
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదనే కారణంతో యువతిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ , లావణ్య అనే యువతిని మూడు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎవరూ లేని సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన సునీల్ తనను ప్రేమించాల్సిందిగా బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: ప్రేమోన్మాది ఆత్మహత్య)\
Comments
Please login to add a commentAdd a comment