ప్రొద్దుటూరు క్రైం: స్థానిక బొల్లవరంలోని పద్మావతి కంట్లో కారం పొడి చల్లి ఓ వ్యక్తి 7 తులాల మేర ఉన్న బంగారు నగలను దోచుకొని వెళ్లాడు. పద్మావతి దివ్యాంగురాలు. ఆమె నడవ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రాత్రి ఓ వ్యక్తి ప్రవేశించి కళ్లలో కారం పొడి చల్లాడు. వెంటనే పెట్టెలో ఉన్న బంగారు నగలను తీసుకొని పారిపోయాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమి కూడారు. అప్పటికే నిందితుడు పారిపోయాడు. కాగా రెండు రోజుల నుంచి వారికి బాగా పరిచయమున్న ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి పోయేవాడని, అతనే బంగారాన్ని తీసుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. విషయం తెలియడంతో త్రీ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పద్మావతి చెప్పిన వివరాల మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.