కొత్త రైలు మార్గంలో తొలి ఎక్స్‌ప్రెస్
కడప : కర్నూలు–వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నిర్మితమైన నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైనులో విజయవాడ–ధర్మవరం మధ్య నడిచే రైలు తొలిఎక్స్‌ప్రెస్ రైలుగా నడిపించనున్నారు. ప్రస్తుతం వారానికి రెండుసార్లు నడుస్తున్న విజయవాడ–ధర్మవరం, ధర్మవరం–విజయవాడ (17215/17216) రైలును నంద్యాల–ఎర్రగంట్ల మార్గంలో మళ్లిస్తున్నారు. ఈనెల 16న తేదిన ధర్మవరం నుంచి విజయవాడకు సాయంత్రం 4గంటలకు (17216) ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. నంద్యాలకు అర్ధరాత్రి 12.06కు చేరుకొని ఇక్కడి నుంచి గిద్దలూరు, మార్కాపురం, గుంటూరు మీదుగా విజయవాడకు మరుసటిరోజు 6.05గంటలకు చేరుతుంది.
అలాగే17వతేదిన విజయవాడ–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌రైలు (17215) రాత్రి 11 గంటలకు బయలుదేరి నంద్యాలకు 18వతేది తెల్లవారుజామున 5.25చేరుకుంటంది. నంద్యాల నుంచి ఎర్రగంట మార్గంలో బయలుదేరి బనగానపల్లెకు 6.00, జమ్మలమడుగు 7.00, ప్రొద్దుటూరుకు 7.30కు, ఎర్రగుంట్లకు 7.55, తాడిపత్రికి 9.15, గుత్తికి 10.20, అనంతపురం 11.53, ధర్మవరానికి మధ్యాహ్నాం1గంటలకు చేరుకుంటుంది. విజయవాడ–ధర్మవరం రైలును నంద్యాల–ఎర్రగుంటల మార్గంలలో మళ్లిస్తుండటంతో దాదాపు గంట ఆలస్యంగా ఆయా ప్రాంతాలకు ప్రయాణీకులు చేరుకుంటారని గుంతకల్ ఎడీఆర్‌ఎం సుబ్బరాయుడు ‘సాక్షి’తెలిపారు.
రాజధానికి రైలుటిక్కెట్ల ధరలిలా..
ఎర్రగుంట్ల–విజయవాడకు స్లీపర్‌కు రూ250, ధర్డ్‌ఎసీకి రూ670. సెకండ్‌ఎసీకి రూ. 960, ఫస్ట్ ఎసీకి రూ.1620, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు స్లీపర్‌కు రూ.240, ధర్డ్‌ఎసీకి రూ.650, సెకండ్‌ఎసీకి రూ.930, ఫస్ట్‌ఎసీకి రూ.1560, జమ్మలమడుగు నుంచి విజయవాడకు స్లీపర్ రూ.235, ధర్డ్‌ఎసీకి రూ625, సెకండ్‌ఎసీకి రూ.895, ఫస్ట్‌ఎసీకి రూ.1505లు రైల్వే నిర్ణయించింది. జనరల్ టికెట్‌లో ఎర్రగుంట్ల నుంచి విజయవాడకు రూ.130, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు రూ.130, జమ్మలమడుగు నుంచి విజయవాడకు రూ.125లుగా నిర్ణయించారు.