ప్రొద్దుటూరుపై సీఎం రమేష్‌ కన్ను | CM Ramesh eye on prodduturu | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరుపై సీఎం రమేష్‌ కన్ను

Published Sat, Jul 1 2017 4:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

CM Ramesh eye on prodduturu

 - వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగేందుకు అడుగులు
 -  లింగారెడ్డి స్నేహంతో వరదకు చెక్‌ పెట్టే వ్యూహం
 -  రమేష్‌ జోక్యంపై మండిపడుతున్న వరద
 -  ప్రొద్దుటూరు టీడీపీలో తీవ్రం కానున్న వర్గపోరు  
 
సాక్షి ప్రతినిధి, కడప: రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్‌ ప్రొద్దుటూరు శాసనసభ స్థానం మీద కన్నేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు మెల్లగా అడుగులు వేస్తున్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తెలివిగా పావులు కదుపుతున్నారు. సీఎం రమేష్‌ కుటుంబం చిత్తూరు జిల్లాలో సారా వేలం పాటల వ్యాపారం చేస్తున్న సమయంలో చంద్రబాబుతో ఏర్పడిన పరిచయం వీరి మధ్య స్నేహంగా మారింది.

అప్పటి నుంచి వ్యాపారాలు, ఇతర వ్యవహారాల్లో బాబుకు చేదోడుగా ఉంటూ వచ్చిన సీఎం రమేష్‌ 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక కొన్నేళ్ల పాటు చక్రం తిప్పారు. ఆ తర్వాత తెర మీద కనిపించకుండా చంద్రబాబుతో స్నేహం నడిపిన సీఎం రమేష్‌ 2012లో హఠాత్తుగా రాజ్యసభ సభ్యుడి పదవి సంపాదించారు.  టీడీపీకి చావోరేవో అనేలా జరిగిన 2014 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుతో ఉన్న చనువును అనుకూలంగా మలచుకుని జిల్లా పార్టీ మీద, అధికార యంత్రాంగం మీద తన ఆధిపత్యం చూపేందుకు పావులు కదుపుతున్నారు. 
 
ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి
వచ్చే ఏడాది మార్చితో సీఎం రమేష్‌కు రాజ్యసభ సభ్యుడి పదవి గడువు ముగుస్తోంది. ఆ ఏడాది చివరలోగానీ, 2019లో గానీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న సీఎం రమేష్‌ ప్రొద్దుటూరు స్థానం మీద కన్ను వేశారు. ఇక్కడ లింగారెడ్డి, వరదరాజులరెడ్డి మధ్య ఉన్న విభేదాలను తన రాజకీయ వ్యూహానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. లింగారెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ ముందుగా వరదరాజులురెడ్డిని ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చే అభ్యర్థుల జాబితాలోనే లేకుండా చేయడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇందులోభాగంగానే నియోజక వర్గంలో సొంతంగా కార్యక్రమాలు చేస్తూ మద్దతుదారులను తయారు చేసుకునే పనిలో పడ్డారు.

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా వరదరాజులరెడ్డి మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డికి చెక్‌ పెట్టడానికి సీఎం రమేష్‌ తెరచాటు ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నేరుగా సీఎం జోక్యం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరద మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్‌ను చేయక తప్పలేదు. రంజాన్‌ సందర్భంగా సీఎం రమేష్‌ ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును రప్పించారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి ఆహ్వానం పంపకుండా తన కనుసన్నల్లో ఈ కార్యక్రమం నడిపించారు. ఇఫ్తార్‌కు వరద, ఆయన మద్దతుదారులు డుమ్మా కొట్టి తమకు ఆహ్వానం లేనందువల్లే హాజరుకాలేదనీ, సీఎం రమేష్‌ వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని నేరుగానే విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నింటి కారణంగా సీఎం రమేష్‌కు వరద రాజులురెడ్డికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి.
 
పోట్లదుర్తిని కలిపేస్తే ?
ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా స్థాయి పెంచి తన స్వగ్రామం పోట్లదుర్తిని ఇందులో కలిసేలా చేయాలని సీఎం రమేష్‌ ఆలోచన చేస్తున్నారు. ఈ పని చేయించగలిగితే ప్రొద్దుటూరు నియోజకవర్గం మీద తన జోక్యాన్ని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి వస్తుందనేది ఆయన ఆలోచన. మున్సిపాలిటీ పరిధిలోని పేదలందరికీ ఇళ్లు (హౌస్‌ ఫర్‌ ఆల్‌) పథకం కింద రెండు వేల ఇళ్లు మంజూరయ్యాయి.  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ స్థాయిల్లో తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి 7వేల ఇళ్లు మంజూరు చేయించేందుకు సీఎం రమేష్‌ ప్రయత్నిస్తున్నారు. వీటిలో 5వేల ఇళ్లు తన సొంత గ్రామం పోట్లదుర్తికి సమీపంలో నిర్మించి తన వారి నందరినీ పట్టణ పరిధిలో ఓటర్లుగా చేర్పించేందుకు వ్యూహం రచిస్తున్నారు.

మంజూరైంది 2 వేల ఇళ్లే అయినా 7 వేల ఇళ్ల కోసం అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు çపంపించేలా చేశారు. ఇటీవల మున్సిపల్‌ పరిపాలన విభాగం డైరెక్టర్‌ (డీఎంఈ) కన్నబాబు ప్రతిపాదిత భూమిని పరిశీలించి వెళ్లారు. ముందుగా వరదరాజులరెడ్డిని జీరో చేయడం, నియోజక వర్గంలో తన పట్టు పెంచుకుంటే, ఎన్నికల నాటికి లింగారెడ్డిని కూడా పోటీ జాబితా నుంచి తప్పించి శాసనసభ టిక్కెట్‌ సంపాదించుకోవచ్చనే దిశగా సీఎం రమేష్‌ పావులు కదుపుతున్నారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరదరాజులు, లింగారెడ్డి మధ్య రాజకీయ పోరు నడుస్తున్న ప్రొద్దుటూరు టీడీపీలో భవిష్యత్‌లో ముక్కోణపు రాజకీయ పోరాటం తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
 
బాబుకు చేదోడుగా ఉంటూ వచ్చిన సీఎం రమేష్‌ 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక కొన్నేళ్ల పాటు చక్రం తిప్పారు. ఆ తర్వాత తెర మీద కనిపించకుండా చంద్రబాబుతో స్నేహం నడిపిన సీఎం రమేష్‌ 2012లో హఠాత్తుగా రాజ్యసభ సభ్యుడి పదవి సంపాదించారు.  టీడీపీకి చావోరేవో అనేలా జరిగిన 2014 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుతో ఉన్న చనువును అనుకూలంగా మలచుకుని జిల్లా పార్టీ మీద, అధికార యంత్రాంగం మీద తన ఆధిపత్యం చూపేందుకు పావులు కదుపుతున్నారు. 
 
ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి
వచ్చే ఏడాది మార్చితో సీఎం రమేష్‌కు రాజ్యసభ సభ్యుడి పదవి గడువు ముగుస్తోంది. ఆ ఏడాది చివరలోగానీ, 2019లో గానీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న సీఎం రమేష్‌ ప్రొద్దుటూరు స్థానం మీద కన్ను వేశారు. ఇక్కడ లింగారెడ్డి, వరదరాజులరెడ్డి మధ్య ఉన్న విభేదాలను తన రాజకీయ వ్యూహానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. లింగారెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ ముందుగా వరదరాజులురెడ్డిని ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చే అభ్యర్థుల జాబితాలోనే లేకుండా చేయడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇందులోభాగంగానే నియోజక వర్గంలో సొంతంగా కార్యక్రమాలు చేస్తూ మద్దతుదారులను తయారు చేసుకునే పనిలో పడ్డారు.

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా వరదరాజులరెడ్డి మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డికి చెక్‌ పెట్టడానికి సీఎం రమేష్‌ తెరచాటు ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నేరుగా సీఎం జోక్యం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరద మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్‌ను చేయక తప్పలేదు. రంజాన్‌ సందర్భంగా సీఎం రమేష్‌ ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును రప్పించారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి ఆహ్వానం పంపకుండా తన కనుసన్నల్లో ఈ కార్యక్రమం నడిపించారు. ఇఫ్తార్‌కు వరద, ఆయన మద్దతుదారులు డుమ్మా కొట్టి తమకు ఆహ్వానం లేనందువల్లే హాజరుకాలేదనీ, సీఎం రమేష్‌ వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని నేరుగానే విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నింటి కారణంగా సీఎం రమేష్‌కు వరద రాజులురెడ్డికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి.
 
పోట్లదుర్తిని కలిపేస్తే ?
ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా స్థాయి పెంచి తన స్వగ్రామం పోట్లదుర్తిని ఇందులో కలిసేలా చేయాలని సీఎం రమేష్‌ ఆలోచన చేస్తున్నారు. ఈ పని చేయించగలిగితే ప్రొద్దుటూరు నియోజకవర్గం మీద తన జోక్యాన్ని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి వస్తుందనేది ఆయన ఆలోచన. మున్సిపాలిటీ పరిధిలోని పేదలందరికీ ఇళ్లు (హౌస్‌ ఫర్‌ ఆల్‌) పథకం కింద రెండు వేల ఇళ్లు మంజూరయ్యాయి.  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ స్థాయిల్లో తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి 7వేల ఇళ్లు మంజూరు చేయించేందుకు సీఎం రమేష్‌ ప్రయత్నిస్తున్నారు. వీటిలో 5వేల ఇళ్లు తన సొంత గ్రామం పోట్లదుర్తికి సమీపంలో నిర్మించి తన వారి నందరినీ పట్టణ పరిధిలో ఓటర్లుగా చేర్పించేందుకు వ్యూహం రచిస్తున్నారు. మంజూరైంది 2 వేల ఇళ్లే అయినా 7 వేల ఇళ్ల కోసం అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు çపంపించేలా చేశారు.

ఇటీవల మున్సిపల్‌ పరిపాలన విభాగం డైరెక్టర్‌ (డీఎంఈ) కన్నబాబు ప్రతిపాదిత భూమిని పరిశీలించి వెళ్లారు. ముందుగా వరదరాజులరెడ్డిని జీరో చేయడం, నియోజక వర్గంలో తన పట్టు పెంచుకుంటే, ఎన్నికల నాటికి లింగారెడ్డిని కూడా పోటీ జాబితా నుంచి తప్పించి శాసనసభ టిక్కెట్‌ సంపాదించుకోవచ్చనే దిశగా సీఎం రమేష్‌ పావులు కదుపుతున్నారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరదరాజులు, లింగారెడ్డి మధ్య రాజకీయ పోరు నడుస్తున్న ప్రొద్దుటూరు టీడీపీలో భవిష్యత్‌లో ముక్కోణపు రాజకీయ పోరాటం తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement