two thieves
-
ఇద్దరు దొంగలపై పీడియాక్ట్ నమోదు
రాజేంద్రనగర్ రంగారెడ్డి : వరుస దొంగతనాలకు పాల్పడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు దొంగలపై సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. గత నెలలో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు చిక్కిన ఇద్దరిపై మొదటిసారిగా పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అప్కోకాలనీలో సతీష్ ఉత్తమ్‌కుమార్ రాథోడ్(24), కేతావత్ రాజు(25)లు నివసిస్తున్నారు. రాథోడ్ ప్రైవేటు డ్రైవర్ కాగా, రాజు కూలి పని చేస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఆదర్శ్‌నగర్‌కాలనీ, ముస్తాఫానగర్, టీఎన్జీఓస్ కాలనీ, టాటానగర్, మధుబన్‌కాలనీలలో సంచరిస్తూ ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారు. అనంతరం ఇళ్లల్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను తస్కరించేవారు. కేవలం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 8 దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనమే వృత్తిగా ఎంచుకున్న వీరు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం తిరిగి ఇదే దందాను కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులతో పాటు స్థానికులకు కంటినిద్ర కరువైంది. గత నెల 7వ తేదీన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు నిందితులిద్దరూ పట్టుబడ్డారు. ఆ సమయంలో వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సైబరాబాద్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. -
కటకటాల వెనక్కు జంట దొంగలు
కందుకూరు: ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిన జోడు దొంగలను పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. అందులో ఓ దొంగ రైళ్లలో ఒంటిరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు. ఏకంగా ఓ మహిళా ఐపీఎస్‌పై దాడి చేసి ఆమె వద్ద బంగారు నగలు తస్కరించాడు. స్థానిక సీఐ కార్యాలయంలో డీఎస్పీ ప్రకాశరావు మంగళవారం విలేకర్లకు వివరాలు వెల్లడించారు. చీరాల దండుబాట రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ ఇదయతుల్లా కుమారుడు షేక్ ఖాజావలి పండ్లు అమ్ముకోవడంతో పాటు, పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. నెల్లూరు జిల్లా నాయకుడుపేటకు చెందిన యువతితో వివాహమైంది. దీంతో నెల్లూరులో నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నేరాలకు అలవాటుపడ్డ ఖాజావలి, రైళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. దీనిలో భాగంగా 2015 సెప్టెంబర్ 9వ తేదీన సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పోలీస్ అకాడమీ ఎస్పీ స్థాయి అధికారి ఎస్ఎం రత్నపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెను తీవ్రంగా కొట్టడంతో పాటు చంపేందుకు ప్రయత్నించాడు. చివరకు ఆమె పోలీస్ అధికారి అని చెప్పడంతో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆమె వద్ద ఉన్న బంగారు చైను, గాజులజత, రెండు ఉంగరాలు, పర్సులోని రూ. 2300 నగదు లాక్కుకుని వెళ్లాడు. ఆ తరువాత 2016 నవంబర్‌లో సింహపురం ఎక్స్‌ప్రెస్‌లో నిద్రిస్తున్న మహిళ వద్ద నుంచి ట్రాలీబ్యాగ్‌ను దొంగిలించాడు. అందులోని గుడ్లహారం, హ్యాంగింగ్ కమ్మల జత, బాంబేసెట్ హ్యాంగింగ్ కమ్మల జత, కెంపులు, పచ్చలు పొదిగిన డాలరు, పెద్దగాజు, బంగారు కడియం, వెండి గిన్నెలు, పట్టుచీరలు దోచుకున్నాడు. కందుకూరు వాసితో కలిసి.. ఖాజావలి నేరాలు చేసే క్రమంలో కందుకూరు పట్టణంలోని పోతురాజుమిట్టకు చెందిన సుల్తాన్‌వలితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తరచూ మద్యం సేవిస్తుండేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన తెట్టు గంధం సందర్భంగా ఉలవపాడులోని రిజర్వుకాలనీలో ఓ ఇంటిలో ఇద్దరూ కలిసి దొంగతనం చేశారు. సవర బుట్టలు, జతజాలరుకమ్మలు, రూ. 