
ప్రేమించాలంటూ మరదలిపై వేధింపులు
హయత్‌నగర్: తనను ప్రేమించాలని మేన మరదలిని వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం హయత్‌నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ డివిజన్ లెక్చరర్స్‌కాలనీలో నివసించే కేతుల జంగారెడ్డి అశ్విని(18)ను వరుసకు మేనబావ అయిన రాఘవేంద్రకాలనీలో నివసించే లింగారెడ్డి గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని, పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలు పెట్టాడు.
దీంతో విసుగు చెందిన అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అశ్విని తండ్రి, ఆమె బంధువులు లింగారెడ్డిపై దాడి చేయడంతో అతని తలకు గాయమైంది. దీంతో అశ్విని తండ్రి, అతని బంధువులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.