పట్టణ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరు (వైఎస్సార్‌జిల్లా) : పట్టణ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.16. 60 లక్షల విలువైన 53 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు, ఒక ఆటో, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈశ్వర్ రెడ్డి(43), మహబూబ్‌పాష(36)లు ఇద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడేవారు. పట్టణ పరిధిలో 14 చోట్ల దొంగతనాలు చేసినట్లు వీరిపై కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి రూ. 16.60 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ పూజితా నీలం విలేకరుల సమావేశంలో తెలిపారు.