15వేల నగదు దోచుకున్నారు. అప్పటి నుంచి కందుకూరు పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. లింగసముద్రం ఎస్సై కమలాకర్‌ను దొంగతనాల కేసులకు సంబంధించి ప్రత్యేకాధికారిగా నియమించి దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఖాజావలి, సుల్తాన్‌వలి ఇద్దరూ మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. తమదైన శైలిలో విచారించడంతో రైళ్లలో దొంగతనాలు, ఐపీఎస్ అధికారిపై దాడి కేసు, కందుకూరులోని దొంగతనాలు వంటి విషయాలు బయటకు వచ్చాయి. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన ఎస్సై కమలాకర్, సీఐ నరసింహారావును డీఎస్పీ అభినందించారు. ఎస్పీ ద్వారా రివార్డులు అందజేస్తామన్నారు. పొన్నలూరు ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కరీంనగర్లో ఇద్దరు దొంగలు అరెస్ట్
-
ఇద్దరు దొంగల అరెస్ట్
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గంలోని పలు కాలనీలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ శంకర్‌రెడ్డితో కలసి ఆయన దొంగలను మీడియా ఎదుట హాజరుపరిచారు. స్థానిక దేవీరమ్మ కాలనీలో దాసరి రాజు, హులికల్లుకు చెందిన పెద్దింటి కిష్టప్ప అనే దొంగలను హులికల్లు క్రాస్‌లో ఉండగా అరెస్ట్ చేసినట్లు వివరించారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
విమానంలో వచ్చి కారులో తిరుగుతూ చోరీలు..
హైదరాబాద్: హాలీవుడ్, బాలీవుడ్ క్రైమ్ సినిమాల్లో చూపించినట్లు.. దర్జాగా విమానంలో వచ్చి, కారులో ప్రయాణిస్తూ వీలున్న చోటల్లా చోరీలు చేసి మళ్లీ ఎంచక్కా విమానమెక్కి చెక్కేస్తాడు. స్థానికంగా ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటోన్న మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులు.. వివిధప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించి దొంగతనాలకు సంబంధించిన ప్లాన్లు రూపొందిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో అలజడిరేపుతోన్న ఈ ముఠాను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ బుధవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలాఉన్నాయి.. గడిచిన మూడేళ్లుగా హైదరాబాద్ లో ముగ్గురు ఒడిశా యువకులు దాదాపు 100 దొంగతనాలకు పాల్పడ్డారు. వీళ్ల క్రైమ్ ఆపరేషన్లు ఆద్యాంతం హైటెక్ పద్ధతిలో సాగుతాయి. సుశాంత్ కుమార్ పాణిగ్రాహి, ప్రేమానంద్ ప్రధాన్ అనే ఇద్దరు సబ్యులు ఎస్.ఆర్. నగర్ లోని భారతి ఎస్టేట్ అనే ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్నారు. వీళ్ల నాయకుడిపేరు ప్రశాంత్ కుమార్ అలియాస్ తుళ్లు. సిటీలో వివిధప్రాంతాల్లో సంచరించే సుశాంత్, ప్రేమానంద్ లు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసే వీలుంటుందో రెక్కీ నిర్వహిస్తారు. వివరాల్ని తమ బాస్ కు చేరవేస్తారు. ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆపరేషన్ మొదలుపెడతారిలా.. దొంగతనం చేయాల్సిన రోజున గ్యాంగ్ లీడర్ తుళ్లు భువనేశ్వర్ లో విమానం ఎక్కి హైదరాబాద్ కు వస్తాడు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎస్.ఆర్.నగర్ లోని హాస్టల్‌కు వెళ్లి సహచరులను కలుస్తాడు. ముగ్గురూ ప్లాన్ గురించి సమగ్రంగా చర్చించుకుంటారు. కారులో బయలుదేరి స్పాట్ కు చేరుకుని గుట్టుచప్పుడుకాకుండా చోరీకి పాల్పడతారు. ఆపరేషన్ పూర్తయినవెంటనే ఎవరి వాటాలు వాళ్లు పంచుకుంటారు. సుశాంత్, ప్రేమానంద్ లు తిరిగి హాస్టల్ కు వచ్చేస్తారు. ప్రశాంత్ అలియాస్ తుళ్లు.. మళ్లీ విమానంలో భువనేశ్వర్ వెళ్లిపోతాడు. కూకట్ పల్లి, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, బోయిన్ పల్లి, హుమాయన్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డవీరి నుంచి రూ.8 లక్షల నగదుతోపాటు విలువైన ఆభరణాలు, ఒక ఆల్టో కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కార్తికేయ చెప్పారు. జల్సాలకు అలవాటు పడిన ఈ ముగ్గురూ చోరీలనే వృత్తిగా ఎంచుకున్నారని, ఏపీలోని విశాఖపట్టణంలోనూ పలు దొంగతనాలు చేశారని పేర్కొన్నారు. -
తాళాలు వేసిన ఇల్లే టార్గెట్
-
ఇద్దరు దొంగలు అరెస్ట్: 33 బైక్‌లు సీజ్
-
ఇద్దరు దొంగలు అరెస్ట్: 33 బైక్‌లు సీజ్
అనంతపురం : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్రవాహనాలను చోరీ చేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 33 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
నెల్లూరు : ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలు మారుబోయిన గిరీష్ అలియాస్ గిరి, పర్వతనేని మధుసూదన్‌లను నెల్లూరు వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అలాగే సదరు దొంగల వద్ద నుంచి కొనుగోలు చేసిన వ్యాపారి వినోద్‌కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్ : 53 తులాల బంగారం స్వాధీనం
ప్రొద్దుటూరు (వైఎస్సార్‌జిల్లా) : పట్టణ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.16. 60 లక్షల విలువైన 53 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు, ఒక ఆటో, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈశ్వర్ రెడ్డి(43), మహబూబ్‌పాష(36)లు ఇద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడేవారు. పట్టణ పరిధిలో 14 చోట్ల దొంగతనాలు చేసినట్లు వీరిపై కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి రూ. 16.60 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ పూజితా నీలం విలేకరుల సమావేశంలో తెలిపారు. -
వాళ్లు చూశారంటే...తాళం పగలాల్సిందే..
వరంగల్: తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరూ రెండు జిల్లాల్లో తమదైన శైలిలో చెలరేగి పోయారు. చివరికి వారిని వరంగల్ రూరల్ పోలీసులు వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రూరల్ ఎస్పీ అంబర్కిశోర్ ఝా మంగళవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీకి చెందిన తూర్పటి ప్రసాద్, నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన సిరిగిరి సాయిబాబా.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవారు. వ్యసనాలకు బానిసైన ప్రసాద్ 9 ఇళ్లల్లో చోరీలు చేశాడు. వరంగల్ జిల్లా పరిధిలోని పలు నగరాల్లో తాళం వేసిన ఇళ్లలో అతడు దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడు చోరీ సొత్తుతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ వచ్చాడని అందిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఉదయం మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నాడు. మరో నిందితుడు సాయిబాబా మహబూబాబాద్ పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. ఇతడు మంగళవారం ఉదయం మరిపెడ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించాడు. ఇద్దరి నుంచి రూ.12.77 లక్షల విలువైన 499 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలతోపాటు ల్యాప్‌ట్యాప్, డీవీడీ ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
అనంతలో దొంగలు అరెస్ట్
అనంతపురం: అనంతపురం నగరంలో ఇద్దరు దొంగలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వారిపై కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారిస్తున్నారు. శుక్రవారం పోలీసులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
దొంగలు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం
విశాఖపట్నం: విశాఖపట్నంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.65 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. పట్టుబడిన దొంగలు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. -
57 ఆలయాలను దోచేశారు!
పూజారి దృష్టి మళ్లించి చోరీలు జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి మళ్లీ చోరీకి వచ్చి పట్టుబడిన వైనం సిటీబ్యూరో: ఇద్దరు దొంగలు జతకట్టారు. దేవుళ్లనే దోచుకున్నారు. పూజారి దృష్టి మరల్చి గర్భగుడిలోకి వెళ్లి దేవుళ్ల నగలు, పూజా సామగ్రి ఎత్తుకెళ్లడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు 57 గుళ్లను దోచుకున్నారు. గతంలో పలుమార్లు జైలుకెళ్లి వచ్చారు. అయినా బుద్ధిమార్చుకోకుండా మళ్లీ రెండేళ్లుగా జంట కమిషనరేట్ల పరిధిలో పంజా విసురుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ద్వయం చివరకు జూబ్లీహిల్స్ పోలీసులకు మంగళవారం చిక్కింది. పోలీసుల విచారణలో నగరంతో పాటు సైబరాబాద్‌లో మొత్తం 22 చోరీలకు పాల్పడినట్టు తేలింది. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈమని రాంబాబు అలియాస్ రాంపవన్ (48) చైతన్యపురిలోని సాయినగర్‌కాలనీలో ఉంటున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఏక్నాథ్ మణి అలియాస్ బాలాజీ (52) సుల్తాన్‌బజార్‌లో ఉంటున్నాడు. ఇద్దరూ గతంలో వేర్వేరుగా చిన్న చిన్న చోరీలు చేసి జైలుకెళ్లారు. అక్కడ ఇద్దరికీ పరిచయం అయింది. బయటకు వచ్చాక ఇద్దరూ ముఠాగా ఏర్పడి గుళ్లలో చోరీ చేస్తున్నారు. దృష్టి మరల్చి... ముందుగా ఇద్దరూ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తారు. తర్వాత టార్గెట్ చేసిన గుడి వద్దకు బైక్‌పై వస్తారు. ఒకడు బయట బైక్ పార్క్ చేసి నిలబడగా.. మరొకడు గుడి లోపలికి వెళ్లి పూజారికి మాయమాటలు చెప్పి దృష్టి మళ్లిస్తాడు. నెమ్మిదిగా గర్భగుడిలోకి వెళ్లి దేవుడి మెడలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, పూజసామగ్రి మూటకట్టుకొని బయటకు వస్తాడు. బయట సిద్ధంగా ఉన్న బైక్‌పై పారిపోతారు. ఇలా వీరు నగరంలో జూబ్లీహిల్స్, షాహినాత్‌గంజ్, ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, ఎస్ఆర్నగర్, సంతోష్‌నగర్, మాదన్నపేట, హుస్సేనీఆలం, చార్మినార్, కాచిగూడ, అంబర్‌పేట, సైదాబాద్, ఓయూ, మలక్‌పేట, గోపాలపురం, తుకారాంగేట్, బోయిన్పల్లి, అబిడ్స్, ఎల్బీనగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. గతంలో రాంబాబు, బాలా జీ కలిసి కుషాయిగూడలో- 3, చిక్కడపల్లిలో -4, ముషీరాబాద్‌లో 2, బేగంపేట, కామాటిపురా, పంజగుట్ట, చాదర్‌ఘాట్, మల్కాజిగిరి, నాపంల్లి, సుల్తాన్‌బజార్, సైదాబాద్, అంబర్‌పేటలలో ఒ క్కొక్కటి చొప్పున, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 15 ఆలయాలను దోచుకున్నారు. ఇలా పట్టుబడ్డారు... రాంబాబు, బాలాజీలు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఓ ఆలయంలో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహిస్తుండగా వీరిపై అనుమానం వచ్చి అదనపు ఇన్స్పెక్టర్ కె.ముత్తు, ఎస్ఐ కె.రమేష్ అదుపులోకి తీసుకున్నారు. విచారించగా రెండేళ్లలో నగరంలో 20, సైబరాబాద్‌లో 2 చోరీలు చేసినట్లు అంగీకరించారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 3 తులాల బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, చోరీల నివారణ కోసం నగరంలోని ప్రతీ గుడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు.