
ప్రజలందరూ వైఎస్ జగన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేసిన ఆయనను వివిధ వర్గాల నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాల నేతలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రైతులు, వృద్ధులు, కార్మికులు కలసి పలు సమస్యలు విన్నవించారు. బాధలు చెప్పుకున్నారు.. అగచాట్లు వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలవారికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు.. సుభిక్ష పాలన అందిస్తానని భరోసా ఇచ్చారు.. నవరత్నాలతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో ప్రజలంతా ఆయన హామీలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సువర్ణపాలన కోసం ఎదురుచూస్తున్నారు.
ఎర్రగుంట్ల/ప్రొద్దుటూరు టౌన్
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే ఉపాధ్యాయులకు మేలు ..
వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే మా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధాన సీపీఎస్ పద్ధతి రద్దు చేసి పాత పింఛన్ పద్ధతిని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాదయాత్రలో వైఎస్ జగన్‌కు వినతులు అందించారు. వైఎస్‌ఆర్ హయాంలోనే వృత్తి విద్య ఉపాధ్యాయులు రెగ్యులర్ అయ్యారు. – తుపాకుల చంద్ర ఓబుళరెడ్డి
( వృతి విద్య ఉపాధ్యాయుడు, ఎర్రగుంట్ల)
ఆయనొస్తే సమస్యలు పరిష్కరిస్తారు..
జగన్ అధికారంలోకి రాగానే 108, 104, వైద్య సిబ్బంది సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని మాకు విశ్వాసం ఉంది. పాదయాత్రలో జిల్లా వ్యాప్తంగా 108, 104 వైద్య సిబ్బంది వచ్చి జగన్‌కు విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
– వీరమోహన్‌రెడ్డి ( 108 వాహన పైలెట్, ఎర్రగుంట్ల)
జగన్‌తోనే కాంట్రాక్టు కార్మికులకు వెలుగులు..
కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని జగన్‌కు విన్నవించాం. ప్రభుత్వంలోకి రాగానే కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో మా కార్మికులకు ఎంతో సంతోషం కల్గింది. 15 ఏళ్ల నుంచి విద్యుత్ రంగంలో చాలీచాలని జీతాలతో కార్మికులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే కార్మికుల కుటుంబాలలో వెలుగులు వస్తాయి. – నారాయణరెడ్డి
( వైఎస్ విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, ఆర్టీపీపీ)
రూ.2 వేలు పింఛన్ ఇస్తానన్నారు..
మా ఊరు జమ్మలమడుగు నియోజకవర్గం నక్కోనిపల్లి. ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో నా కుమార్తె బాలలక్షుమ్మ వద్ద ఉంటున్నా. రెండు రోజుల క్రితం జగన్‌బాబు ఇక్కడికి వచ్చాడు. పింఛన్ రూ.2వేలు చేస్తానవ్వా అని చెప్పాడు. ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా రూ.2వేలు చేస్తాడనే నమ్మకం ఉంది.
నక్కో గోపెమ్మ, వృద్ధురాలు
సీపీఎస్ రద్దు చేస్తారన్న నమ్మకం ఉంది..
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే సీపీఎస్ రద్దు చేస్తారన్న నమ్మకం ఉంది. ఎంతో మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు సీపీఎస్ విధానంతో తీవ్రంగా నష్టపోతున్నారు. జగన్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. అందుకే ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పాం.
– ఉపేంద్ర, యూటీఎఫ్ జిల్లా కౌన్సిలర్
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తారన్న భరోసా ఉంది..
అ«ధికార పార్టీ సీమకు చేస్తున్న ద్రోహాన్ని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు వివరించాను. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కోరాను. వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని కోరాను. ఈ విషయాలను ప్రస్తావించి వినతి పత్రం ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక ఉక్కు ఫ్యాక్టరీని 6 నెలల్లో ప్రారంభిస్తానని జగన్ చెప్పారు. ఆయనపై నమ్మకం ఉంది. – హరిత,
రాయలసీమ విద్యార్థి శక్తి రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment