హెలీకాఫ్టర్ రైడ్‌ను ప్రారంభిస్తున్న రజత్ భార్గవ, ఎమ్మెల్యేæ విష్ణు, తదితరులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరాను పురస్కరించుకుని భక్తులు హెలీకాఫ్టర్‌లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కృష్ణా జిల్లా యంత్రాంగం కల్పించింది. పర్యాటకశాఖ, నగర మునిసిపల్ కార్పొరేషన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించారు. శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విహంగ సేవలు ప్రారంభించారు.
తొలుత ఆలయ ఈవో భ్రమరాంబ ప్రయాణికులతో నగర అందాలను తిలకించారు. కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ (అభివృద్ధి) శివశంకర్ కూడా హెలీకాఫ్టర్‌లో విహరించారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, మేయర్ భాగ్యలక్ష్మి, ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి పాల్గొన్నారు.
ఉదయం 6 గంటల నుంచి హెలీరైడ్.. : ఈ నెల 17 వరకు జరిగే హెలీ రైడ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 6 నిమిషాల విహంగ యాత్రకు రూ.3,500, 13 నిమిషాలకు రూ.6 వేలుగా ధరను నిర్ణయించారు. సన్ రైజ్ ఎయిర్ చార్టర్ సంస్థ, తుంబై ఏవియేషన్ ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్
నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment