ప్రేమించలేదని.. కాల్‌గర్ల్‌గా ప్రచారం! | rougue tortured woman in vijayawada | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని.. కాల్‌గర్ల్‌గా ప్రచారం!

Published Tue, May 2 2017 8:15 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

rougue tortured woman in vijayawada

విజయవాడ: ఓ జూలాయి కుర్రాడు అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో వేధింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ఆమె పేరిట ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి.. ఆమె ఫొటోలు, ఫోన్‌ నంబర్లు పెట్టి కాల్‌గర్ల్‌గా ప్రచారం చేశాడు. ఈ దుర్మార్గమైన ఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయితో పవన్‌కుమార్‌ అనే యువకుడు మొదట పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో పలు కథలు చెప్పి, సానుభూతి పొందేందుకు ప్రయత్నించాడు.

అయినా ఆమె కాదనడంతో అతనిలో ఉన్మాదం మరింత పెరిగిపోయి.. పలుసార్లు ఫోన్‌చేసి బెదిరించాడు. ఆ తర్వాత  ఫేస్‌బుక్‌లో ఆమె ఫొటోలు, ఫోన్‌నంబర్లు పెట్టి కాల్‌గర్ల్‌గా ప్రచారం చేశాడు. తనకు, తన కుటుంబసభ్యులకు అభ్యంతరకరమైన ఫోన్లు వస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గతంలోనూ అతడిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా.. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. తాజా వేధింపుల నేపథ్యంలో నిందితుడిపై నిర్భయ కేసును నమోదుచేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అమ్మాయిలపై ఆకతాయిలు ప్రేట్రేగిపోతూ.. సోషల్‌ మీడియాలోనూ వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement