విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ జట్టును ఓడించగా... గోదావరి టైటాన్స్ 56 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్ జట్టుపై గెలుపొందింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది.
జ్ఞానేశ్వర్ (53 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), యారా సందీప్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం వైజాగ్ వారియర్స్ 17.4 ఓవర్లలోనే 135 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇస్మాయిల్ మూడు వికెట్లు తీశాడు. రాయలసీమ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
శ్రీరామ్ వెంకట రాహుల్ (31 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాయలసీమ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసి గెలిచింది. తన్నీరు వంశీకృష్ణ (34 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిరినాథ్ రెడ్డి (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేక్ కమరుద్దీన్ (18 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాయలసీమ కింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment