ప్రొద్దుటూరులో ఓ ఇంటర్ విద్యార్థినిని ప్రేమించాలంటూ వేధిస్తున్న ఆటో డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
దేహశుద్ధి చేసిన స్థానికులు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులో ఓ ఇంటర్ విద్యార్థినిని ప్రేమించాలంటూ వేధిస్తున్న ఆటో డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. రామేశ్వరానికి చెం దిన శివశంకర్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనితోపాటు మరి కొందరు యువకులు నేతాజీ నగర్ నుంచి వచ్చే విద్యార్థినులను వేధించేవారు.
శివశంకర్ తరచూ ఓ విద్యార్థినిని వెంబడించేవాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నిరాకరిస్తూ, ఇది మంచి పద్దతి కాదని వారిస్తూ వచ్చేది. ఈక్రమంలో అతను ఈనెల 10న ద్విచక్ర వాహనంలో వెళ్లి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి ప్రేమిస్తావా? లేదా అంటూ బలవంత పెట్టాడు. భయాందోళన చెందిన ఆ విద్యార్థిని పరుగెత్తుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపింది. పోలీసులకు చెప్పాలా? లేక అతనితోనే మాట్లాడాలా? ఏం చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచించసాగారు. ఈ క్రమంలో విషయం స్థానికుల కు తెలిసింది. శనివారం ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేశా రు. పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.