
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి రాయల్‌బాష్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా అట్టహాసంగా ఏ ర్పాటు చేశారు. సినీ హాస్యనటుడు తాగుబోతు రమేష్, జబర్దస్త్ టీం వేణు, ధన్‌రాజ్, రేడియో జాకీలు కాజల్, చైతు తమ హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. కిరాక్ కబడ్డీ మహిళా ఆర్టిస్ట్‌లు, సినీ సింగర్లు, డీ డాన్స్ ప్రోగ్రాం కొరియోగ్రాఫర్ శ్రీను టీం చేసిన నృత్యాలు యువతను ఉర్రూత లూగించాయి. నేపాల్‌కు చెందిన కళాకారులు అబ్బురపరిచే విన్యాసాలు చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి అందరికి పంచారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో రాయల్ కౌంటీ రిసార్ట్స్ ఎండీ జంపాల మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్లు పగిడి రఘునాథరెడ్డి, రాకేష్‌రెడ్డి, ఆపరేషన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మోహన్ మలావత్, మార్కెటింగ్ చీఫ్ పాతకోట రాఘవరెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment