాంతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 34పరుగులు చేయడంతో టైటాన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. ప్రమోద్ మూడు, వర్మ రెండు వికెట్లు తీయగా అజయ్, షోయిబ్, కౌషిక్ ఒకో వికెట్ తీశారు. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్లు తొలి ఓవర్‌కే 15 పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ (10)ని నితీష్ తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండోఓవర్)నాలుగో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో శశికాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ స్థానంలో వచ్చిన గుల్ఫమ్ నాలుగు పరుగులే చేసి రనౌటై వెనుతిరిగాడు. ఈ దశలో ఓపెనర్, కెప్టెన్ భరత్‌కు ధీరజ్ లక్ష్మణ్ తోడై స్కోర్‌ను 50 పరుగులకు చేర్చారు. భరత్ (36).. ఇస్మాయిల్ వేసిన బంతికి ఎక్స్ట్రా కవర్లో నితీష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్, క్రాంతి జోడి నిలకడగా ఆడుతూ స్కోర్‌ను పరుగులెత్తించారు. థీరజ్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బరిలో దిగిన క్రాంతి (17) సైతం సందీప్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు 25పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దోబూచులాడింది. లోయర్ మిడిలార్డర్లో వర్మ 11 పరుగులు చేశాడు. షోయబ్ (6), రఫీ(11) అజేయంగా నిలిచి మరో ఐదు బంతులుండగానే ఏడు వికెట్లకు 150 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించారు. ఇస్మాయిల్ మూడు, సందీప్ రెండు, నితీష్ ఒక వికెట్ తీశారు. దీంతో మూడు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం సాధించింది. మ్యాచ్ బెస్ట్‌గా నితీష్‌కుమార్ నిలవగా బెస్ట్ బ్యాటర్‌గా ధీరజ్, బెస్ట్ బౌలర్‌గా ఇస్మాయిల్ నిలిచారు. చదవండి: Ind Vs Eng 1st ODI: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్ సొంతగడ్డపై చెత్త రికార్డు! Latest Womens ODI Rankings: టాప్ 10లో టీమిండియా వైస్ కెప్టెన్.. మెరుగైన కెప్టెన్ ర్యాంక్ -
APL 2022: తడబడిన టైటాన్స్.. గర్జించిన బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెంట్రల్ ఆంధ్ర ఫ్రాంచైజీ జట్లు బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. టైటాన్స్ కెప్టెన్ శశికాంత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ వంశీకృష్ణ(10)ను 25 పరుగుల వద్ద అయ్యప్ప క్లీన్‌బౌల్డ్ చేశాడు. 5.5ఓవర్లలో 50పరుగుల మార్కు దాటిన అనంతరం మరో ఓపెనర్ హేమంత్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో అయ్యప్పకు క్యాచ్ఇచ్చి వెనుతిరిగాడు. చివరికి 18.5 ఓవర్లలోనే 119 పరుగులు స్కోర్‌కే టైటాన్స్ ఆలౌటైంది. కెప్టెన్ శశికాంత్ ఒకఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేయగా నితీష్ 15, సందీప్ 22, ధీరజ్ 10 పరుగులు చేయగలిగారు. అయ్యప్ప ,లలిత్‌మోహన్ మూడేసి వికెట్లు తీయగా సాయిరాహుల్ రెండు, మనీష్, రికీబుయ్ చెరో వికెట్ తీశారు. 120 పరుగుల లక్ష్యంతో... 120 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన బెజవాడ టైగర్స్ జట్టు ఓపెనర్ మహీప్ మూడు ఫోర్లతో 20 పరుగులు చేసి 4.4 ఓవర్ల వద్ద వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సుమంత్‌కు వన్‌డౌన్‌లో విశాఖకు చెందిన అవినాష్ తోడై స్కోర్‌ను రెండో వికెట్‌కు 84 పరుగులకు చేర్చారు. అవినాష్ రెండు ఫోర్లు,నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి వాసు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ రికీబుయ్ (ఒక ఫోర్, మూడు సిక్సర్స్‌తో)13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. 17.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి బెజవాడ టైగర్స్ విజయాన్ని అందుకుంది. నితీష్ వేసిన బంతిని స్ట్రయిట్‌గా లాంగ్ఆన్ మీదుగా గాల్లో బౌండరీకి తరలిం సుమంత్ (మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు) జట్టుకు విజయాన్ని అందించాడు. లలిత్ ప్లేయర్ ఆఫ్ ది వ్యచ్గా నిలవగా... బెస్ట్ బ్యాటర్‌గా అవినాష్, బెస్ట్ బౌలర్‌గా వాసు నిలిచారు. ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్ ఏపీఎల్‌లో ఐదో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్ మూడు మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్ వారియర్స్ మూడు మ్యాచ్‌లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్‌లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్ రైడర్స్ 4 పాయింట్లు సాధించింది. చదవండి: APL 2022: వైజాగ్ వారియర్స్ పరుగుల వరద.. రెండో విజయం! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... -
APL 2022: వైజాగ్ వారియర్స్ పరుగుల వరద.. రెండో విజయం!
Andhra Premier League- విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్‌లో ఉత్తరాంధ్ర ఫ్రాంచైజీ జట్లు వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయిన్స్ తలపడ్డాయి. వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తొమ్మిదో మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు బౌండరీలతో సత్తా చాటుకున్నారు. టాస్ గెలిచిన వైజాగ్ వారియర్స్ కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఉత్తరాంధ్ర లయిన్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. లయిన్స్ ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా వారియర్స్ మరో ఐదు బంతులుండగానే విజయం సాధించింది. నిలకడగా ఆడినా... బ్యాటింగ్ ప్రారంభింన లయన్స్ ఓపెనర్లు గుల్ఫమ్, భరత్ జోడి తొలి వికెట్‌కు 56 పరుగులు చేశారు. గుల్ఫమ్ రెండు ఫోర్లు ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేసి వెనుతిరిగాడు. భరత్..6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు, వర్మ (మూడుఫోర్లు, ఒక సిక్సర్‌తో) 21 పరుగులతో స్కోర్ 88 పరుగులకు చేర్చారు. భరత్‌తో పాటు తర్వాత బంతికే వర్మ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ దశలో క్రాంతి (41,ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు)కి రోహిత్ (18, ఒకఫోర్,ఒక సిక్సర్)తోడై 141 పరుగులకు స్కోర్ బోర్డు పరుగులెత్తించారు. ఈ క్రమంలో 141 పరుగుల వద్ద రోహిత్, 159 పరుగుల వద్ద క్రాంతి ఔటయ్యారు. స్కోర్ 174 పరుగులకు చేరే క్రమంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఏడు వికెట్లకు 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగింంది. సిద్దార్థ రెండు వికెట్లు తీయగా కార్తీక్, వేణు, ఆంజనేయులు ఒకో వికెట్ తీశారు. మిడిలార్డర్లో నిలదొక్కుకుంటూ.... వారియర్స్ ఓపెనరు గిరినాథ్ (7) ప్రమోద్ వేసిన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండో ఓవర్)వరి బంతికి దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్, కెప్టెన్ అశ్విన్‌తో కలిసిన సాయికృష్ణ 47(ఆరుఫోర్లు,ఒకసిక్సర్) 99 పరుగుల వద్ద వెనుతిరిగాడు. అశ్విన్ 47 (ఐదుఫోర్లు, ఒక సిక్సర్)116 పరుగుల వద్ద వెనుతిరిగ్గా....మరో రెండే పరుగులకే ధృవ్(1)వికెట్ కోల్పోయింది. నరేన్‌తో కలిసి వికెట్ చేజార్చుకోకుండా ఇన్నింగ్స్ సరిదిద్దేక్రమంలో కరణ్ (8) 16.2 ఓవర్‌వద్ద వెనుతిరిగాడు. అనంతరం నరేన్, మనోహార్ (ఏడుబంతుల్లో మూడు సిక్సర్లతో 21పరుగులు) జోడి చెలరేగిపోయింది. నరేన్ (20 బంతుల్లోనే రెండేసి ఫోర్లు, సిక్సర్లతో) 34పరుగులతో నిలి జట్టుకు విజయాన్నందించాడు. కార్తీక్ 3పరుగులతో నిలిచాడు. దీంతో మరో ఐదుబంతులుండగానే వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రవెద్, షోయిబ్ రెండేసి వికెట్లు తీయగా వర్మ, సాయికౌషిక్ చెరో వికెట్ తీశారు. ఏడో ఓవర్లోనే పై చేయి సాధించిన వారియర్స్ 11వ ఓవర్‌కు పూర్తిగా పట్టుసాధిం మిడిలార్డలో నిలదొక్కుకుని విజయం దిశగా సాగింది. సిద్ధార్ధ బెస్ట్ బౌలర్, మ్యాచ్ బెస్ట్‌గా నిలవగా... సాయికృష్ణ బెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్ ఏపీఎల్‌లో ఐదో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్ మూడు మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్ వారియర్స్ మూడు మ్యాచ్‌లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్‌లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్ రైడర్స్ 4 పాయింట్లు సాధించింది. చదవండి: IND Vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్ మాత్రం టీమిండియాదే -
APL 2022: గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మొదటి సీజన్ బుధవారం ప్రారంభమైంది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్చంద్ర టాస్ వేసి ప్రారంభించారు. తొలుత స్టేడియంలో ఏసీఏ, ఏపీఎల్ నిర్వాహక బృందాల సమక్షంలో విజేతలకు అందించే ట్రోఫీలను ఆయన ఆవిష్కరించారు. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో వరుణుడు ఆగమనం చేశాడు. దీంతో ఊహించని విధంగా కోస్టల్ రైడర్స్ జట్టు రెండు పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్.. గోదావరి టైటాన్స్ కెప్టెన్ శశికాంత్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. శ్రీరాం ఏపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సూపర్ స్ట్రయికర్‌గా నితీష్‌కుమార్, సూపర్ సిక్సర్‌తో జ్ఞానేశ్వర్, సూపర్ సేవర్‌గా విమల్ కుమార్, బెస్ట్ క్యాచర్‌గా గిరీష్‌కుమార్, బెస్ట్‌గా శశికాంత్ నిలిచి అతిథుల చేతుల మీదుగా అవార్డులందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి, సీఈవో వీరారెడ్డి, సభ్యుడు రెహ్మాన్, వై.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా మొదలైంది.. స్టీఫెన్ వేసిన టోర్నీ తొలి బంతిని ఓపెనర్ హేమంత్ ఎదుర్కొన్నాడు. మూడో బంతికి కవర్ మీదుగా బంతిని పంపి సింగిల్ తీయడంతో గోదావరి టైటాన్స్ పరుగుల ఖాతా ప్రారంభించింది. తర్వాత రెండో బంతిని మరో ఓపెనర్ వంశీకృష్ణ లాంగాఫ్ మీదుగా తరలించడంతో తొలి బౌండరీ నమోదైంది. తొలి ఓవర్(ఆట రెండో ఓవర్) వేస్తున్న హరిశంకర్ రెండో బంతిని ఆడబోయి స్లిప్‌లో ఉన్న శ్రీనివాస్‌కు క్యాచ్ ఇచ్చి హేమంత్(1) వెనుతిరగడంతో టోర్నీలో తొలి వికెట్ నమోదైంది. తొలి నాలుగు వికెట్లను 4.4 ఓవర్లలోనే 21 పరుగుల స్కోర్‌కు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శశికాంత్‌కు నితీష్(25) తోడై స్కోర్‌ను ముందుకు నడిపారు. 9.3 ఓవర్లలో 50 పరుగుల మార్కు, 18.3 ఓవర్‌కు వంద పరుగుల మార్కును అందుకోగలిగింది. 17.4 ఓవర్లో హరిశంకర్ వేసిన బంతిని ఆడబోయి ధీరజ్(13) హిట్ వికెటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా శశికాంత్ బౌండరీకి తరలించడంతో గోదావరి టైటాన్స్ ఆరు వికెట్లకు 115 పరుగులను చేయగలిగింది. శశికాంత్(55) టోర్నీలో తొలి అర్ధ సెంచరీ నమోదు చేసి సాత్విక్(5)తో కలిసి అజేయంగా నిలిచాడు. స్టీఫెన్, హరిశంకర్, దీపక్ రెండేసి వికెట్లు తీశారు. టాస్ గెలిచారు.. మ్యాచ్ ఓడారు.. లక్ష్యం చేరుకునేందుకు కోస్టల్ రైడర్స్ ఇన్నింగ్స్ నిదానంగానే ప్రారంభించారు. శశికాంత్ వేసిన తొలి ఓవర్‌కు కేవలం ఒక పరుగే చేశారు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ జ్ఞానేశ్వర్ 15 బంతులాడి 20 పరుగులే చేయగా.. మరో ఓపెనర్ ప్రణీత్ 18 బంతులాడి ఏడు పరుగులే చేశాడు. ఓపెనర్ల స్థానంలో వచ్చిన మునీష్ ఆరు బంతులాడి మూడు పరుగులే చేయగా.. తపస్వి మూడు బంతులాడి ఒక పరుగే చేశాడు. ఏడు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసిన స్థితిలో వరుణుడు ఆగమనం చేశాడు. వర్షం కారణంగా ఆట ముందుకు సాగకపోవడంతో వీజేడీ పద్ధతిలో విజేతను నిర్ణయించేందుకు ఏడు ఓవర్లకు 35 పరుగుల టార్గెట్ విధించారు. దీంతో కోస్టల్ రైడర్స్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఏపీఎల్ ఆరంభ మ్యాచ్ వరుణుడి రాకతో ఇలా ముగిసింది. గర్జించిన ఉత్తరాంధ్ర లయన్స్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మరో మ్యాచ్ వర్షం కారణంగా.. 1.45 గంటలు ఆలస్యమైంది. దీంతో 13 ఓవర్ల ఇన్నింగ్స్‌గా నిర్ణయించారు. టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర లయన్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకుని రాయలసీమ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు అభిషేక్(30) వంశీకృష్ణ(17) జోడి ధాటిగానే బ్యాటింగ్ చేయడంతో.. 5.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా జట్టు 50 పరుగుల మార్కును చేరింది. తర్వాత రెండు పరుగులు జోడించి ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. రషీద్ ఐదు నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి ఐదు బంతులాడి ఐదు పరుగులు చేసి వెనుతిరిగాడు. చివర్లో కీపర్ పృథ్వీ(8) ఓ భారీ సిక్స్ చేసి రనౌటయ్యాడు. కెప్టెన్ గిరినాథ్ 25 పరుగులతో నిలవగా రాయలసీమ కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 99 పరుగులు చేసింది. 100 పరుగుల లక్ష్యంతో ఉత్తరాంధ్ర లయన్స్ బరిలోకి దిగి ఓవర్ మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. ఓపెనర్లు గుల్ఫమ్ (30), క్రాంతి(10) తొలి రెండు ఓవర్లు ధాటి గానే ఆడి 21 పరుగులు చేశారు. జట్టు 50 పరుగుల మా ర్కును ఓ వికెట్ కోల్పోయి 6.5 ఓవర్లలో సాధించింది. 10 ఓవర్లు ముగిసేటప్పటికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. తరుణ్ 24 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్ అయితే ప్రపంచకప్ జట్టు నుంచి కోహ్లి అవుట్!