దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘లైవ్ మర్డర్’ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మారుతిప్రసాద్‌రెడ్డి హత్యకు.. అతని సోదరి వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు. ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకు వచ్చిన మారుతి ప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు పట్టపగలు నడిరోడ్డుపై వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపిన సంఘటన తెలిసిందే. ఈ కేసులో నిందితులైన రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను పోలీసులు శుక్రవారం సాయంత్రం శ్రీదేవి ఫంక్షన్ హాల్‌లో మీడియా ముందు హాజరుపరిచారు. డీఎస్పీ భక్తవత్సలం యువకుడి హత్యకు దారితీసిన కారణాలను వివరించారు.