రోజూ సూర్య భగవానుడిని పూజించాలి | Daily worship of Lord Sun | Sakshi
Sakshi News home page

రోజూ సూర్య భగవానుడిని పూజించాలి

Published Thu, Jan 26 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

రోజూ సూర్య భగవానుడిని పూజించాలి

రోజూ సూర్య భగవానుడిని పూజించాలి

ప్రొద్దుటూరు కల్చరల్‌:  రోజూ సూర్య భగవానుడిని దర్శించి పూజించడం ద్వారా విటమిన్‌ డీ లభిస్తుందని, ఆరోగ్యంగా జీవించవచ్చని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శ్రీచక్రపూజ నిర్వహించిన అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అహం దరిచేరనీయకూడదని, ఇతరులను గౌరవించాలన్నారు. పరీక్షిత్‌ మహారాజు కథను వివరించారు. ఆలయంలోని సుదర్శన యోగ నరసింహస్వామి ఎంతో మహిమగలవారని, భక్తులు పూజలు నిర్వహిస్తే వారి సమస్యలు తొలగిపోయి కోరికలను నెరవేరుతాయని చెప్పారు. టీవీ, సీరియల్స్‌ చూడటం వలన మనిషికి జడత్వం లభిస్తుందన్నారు. తాను ప్రొద్దుటూరు పట్టణంలో భిక్ష స్వీకరించానని, ఆనాటి చదువుకున్న జ్ఞాపకాలను భక్తులకు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మెలగి, అందరూ సన్మార్గంలో నడవాలన్నారు. ఆంజనేయస్వామి, యోగిరాజ వల్లభ దత్తాత్రేయస్వామి, చాముండేశ్వరిదేవి, కాశీవిశ్వేశ్వరుడు, యోగ నరసింహస్వామిలను సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement