Yarraguntla
-
వీళ్ళ ఆనందానికి అవధులు లేవు
-
నాకు కనిపించిన వెలుగు మీరే అన్న..
-
ఎర్రగుంట్ల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి
-
కొత్త రైలు మార్గంలో తొలి ఎక్స్‌ప్రెస్
కడప : కర్నూలు–వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నిర్మితమైన నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైనులో విజయవాడ–ధర్మవరం మధ్య నడిచే రైలు తొలిఎక్స్ప్రెస్ రైలుగా నడిపించనున్నారు. ప్రస్తుతం వారానికి రెండుసార్లు నడుస్తున్న విజయవాడ–ధర్మవరం, ధర్మవరం–విజయవాడ (17215/17216) రైలును నంద్యాల–ఎర్రగంట్ల మార్గంలో మళ్లిస్తున్నారు. ఈనెల 16న తేదిన ధర్మవరం నుంచి విజయవాడకు సాయంత్రం 4గంటలకు (17216) ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. నంద్యాలకు అర్ధరాత్రి 12.06కు చేరుకొని ఇక్కడి నుంచి గిద్దలూరు, మార్కాపురం, గుంటూరు మీదుగా విజయవాడకు మరుసటిరోజు 6.05గంటలకు చేరుతుంది. అలాగే17వతేదిన విజయవాడ–ధర్మవరం ఎక్స్ప్రెస్రైలు (17215) రాత్రి 11 గంటలకు బయలుదేరి నంద్యాలకు 18వతేది తెల్లవారుజామున 5.25చేరుకుంటంది. నంద్యాల నుంచి ఎర్రగంట మార్గంలో బయలుదేరి బనగానపల్లెకు 6.00, జమ్మలమడుగు 7.00, ప్రొద్దుటూరుకు 7.30కు, ఎర్రగుంట్లకు 7.55, తాడిపత్రికి 9.15, గుత్తికి 10.20, అనంతపురం 11.53, ధర్మవరానికి మధ్యాహ్నాం1గంటలకు చేరుకుంటుంది. విజయవాడ–ధర్మవరం రైలును నంద్యాల–ఎర్రగుంటల మార్గంలలో మళ్లిస్తుండటంతో దాదాపు గంట ఆలస్యంగా ఆయా ప్రాంతాలకు ప్రయాణీకులు చేరుకుంటారని గుంతకల్ ఎడీఆర్ఎం సుబ్బరాయుడు ‘సాక్షి’తెలిపారు. రాజధానికి రైలుటిక్కెట్ల ధరలిలా.. ఎర్రగుంట్ల–విజయవాడకు స్లీపర్‌కు రూ250, ధర్డ్‌ఎసీకి రూ670. సెకండ్‌ఎసీకి రూ. 960, ఫస్ట్ ఎసీకి రూ.1620, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు స్లీపర్‌కు రూ.240, ధర్డ్‌ఎసీకి రూ.650, సెకండ్‌ఎసీకి రూ.930, ఫస్ట్ఎసీకి రూ.1560, జమ్మలమడుగు నుంచి విజయవాడకు స్లీపర్ రూ.235, ధర్డ్‌ఎసీకి రూ625, సెకండ్‌ఎసీకి రూ.895, ఫస్ట్ఎసీకి రూ.1505లు రైల్వే నిర్ణయించింది. జనరల్ టికెట్లో ఎర్రగుంట్ల నుంచి విజయవాడకు రూ.130, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు రూ.130, జమ్మలమడుగు నుంచి విజయవాడకు రూ.125లుగా నిర్ణయించారు. -
ట్రాక్టర్ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం
ముద్దనూరు(యరగుంట్ల): యర్రగుంట్ల–ప్రొద్దుటూరు రహదారిలో గురువారం ట్రాక్టర్ ఢీకొని స్కూటర్లో ప్రయాణిస్తున్న గడ్డంవారి బాషా (50) దుర్మరణం చెందాడు. యర్రగుంట్ల ఎస్ఐ వెంకటనాయుడు సమాచారం మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన గడ్డంవారి బాషా, షబ్బీర్‌లు యర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు మోటర్‌సైకిల్‌లో ప్రయాణిస్తున్నారు. వెనుకవైపు నుంచి మోటర్‌సైకిల్‌ను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ట్రాక్టర్ మోటర్‌సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. షబ్బీరు స్వల్పగాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కలమల్ల గ్రామ పరిధిలోని కృష్ణానగర్‌లో వెంకటసుబ్బమ్మ (30) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా.. మైదుకూరు మండలంలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన చందా వెంకటస్వామి, వెంకటసుబ్బమ్మలు 2001లో కలమల్లకు వచ్చి కృష్ణానగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. వెంకటసుబ్బమ్మ ఆర్టీïపీపీలో మెయింటైన్స్ ఉద్యోగం చేస్తోంది. వెంకటస్వామి కువైట్‌కు వెళ్లి వస్తూ ఉండేవాడు. నెల రోజుల కిందట భర్త కువైట్ నుంచి వచ్చాడు. ఇకపై కువైట్‌కు వెళ్లవద్దని భార్య తరచూ భర్తతో గొడవ పడుతుండేది. బుధవారం కూడా ఈ విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు.భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.