గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల 5 నుంచి 18 వరకు దాదాపు 0.728 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
మైలవరం: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల 5 నుంచి 18 వరకు దాదాపు 0.728 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 0.935 టీఎంసీలు నిల్వ ఉంది. దక్షిణ కాలువకు జనవరి 27 నుంచి 80 క్యూసెక్కుల మేర నీరు విడుదల అవుతోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల దాహార్తిని తీర్చుటకు నీటిని విడుదల చేస్తున్నారు. మైలవరం, వేపరాల, దొమ్మరనంద్యాల, మోరగుడి గ్రామాలకు ఉత్తర కాలువ ద్వారా పెన్నానది లోకి 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.