ట్రాక్టర్‌ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం | Tractor hit dead skutaristu | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం

Published Fri, Mar 3 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

Tractor hit dead skutaristu

ముద్దనూరు(యరగుంట్ల): యర్రగుంట్ల–ప్రొద్దుటూరు రహదారిలో గురువారం ట్రాక్టర్‌ ఢీకొని స్కూటర్‌లో ప్రయాణిస్తున్న గడ్డంవారి బాషా (50) దుర్మరణం చెందాడు. యర్రగుంట్ల ఎస్‌ఐ వెంకటనాయుడు సమాచారం మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన గడ్డంవారి బాషా, షబ్బీర్‌లు యర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు మోటర్‌సైకిల్‌లో ప్రయాణిస్తున్నారు. వెనుకవైపు నుంచి మోటర్‌సైకిల్‌ను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ట్రాక్టర్‌ మోటర్‌సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. షబ్బీరు స్వల్పగాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement